వికాస సూత్రాలు / నియమాలు(Principles of Development)
వ్యక్తుల పెరుగుదల, వికాసాలు ఒక క్రమమైన నమూనాలను అనుకరిస్తాయి. వాటిని వికాస సూత్రాలని అంటారు.
ఉపాధ్యాయులు మౌలిక, వాస్తవాలైన వికాస సూత్రాలను తెలుసుకోవడం వల్ల విద్యార్థుల సంపూర్ణ వికాసానికి తోడ్పడగలుగుతారు. అవి
వికాసం అవిచ్చిన్నమైనది : (Development is un interrupted)
జీవి పుట్టుక నుంచి మరణం వరకు వికాసం నిరంతరం జరుగును.
అన్ని మార్పులు బయటికి కనిపించకపోయినా వికాసం నిరంతరం జరుగుతుంది. వేగాలను చూపవచ్చేమో గానీ, విచ్చిన్నత చూపదు.
ఉదా: 1) పిల్లలు పాఠశాలలో చేసుకొనే సర్దుబాటు నిరంతరం కొనసాగుతుంది.
ఉదా : 2) వయస్ సు పెరిగే కొద్ది పిల్లలలో ఆలోచనలు, నూతనత్వం, సృజనాత్మక కల్గుతూనే వుండటం.
వికాసం క్రమానుగతమైనది : (Sequence Pattern)
వికాస ప్రక్రియ వరుసక్రమంగా, ఖచ్చిత నమూనాను, క్రమానుగతంగా జరుగుతుంది.
ఉదా : 1) జన్మించిన శిశువు బోర్ల పడటం – కూర్చోవడం ఆధారంతో నిలబడటం మొదలగునవి చేస్తాడు.
ఉదా : 2) శిశువు మొదటగా అచ్చులను, హల్లులను, గుణింతాలను, పదాలను వాక్యాలను నేర్చుకోవడం
ఉదా : 3) గణిత ఉపాధ్యాయుడు అంకెలు, సంఖ్యలు, సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగహారం నేర్పడం.
ఉదా : 4) ఉపాధ్యాయుడు పాఠ్యబోధనలో ISRW క్రమాన్ని ఉపయోగించడం.
ఉదా : 5) శిశువుకి పాలదంతాలు, శాశ్వత దంతాలు, జ్ఞాన దంతాలు రావడం.
ఉదా : 6) పిల్లల భాష మొదట ముద్దు పలుకులుతో ప్రారంభమై, చిన్న చిన్న పదాలు, తరువాత వాక్యాలు ఉపయోగించడం.
వికాసం సంచితమైనది./ వికాసం సమైక్యమైనది (Development is cumulative)
వ్యక్తిలో ప్రసుత్తం కనబడే వికాసచర్య అనునది పూర్వపు అభ్యసన జ్ఞానంపై నిర్మితమవుతుంది. దాని ఆధారంగానే ప్రస్తుత వికాసం వికసిస్తుంది.
శారీరక మార్పులు, మానసిక మార్పులు ఒక్కసారిగా జరగవు. గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగా కొత్త మార్పులతో వికాసం జరుగుతుంది.
ఈ వికాస నియమం ప్రతి వ్యక్తిలో ఖచ్చితంగా జరగాలని లేదు.
ఉదా : 1) బాలుడు అంకెలు, సంఖ్యలు, సంకలనం, వ్యవకలనం, గుణకారాలను నేర్చి తద్వారా భాగహారాన్ని పూర్తి చేయడం.
ఉదా :2) పిల్లలు అక్షరాలను, పదాలను నేర్చిన తర్వాత వాటి సహకారంతో వాక్యాలను నిర్మించగలగడం.
ఉదా :3) పిల్లలలో తొలి దంతం (పాలదంతాలు) రావడం, తొలి అడుగులు వేయడం, హఠాత్తుగా కనబడినను ఈ ప్రక్రియ ఎంతో ముందు నుంచి జరుగును.
ఉదా :4) వర్ణమాల నేర్చుకున్న విద్యార్ధి వాని ఆధారంగా గుణింతాలు, పదాలు, వాక్యాలు నేర్చుకోవడం.
ఉదా :5) సైకిల్ తొక్కడం నేర్చుకున్న వ్యక్తి దాని ఆధారంగా మోటార్ సైకిల్ నడపడం నేర్చుకోవడం
ఉదా :6) విధ్యార్థి పదాల ఆధారంగా వాక్యాలు తయారు చేయగలగడం
4. వికాసం సాధారణం నుంచి నిర్దిష్టంకు జరిగే ప్రక్రియ: (General to specific)
> జీవులందరితో వికాస చర్య అనునది సాధారణంగానే ప్రారంభమై వయస్సు పెరిగే కొద్ది/అనుభవ చర్యలతో ఉన్నతంగానీ (లేదా) నిర్దిష్టంగా గానీ ఏర్పడును.
ఉదా :1)శిశువులో మొదటి ఉద్వేగం అయినా ‘ఉత్తేజం’ మూడు నెలలకు ప్రారంభమై క్రమంగా సంతోషకరమైన ఉద్వేగాలుగానూ, బాధాకరమైన ఉద్వేగాలుగానూ విభజన చెందడం.
ఉదా :2)చదునైన నేలపై రూపాయి బిళ్ళను చిన్నపిల్లలు అన్నీ వేళ్ళు చేతి సహాయంతో తీయగలిగితే, వయోజనులు రెండు వేళ్ళ సహాయంతో తీయగలగటం,
ఉదా :3)శిశువు చిన్నతనంలో స్త్రీలనందరినీ అమ్మ అని పిలిచి, అమ్మ అనే పదాన్ని కేవలం తన తల్లికి మాత్రం ఉపయోగించడం.
ఉదా :4)భౌతిక వికాసం: కూర్చోపటం, నిలబడటం, నడవటం తేలిక పనుల నుండి మెట్లు ఎక్కడం, సెకిల్ తొక్కడం లాంటి పనులు చేయటం
ఉదా :5) ఉద్వేగ వికాసం : నవజాత శిశువులో సర్వసాధారణ ఉద్రిక్తత అనే ఒకే ఒక ఉద్వేగరీతి ఉంటుంది. ఆ తరువాతనే అసూయ, కోపం, భయం లాంటి ఉద్వేగాలు అభివృద్ధి చెందుతాయి.
ఉదా :6)వస్తువును పట్టుకోవడానికి మొత్తం వేతిని ఉపయోగించే శిశువు దానిని కేవలం చేతివేళ్ళతో పట్టుకోవడం
ఉదా :7)బోధన తెలిసిన విషయం నుండి తెలియని విషయానికి సాగడం
ఉదా :8)బోధన మూర్త విషయం నుండి అమూర్త విషయానికి సాగడం
5. వికాసం ఒక దానిపై ఒకటి ఆధారపడుతుంది / వికాసం ఏకీకృత మొత్తంగా సాగుతుంది: (Inter related)
> పిల్లలలో వుండే వికాసాలన్నీ ఒకదానినొకటి అనుసంధానించబడి వుంటుంది.
> ఏవికాసం ఇబ్బందికి గురైనా మరొక వికాసం దాని ప్రభావానికి కావచ్చు (లేదా) ఒక వికాసం
అభివృద్ధి చెందితే వేరొక వికాసం కూడా అభివృద్ధి చెందితే వేరొక వికాసం కూడా అభివృద్ధి చెందవచ్చు.
ఉదా :1 ధృఢమైన మనస్సులో ధృఢమైన శరీరం ఉంటుంది. (A Sound mind in a Sound body)
ఉదా :2 ఆరోగ్యవంతమైన మనస్సులో ఆరోగ్యవంతమైన శరీరం ఉంటుంది.
ఉదా :3 భౌతిక వికాసం దెబ్బతిన్న ఒక బాలుడు మానసిక సాంఘిక వికాసాలు కూడా దెబ్బతినవచ్చు.
ఉదా :4 మానసిక వికాసం ప్రభావం నైతిక వికాసం, సాంఘిక వికాసం పై ఆధారపడి ఉంటుంది.
6. వికాసం ఒక పరస్పర చర్యగా సాగుతుంది:
> వికాసం అభివృద్ధి చెందాలంటే పిల్లలలోని అనువంశికత, నైపుణ్యాలకు చక్కటి పరసరాలు వున్నట్లైతే వాటి చర్యతో వికాసం అభివృద్ధి చెందుతుంది.
> వికాసం పై అనువంశికత, పరిసరాల పరస్పరాధారితంగా జరుగుతుంది.
ఉదా :1) SP బాలసుబ్రమణ్యంకు లభించిన గాత్రం దానికి అనుగుణంగా కల్గిన శిక్షణ అతనిని ఉన్నత స్థానానికి చేర్చాయి.
ఉదా :2) మూఢులకు మంచి పరిసరాలు కల్పించిన ఆశించిన ఫలితం రాకపోవచ్చు.
ఉదా : 3) సగటు ప్రజ్ఞావంతునికి మంచి శిక్షణ ఇస్తే గొప్పఫలితాన్ని పొందవచ్చు.
ఉదా : 4) వికాసం = వ్యక్తిలోని అనువంశికత +పరిసర ప్రభావం
ఉదా :5) శిశువుకు తల్లిదండ్రుల నుండి నుంచి గాత్రం లభించినట్లయితే దానికి సరైన శిక్షణ, ప్రోత్సాహం నుంచి గాయకుడుగా ఎదగడం..
ఉదా :6) విద్యార్థి నిపుణుల వద్ద శిక్షణ తీసుకోవడం
7. వికాసం వైయుక్తిక బేధాలను చూపే ప్రక్రియ: (Individual Differences)
> దీనినే వికాస అసమానసూత్రము అని అంటారు..
> ఏ ఇద్దరిలో కూడా ఒకే వికాసం వుండదు. అనగా ఇది వ్యక్తికీ – వ్యక్తికి మారే వైయుక్తిక చర్య
> ఏ ఇద్దరిలో వికాసం సమానగతిని/ వైయక్తిక భేదాలను అనుసరించదు.
ఉదా :1) తరగతిలోని ఉపాధ్యాయుడు విద్యార్థులను అనుసరించి ప్రాజెక్టు పని కల్పించడం.
ఉదా :2) ఉపాధ్యాయుడు పాఠశాల సమయానంతరం కొంతమంది విద్యార్థులకు మాత్రమే రెమిడియల్ టీచింగ్ కల్పించడం.
ఉదా :3) తరగతి ఉపాధ్యాయుడు ఒక్కో విద్యార్థిని ఒక్కో ప్రశ్న ను అడగడం,
ఉదా :4) చలన కౌశలాలు అభివృద్ధిలో పిల్లలో రేడాలుంటాయి.
ఉదా : 5) కొందరు పిల్లలు తొందరగా మాట్లాడటం, నిలబడటం చేయరు.
ఉదా :6 విద్యార్థుల గ్రహణ శక్తిలోనూ, విద్యాసాధనలో ప్రగతిలో తేడాలుంటాయి.
8. వికాసం అన్ని దశలలో ఒకే రకంగా వుండదు (Not all stages to same)
> వికాస ప్రక్రియ అన్నీ దశలలో ఒకే విధంగానూ, ఒకే వేగాన్ని చూపదు
ఉదా : 1) శైశవ దశలో వుండే పెరుగుదల రేటు బాల్యదశలో లేకపోవడం.
ఉదా : 2) మానసిక వికాసం శైశవ దశలో తక్కువ గానూ, బాల్యదశలో ఎక్కువ గానూ వుండటం.
ఉదా :3) పూర్వబాల్య దశలో ఉద్వేగాలు అస్థిరం, ఉత్తర బాల్య దశలో ఉద్వేగాలు స్థిరం,
ఉదా :4) పూర్వభౌమారంలో ఉద్వేగాలు అస్థిరం, ఉత్తర కౌమారంలో ఉద్వేగాలు స్థిరం.
ఉదా :5) సాంఘిక వికాసం శైశవ దశలో తక్కువ బాల్య దశలో ఎక్కువ..
ఉదా :6) మొదటి మూడు నెలల్లో వికాసం వేగంగా ఉండును. ఆరు నుండి పన్నెండు సంవత్సరాల వరకు వేగం తగ్గి, తిరిగి కౌమారదశను చేరేనాటికి వేగవంతం అవుతుంది..
ఉదా :7) నవజాత శిశు దశ లో వికాసం ఎక్కువ వేగం, బాల్యదశలో వికాసం తక్కువ వేగం.
9. వికాసం రెండు దశలను అనుసరిస్తుంది: (Development is followed by two stages)
a) శిరః పాదాభిముఖ వికాస నియమం: వికాసం అనుధైర్ఘ్యంగా శిశువు శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది.
> వికాసం అనే ప్రక్రియ తల్లి గర్భం నుంచి శిరస్సుతో ప్రారంభమై క్రమంగా వెన్నెముక, కాళ్ళు – చేతులకు ప్రసరిస్తుంది.
> ఇది శాస్త్రీయమైనది.
ఉదా: జనన పూర్వదశలో మొదట శిశువుకి శిరస్సు ఏర్పడిన తర్వాతనే క్రమంగా వెన్నెముక, కాళ్ళు చేతులు ఏర్పడటం.
b) సమీప దూరస్థ వికాస నియమం+చికాసం శరీరం కేంద్రం నుండి శరీర భాగాలకు విస్తరిస్తుంది.
> వికాసం శరీర మధ్యస్థ భాగంలో ఏర్పడి క్రమంగా శరీర ఇతర భాగాలకు ప్రాకడం జరుగుతుంది.
ఉదా : 1) చేతి వేళ్ళతో బరువు తీయాలంటే మొదట భుజం, మోచేయి, మణికట్టు ద్వారా బలాన్ని ఉపయోగించడం.
10. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు (Development can be practicums)
జీవిలో జరిగే వికాస ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితి బట్టి భవిష్యత్తుకు ఊహించవచ్చు. దీనినే “ప్రాగుక్తీకరణ” అంటాం.
ఉదా: 1) బాల్యదశలో శిశువు యొక్క శరీరాకృతిని బట్టి వీరు భవిష్యత్తులో స్థూలకాయం, మధ్యమకాయన, లంబాకృశ కాయత అని ఊహించడం
ఉదా: 2) ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్ధి గణితంలో చూపించే వేగం, ఖచ్చితత్వం, సరళత ప్రక్రియ ఆధారంగా భవిష్యత్తులో ఇంజనీరు అయ్యే అవకాశం వుందని దీనించారు.
ఉదా :3) శిశువు మణికట్టు ఎముక ఎక్స్రే ద్వారా అతడి శారీరక పరిమాణం ఎంత పెరుగుతుంది అని చెప్పడం.
ఉదా : 4) శిశువు ప్రస్తుత మానసిక సామర్థ్యం ఆధారంగా అంతిమ మానసిక వికాసాన్ని అంచనా వేయడం
ఉదా :5) 3సంవత్సరాల పిల్లవాని ఎత్తును బట్టి పద్దెనిమిది సంవత్సరాల వయస్సులో ఎత్తును తెలవడం
ఉదా :6) భవాని గిసిన ప్రస్తుత చిత్రం ఆధారంగా ఆమె ప్రముఖ చిత్రకారిని అవుతుంది అని ఊహించడం
11. వికాసం జీవితాంత ప్రక్రియ (Development is lifelong process)
> వికాసం నిరంతరంగా జరుగుతుంది. పుట్టినప్పటి నుండి ప్రారంభమై వికాసం మరణం వరకు కొనసాగుతుంది. వ్యక్తి మూర్తిమత్వం వికాసం నిరంతరం కొనసాగుతుంది.
12. వికాసము సర్పిలమైనది / అరేఖీయమైనది.
శిశువులో వికాసం ముందుకు, వెనుకకు సాగుతూ జరుగుతూ ఉంటుంది. కావున వికాసం సర్పిలమైనది / అరేఖీయమైనది.
ఉదా: శిశువు పడిపోవడం, లేవడం, నడవడం, పదేపదే పడిపోవడం, లేవడం ద్వారా నడకను నేర్చుకోవడం
< వికాస సూత్రాలు, విద్యా అనుప్రయుక్తాలు, >
> ఉపాధ్యాయులు విద్యార్థులలో జరిగే వికాసాభివృద్ధి, నమూనాలు, గురించి తెలుసుకొంటారు. విజయ దశలు. ప్రక్రియలు, వైయక్తిక భేదాలు మొ॥వాటి
ఉపాధ్యాయులు విద్యార్థులను సరిగా అవగాహన చేసుకొని వారి వికాసానికి అవసరమయ్యే అవకాశాలు కల్పించి, సరైన ప్రోత్సాహాన్ని అందించి, వారిలో అభిలషణీయమైన వికాసాభివృద్ధి జరగడానికి సహాయపడతారు.
> వివిధ దశలలోని విద్యార్థుల నుంచి ఏ దశ వయస్సులో ఏమి ఆశించవచ్చు. వారు విద్యను ఆర్జించడానికి ఎప్పుడు సంసిద్ధతను వారి విద్యాభివృద్ధిని పెంపొందించ దానికి తగిన అవకాశాలు సాధిస్తారు అనే విషయాలను ఉపాధ్యాయులు గ్రహించి, కల్పించి సహాయపడతారు.
ఉపాధ్యాయులు విద్యార్థులలో భేదాలు ఉంటాయని, అందరినుంచీ ఒకే రకమైన ఫలితాన్ని ఆశించరాదని, వారి వారి శక్తి, సామర్థ్యాలు, సహజ సామర్థాల ఆధారంగా విద్యను అందించాలని, భవిష్యత్ లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి సహాయపడాలని తెలుసుకొంటాడు.
> విద్యార్థులకి అవసరమయ్యే ప్రేరణను అందించి తగిన విద్యా ప్రణాళికను రూపొందించుకొంటారు. విద్యార్థులందరి నుంచి ఒకేరకమైన సాధనను ఆశించినట్లయితే తక్కువ సామర్థ్యం గలవారిలో న్యూనత భావం ఏర్పడి విద్యకు దూరమయ్యే అవకాశం ఉంటుంది.
> విద్యార్థుల స్థాయికంటే తక్కువ ఫలితాన్ని ఆశిస్తే, వారిలో ప్రేరణ లోపించి విద్యపట్ల ఆసక్తి తగ్గే ప్రమాదం ఉంటుంది.
ఉపాధ్యాయులు విద్యార్థుల శక్తి, సామర్థ్యాలను సరిగ్గా అంచనా వేయకుండా అందరికీ ఒకేరకమైన బోధనను అందిస్తే, వారిలో జరగవలసిన విద్యాభివృద్ధిని అడ్డుకొన్నవారవుతారు.
▸ఉపాధ్యాయులు వైయక్తిక భేదాల గురించి తెలుసుకొన్నట్లయితే, విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా విద్యావకాశాలు కల్పించి, వారిలో సరైన వికాసాభివృద్ధికి తోడ్పడగలుతారు.
> విద్యార్థులలో సరైన వికాసాభివృద్ధి జరగడానికి వారి అనువంశికతతో పాటు ప్రోత్సాహ కరమైన పరిసరాలు అవసరమవుతాయి.
> ఉపాధ్యాయులు వారికి తగిన వాతావరణం కల్పించడానికి వికాస సూత్రాల అధ్యయనం సహాయపడుతుంది.
> వికాస సూత్రాల అధ్యయనం వల్ల ఉపాధ్యాయులు విద్యార్థుల విద్యా, వికాసాభివృద్ధికి కావలసిన మార్గదర్శకత్వాన్ని అందించగలరు.
> విద్యార్థుల వికాసానికి సరిపడే అవకాశాలు కల్పించి, ప్రోత్సాహం అందించడం ద్వారా ఎలాంటి ఆలస్యం, అడ్డంకుల లేకుండా వారిలో వికాసాభివృద్ధి జరగడానికి ఉపాధ్యాయులు సహాయపడగలరు.
> పెరుగుదల, వికాసం పరస్పర సంబంధమైనవని, పరస్పర ఆధారమైనవని తెలుసుకోవడం వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులలో అన్ని వికాసాలు సక్రమంగా జరిగి సామరస్యాభివృద్ధితో సంపూర్ణ మూర్తిమత్వం సాధించడానికి తోడ్పడగలరు
 
				
 
 