1. శరీరాకృతి (Shape of Body) శరీర నిర్మాణం, ఎత్తు పొడవు, రంగు, చర్యం, శిరోజాలు
2. మానసిక లక్షణాలు (Mental Characteristics) – సహజాతాలు, సహజ సామర్థాలు, ప్రజ్ఞ, స్మృతి, అలోతున వివేచన, సృజన్మాత్మకత, అవధానం, గ్రహణశక్తి
3. మూర్తిమత్వ లక్షణాలు(Personality)- అలవాట్లు, వైఖరులు, ధోరణులు, అభిరుచులు, నమ్మకాలు,
4.ప్రవర్తనా లక్షణాలు (Behavioural)- సర్దుబాటు, ప్రవర్తన
| శాస్త్రవేత్త (Scientist) | పరిశీలనలు(Research) | 
| Francis Galton ప్రాన్సిస్ గాల్టన్ | ఇంగ్లాండ్ దేశస్థుడు. రాయల్ సొసైటీ సభ్యులను అధ్యయనం చేశాడు.. కుటుంబసంకలనం పద్ధతికి అద్యులు. ప్రజ్ఞకు, అనువంశికతకు సంబంధం ఉందని చెప్పాడు.. > తెలివి గల తల్లిదండ్రులకు ప్రతిభాశీలురైన శిశువులు జన్మిస్తారని చెప్పారు. > గాల్టన్ 997 కుటుంబాలపై పరిశోధన చేసి 580 కుటుంబాలు లక్షణాలకు లోబడి వున్నాయని పేర్కొన్నారు. 1) Heridity Genious 2) An Enquires into human faculties and its development | 
| కెల్లాగ్ | > కెల్లాగ్ దంపతులు తమ సంతానం అయిన డొనాల్డోతో పాటు చింపాజీ అయిన ‘గువా’ ను కూడా పెంచారు. > అయితే కొద్దిరోజుల తర్వాత డౌనాల్డోలో మానసిన వికాసం బాగా అభివృద్ధి చెందితే, గువాలో జంతు లక్షణమైనా చలన వికాసం బాగా అభివృద్ధి చెందింది | 
| గోర్డార్డ్ | >”కల్లికాక్” అనే సైనిక అధికారి కుటుంబాన్ని పరిశీలించారు. >మందమతులుగా, తెలివిగలవారిగా జన్మించడానికి కారణం అనువంశికత అని తెలియజేశాడు. > కల్లికాక్ కుటుంబాన్ని నైతికంగా పతనం చెందిన కుటుంబంగా వర్ణిస్తారు | 
| డాగ్డెల్ (Dugdale) | “జూక్స్” అనే తెగపై పరిశోధన చేశాడు. “డజాక్స్” అనే గ్రంథాన్ని రాసాడు.. > న్యూయార్క్ రాష్ట్ర పోలీసు కమీషనర్ > జూక్స్ కుటుంబ మూలపురుషుడైన ఒక వ్యక్తి నేరస్థుడైనందు వల్ల జూక్స్ వంశస్థులందరూ నేరస్థులు, దొంగలుగా ఉండటాన్ని పరిశీలించారు. | 
| విన్షిప్ (Winfish) | ఎడ్వర్డ్ అనే వ్యక్తిపై పరిశోధన చేసి వారి కుటుంబీకుల లక్షణాలే ఇతనిలో వున్నాయని గమనించారు. విద్యా సంబంధ విషయాలలో రాణించడానికి కారణం అనువంశికత అని తెలియజేశాడు. > వ్యక్తి వికాసం అధికంగా అనువంశికతపై ఆధారపడును | 
| W.H:ఫ్రీమాన్ (W.H.Freemon) | >అన్నదమ్ములు, కవలులపై పరిశోధన చేశాడు. >అనువంశికతకు, ప్రజ్ఞకు సంబంధ గుణకం కలదు అని చెప్పారు. సమరూప కవలలో ఈ సహసంబంధం ఎక్కువ | 
| పియర్సన్ (piarson) | >డార్విన్ కుటుంబంపై పరిశోధన వ్యక్తులలో అనువంశికత ప్రభావం అధికంగా వుందని పేర్కొన్నారు. > దత్తాంశ విశ్లేషణలో సాంఖ్యక పద్ధతులను ఉపయోగించాడు. హెూమినీ కుటుంబాన్ని కూడా అధ్యయనం చేశాడు. > బలహీన మనస్తత్వం, తక్కువ తెలివితేటలు అంగ వైకల్యానికి కారణం అన్నాడు. > అనువంశికత పరిసరాల కంటే ఏడు రెట్లు అధిక ప్రభావం. చూపుతుంది అని చెప్పాడు. | 
| ఆల్బార్ట్ | వ్యక్తుల సుఖదుంఖాలకు, వ్యక్తుల మధ్య వైవిద్యానికి పరిసరాలు కారకం కాదని, జన్యువులు ప్రభావం అధికం అని తెలియజేశాడు. | 
అనువంశికతా నియమాలు / మెండల్ నియమాలు (Rules of Heredity)
> ఆస్ట్రియా దేశానికి చెందిన జన్యు శాస్త్ర పితామహుడు, ఆస్ట్రియన్ మతాధిపతి అయిన గ్రెగర్ జోహాన్ మెండల్ తీసి బఠాణి మొక్కలపై ప్రయోగాలు జరిపాడు.
> అనువంశికతపై అనేక పరిశోధనలు చేసిన “గ్రెగర్ మెండల్” మూడు వికాస నియమాలు ప్రతిపాదించారు.
I. సారూప్య నియమం 2. వైవిధ్య నియమం 3.. ప్రతిగమన నియమం
1. సారూప్య నియమం(Law of similarity):
> ఒక జాతికి చెందిన, లక్షణాలు కల్గిన పిల్లలు ఆ జాతికి జన్మించడం జరుగుతుంది. అనగా “పూర్వీకుల లక్షణాలతోనే పిల్లలు జన్మిస్తారు.”
> దీనినే పోలికల సూత్రం అని కూడా అంటారు.
ఉదా :JP ప్రజ్ఞావంతులైన తల్లిదండ్రులకు ప్రజ్ఞావంతులైన పిల్లలు జన్మించడం.
ఉదా : 2) టండ్రా ప్రాంతంలోని పిగ్మీలు పొట్టిగా వుండటం వల్ల వారి సంతానం కూడా పొట్టిగానే వున్నట్లైతే ఇది ఈ నియమానికి చెందినది.
ఉదా : 3) భూమధ్యరేఖ ప్రాంతంలోని ప్రజలు అధిక ఉష్ణోగ్రత వల్ల నలుపు రంగుతో వుండటంలో వారి సంతానం అదే రకంగా వుంటే ఇది దీనికి చెందినది.
ఉదా : 1) తాతకు తగ్గ మనవడివిరా అనే సామెత.
ఉదా :6)దొంగ కడుపున దొర పుడతాడా ? అనే సామెత
ఉదా :6) పులి కడుపున పులే పుడుతుంది అనే సామెత.
ఉదా :7) వరి మొక్కలు వాటితే గోధుమలు పుడతాయా?
ఉదా :8) ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
ఉదా :9) అందమైన తల్లిదండ్రులకు అందమైన పిల్లలు జన్మించడం
ఉదా :10) జామ చెట్టుకు జామకాయలే కాస్తాయి.
ఉదా :11) మనిషికి మనిషే జన్మించడం
ఉదా :12) మంగోళి, నీగ్రో ప్రజల రూపమే వారి పిల్లలకు రావడం.
2. వైవిధ్య నియమంLaw of variation):
సారూప్య నియమానికి వ్యతిరేకమైనది.
ఒకే తల్లిదండ్రులకు జన్మించిన వారందరూ ఒకే అనునది దీనికి చెందినది.
> ఒకే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలలో వ్యత్యాసాలు ఉండటం ను వివరిస్తుంది.
ఉదా : 1) అన్నదమ్ములలో ఒకరు ప్రజ్ఞావంతులుగానూ మరొకరు ప్రజ్ఞాహీనులుగా వుండటం.
ఉదా : 2) ఒక కుటుంబ సంతానంలో వర్తులో లేదా వుండటం (లేదా) రంగులలో తేడావుండటం.
ఉదా : 3) అందమైన తల్లిదండ్రులకు అందవిహీనులు పుట్టడం
ఉదా :14) రావణుడు విభీషణుడు
ఉదా : 5) వాలి – సుగ్రీవుడు
3. ప్రతిగమన/తిరోగమన నియమం (Law of degreation):
> మేనరిక వివాహాల వల్ల గానీ, జన్యువుల తరుగుదల వల్ల గానీ తల్లిదండ్రులకు భిన్నమైన లక్షణాలు కల్గిన పిల్లలు. జన్మిస్తారు. ఇదే ప్రతిగమనం.
> జన్యువుల అసాధారణ కలయిక వలన, ప్రతిగమనం తిరోగమనం సంభవిస్తాయి.
> ప్రతిభావంతమైన పిల్లలకు తక్కువ స్థాయి ప్రతిభావంతులు జన్మించడం
ఉదా: 1) ఆరోగ్యవంతమైన తల్లిదండ్రులకు అనారోగ్య పిల్లలు జన్మించడం.
ఉదా : 2) “పండిత పుత్ర పరమ శుంఠ”. అనే సామెత దీనికి చెందినది.
ఉదా : 3) తాంబూలం వేసుకుంటే ఎరుపు రంగు రావడం లాంటిది.
గమనిక : ఎంత మంచి పరిసరాలు కల్పించినప్పటికి అధిగమించలేని హద్దు అనువంశికత కలిగిఉంటుంది.
ఉదా : కుక్క తోక వంకర,
 
				
 
 