AP TET 2025 Psychology – Introduction to Child Development

AP TET 2025 Psychology – Introduction to Child Development

జీవిలో జరిగే పరిమాణాత్మక గుణాత్మకమైన మార్పులను వికాసం అంటారు..

         ⁠నిర్దిష్టమైన క్రమానుగత పద్ధతిలో జరిగే స్థిరమైన మార్పులను సూచించేది వికాసం

         ⁠పెరుగుదలతో పాటు వచ్చే గుణాత్మక మార్పులే వికాసం.

         ⁠వికాసం ప్రమాణాత్మకమైన మార్పులను సూచిస్తుంది.

         ⁠ఒక వ్యక్తిలో జరిగే మానసిక మార్పుల వివరణను తెలియజేసేది వికాసం.

         ⁠వ్యక్తుల మానసిక, సంజ్ఞానాత్మక, సాంఘిక, నైతిక, ఉద్వేగ మొదలైన గుణాత్మక అంశాలలో వృద్ధిని సూచిస్తుంది.

         ⁠శిశువు యొక్క విధులలో సమర్ధత, క్లిష్టత, నైపుణ్యాభివృద్ధియే వికాసం.

         ⁠వికాసం అనునది క్రమబద్ధమైన, పొందికైన పురోగమన మార్పు.

         ⁠పురోగమనం అనునది మార్పులు నిర్దేశితమైనవి అని సూచిస్తుంది. అనగా మార్పులు వెనుకకు కాకుండా ముందుకు సాగుతాయి అని అర్ధం..

         ⁠క్రమబద్దమైన, పొందికైన అను పదాలు జరిగే మార్పులు, జరిగిన, జరుగబోయే మార్పుల మధ్య ఖచ్చితమైన సంబంధం ఉంటుందని సూచిస్తాయి.

వికాసం అనునది కార్యాత్మక ప్రక్రియ కావున నిరంతరం మార్పు చెందును.

ఉదా : మనం నిత్యం ఉపయోగించే తెలివైనవారు, మంచి అభిరుచి కలవారు, సామర్థ్యాలు, ప్రజ్ఞ, కౌశలాలు, సృజనాత్మకత, సాంఘికీకరణం మొదలైనవి.

పెరుగుదల, వికాసాలు పరస్పరం ఏకకాలంలో సాగుతూ, ఒక దానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి.

             ఉదా: శిశువు కూర్చోవడం, నడవడం, మాట్లాడటం, కంటే ముందు ఎముకలు, కండరాలు, నాడీమండలం, మొదలైన వ్యవస్థలతో మార్పు చెందును.

 (Differences between Development & Growth)

పెరుగుదల(Growth). వికాసం  (Development)
1.⁠ ⁠ఇది ప్రతి జీవిలో జరిగే పరిమాణాత్మక మార్పు
 2.⁠ ⁠పెరుగుదల కౌమారదశకు ఆగిపోతుంది.
 3.⁠ ⁠ఇది మూర్తమైన ప్రక్రియ. 
 4.⁠ ⁠దీనిని ఖచ్చితంగా కొలిచి చెప్పగలం. 
 5.⁠ ⁠పెరుగుదల లేకపోయినా వికాసం జరిగిపోవచ్చు. ఉదా: మరుగుజ్జులు 
 6.⁠ ⁠పెరుగుదల వికాసంలో ఒక భాగం.
 7.⁠ ⁠పెరుగుదల సంకుచితమైన చర్య.
 8.⁠ ⁠పెరుగుదల మార్పులు ప్రత్యక్షంగా కొలవవచ్చు.

 9.⁠ ⁠పెరుగుదల వలన వికాసం జరగవచ్చు/జరగకపోవచ్చు. 
10.⁠ ⁠పెరుగుదల అనుపదాన్ని శారీరక మార్పులకు మాత్రమే వాడతారు.
ఉదా: పొట్టిగా ఉన్న వారు తెలివైన వాడువటం.
11.⁠ ⁠పెరుగుదలను భౌతికంగా గుర్తించవచ్చు.
12.⁠ ⁠పెరుగుదల ను బహిర్గతంగా గుర్తించవచ్చు
13.⁠ ⁠పెరుగుదల జీవితాంతం కొనసాగదు
14.⁠ ⁠పెరుగుదల గణనాత్మకం
15.⁠ ⁠అంగ వైకల్యాలు పెరుగుదలకు అడ్డుగా నిలుస్తాయి
1.⁠ ⁠పరిమాణాత్మక గుణాత్మక మార్పులు కలయిక, మరియు పరిమాణాత్మకం + క్రియాత్మకం..
2 వికాసం నిరంతరమైనది. జీవిత పర్యంతరం సాగుతుంది.
3.⁠ ⁠ఇది అమూర్తమైన ప్రక్రియ.
4.⁠ ⁠ఖచ్చితంగా కొలిచి చెప్పలేం కానీ అంచనా వేయవచ్చు
5.⁠ ⁠జరిగే పెరుగుదల వికాసానికి దారి తీయవచ్చు. (సగటు కన్నా ప్రజ్ఞావంతులు) దారి తీయకపోవచ్చు. (సగటు కన్నా ప్రజ్ఞావంతులు)
6.పెరుగుదల కలయితే వికాసంగా చెప్పవచ్చు.
 7.⁠ ⁠ఇది విస్తృతమైనది మరియు సంకీర్ణమైనది.
8.⁠ ⁠వికాసం ఒక సంకీర్ణ ప్రక్రియ. వికాసం వలన కలిగే మార్పులు కొలవ దానికి వివిధ రకాల పరికరాలు, పద్ధతులు ఉపయోగించాలి.
9.⁠ ⁠పెరుగుదల లేకపోయినా వికాసం జరుగుతుంది.
10.⁠ ⁠వికాసం, వివిధ అంశాలు అంటే శారీరక, సాంఘిక, నైతిక మార్పులు సూచించడానికి వాడతారు
11.⁠ ⁠వికాసం అంతర్గతంగా జరుగుతుంది. దీన్ని చూడలేం
16.⁠ ⁠వికాసం పరిమాణాత్మకమైనది.
12.⁠ ⁠వికాసం అంతర్గత ప్రక్రియ, పరిశీలనకు అసాధ్యం
13.⁠ ⁠వికాసం జీవితాంతం జరిగే నిరంతర ప్రక్రియ
14.⁠ ⁠వికాసం ను అంచనావేయవచ్చు
15.⁠ ⁠అంగ వైకల్యాలలు వికాసానికి అడ్డు తగలవు
16.⁠ ⁠వికాసం ప్రమాణాత్మకమైనది.

🧩 Importance of Child Development in AP TET 2025

Understanding child development helps teachers:

  • Recognize individual differences among students
  • Plan age-appropriate lessons
  • Use motivation and reinforcement effectively
  • Handle classroom behavior positively
  • Support students with learning difficulties

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *