AP DSC 2024 Live Quiz | Psychology | As Per 2024 DSC Syllabus.

AP DSC 2024 Live Quiz | Psychology | As Per 2024 DSC Syllabus.

[gtranslate]

For your upcoming AP DSC 2024 Live Quiz on Psychology, based on the 2024 DSC syllabus, here’s how you can structure the event:

1. Title and Thumbnail:

  • Title: AP DSC 2024 Live Quiz | Psychology | As Per 2024 DSC Syllabus
  • Thumbnail Suggestions: Use bold, clear fonts highlighting “AP DSC 2024” and “Psychology Quiz”. Include engaging visuals such as icons of books, brain graphics (representing psychology), and a stopwatch for the quiz aspect.

2. Content Structure for the Live Quiz:

Introduction (2-3 minutes):

  • Greet the audience, briefly explain the purpose of the quiz, and mention that it’s aligned with the 2024 DSC Psychology syllabus.
  • Encourage participants to actively take part and answer questions in the chat.
  • Provide quick guidelines for answering (e.g., multiple-choice format, type answers in the chat).

Quiz Sections (30-40 minutes):

  • Section 1: Introduction to Psychology Concepts
    • 5-6 questions on the basic principles of psychology (cognition, behavior, motivation, etc.).
    • Example Question: Which psychological approach emphasizes unconscious drives?
    • (A) Cognitive Psychology
    • (B) Psychoanalytic Approach
    • (C) Behaviorism
    • (D) Humanism
  • Section 2: Learning Theories
    • 5-6 questions focusing on classical conditioning, operant conditioning, and other learning theories.
    • Example Question: Who is the pioneer of classical conditioning in psychology?
    • (A) B.F. Skinner
    • (B) Jean Piaget
    • (C) Ivan Pavlov
    • (D) Sigmund Freud
  • Section 3: Child Development and Educational Psychology
    • 5-6 questions on development theories (Piaget, Vygotsky) and how they relate to education.
    • Example Question: Which stage in Piaget’s theory is characterized by abstract thinking?
    • (A) Sensorimotor Stage
    • (B) Concrete Operational Stage
    • (C) Formal Operational Stage
    • (D) Preoperational Stage
  • Section 4: Intelligence and Personality
    • 4-5 questions covering theories of intelligence, multiple intelligences, personality traits, and assessments.
    • Example Question: Which theory suggests that intelligence is made up of a general ability and specific abilities?
    • (A) Spearman’s Two-Factor Theory
    • (B) Gardner’s Multiple Intelligences
    • (C) Sternberg’s Triarchic Theory
    • (D) Goleman’s Emotional Intelligence
  • Section 5: Motivation and Classroom Management
    • 4-5 questions that apply psychology to educational settings, focusing on student motivation and management techniques.
    • Example Question: According to Maslow’s hierarchy of needs, which is a basic physiological need?
    • (A) Self-esteem
    • (B) Safety
    • (C) Love/Belonging
    • (D) Food and Water

Interactive Engagement:

  • After every 3-4 questions, review the correct answers, explaining briefly why each option is right or wrong.
  • Ask participants to share their scores in the chat.

3. Conclusion (2-3 minutes):

  • Announce the highest scorers or acknowledge participants’ efforts.
  • Provide a brief overview of key concepts covered in the quiz.
  • Encourage viewers to like, subscribe, and share the content, and inform them about upcoming quizzes or study materials related to the AP DSC 2024.

4. Technical Tips:

  • Display each question on-screen clearly, with a countdown timer (optional).
  • Keep the pace dynamic to maintain interest.
  • Use interactive tools like polls or live Q&A to keep engagement high.

This structure should make your quiz both informative and interactive, helping participants reinforce their understanding of the AP DSC 2024 Psychology syllabus.

9th తెలుగు – పదజాలం | Mega DSC Special I Telugu Content

9th తెలుగు – పదజాలం | Mega DSC Special I Telugu Content

9th తెలుగు – పదజాలం

9th తెలుగు – పదజాలం | Mega DSC Special I Telugu Content

1. ధర్మబోధ

ఉద్దేశ్యం :

మానవులు చేసే ప్రతి పనికి ప్రతి సంకల్పానికి వారి అంతరాత్మ అసలైన సాక్షి. అంతరాత్మను చంపుకుంటే మనిషి తనని తాను వంచించుకున్నట్టే అవుతుంది. గృహస్త ధర్మాన్ని, సంతాన ప్రాధాన్యాన్ని, సత్యం గొప్పదనాన్ని గురించి చెప్పడమే పాఠం ఉద్దేశ్యం.

నేపధ్యం :

విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలని తపస్సు చేస్తున్నాడు. అతని తపస్సు భంగం చేయడానికి దేవతలు మేనకని పంపారు. వారిద్దరికీ ఒక బాలిక జన్మించింది. ఆ శిశువును శకుంత అనే జాతి పక్షులు కాపాడాయి. అందువల్ల ఆమెకి శకుంతల అని నామకరణం చేసి కణ్వ మహాముని పెంచుకున్నాడు. ఒక రోజు దుష్యంతుడు వేట కోసం వెళ్తూ కణ్వ మహాముని ఆశ్రమం దగ్గర ఆగాడు. శకుంతలని చూశాడు. ఆమెను గాంధర్వ వివాహం చేసుకుని తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. శకుంతలకి భరతుడు జన్మించాడు. తల్లి బిడ్డలను కణ్వ మహర్షి అత్తవారింటికి పంపాడు. నిండు కొలువులో దుష్యంతుడు ఆమెను తిరస్కరించాడు. దుష్యంతుడు మాటలు విని కలత చెందిన శకుంతల రాజుకి ధర్మబోధ చేయడమే ఈ పాఠం నేపధ్యం

ప్రక్రియ – ప్రాచీన పద్యం :

ఇతిహాసం అనే పదానికి ఈ విధంగా జరిగింది అని అర్ధం. ఇతిహాసంలో కధకి అధిక ప్రాధాన్యం ఉంటుంది. రామాయణం, భారతం ఇతిహాసాలు. ఇతిహాసాల్లో మూలకధ తీసుకుని వర్ణనలతో ఛందోబద్దంగా పద్యాల రూపంలో కావ్యంగా మలచి రాయడమే ఇతిహాస కావ్యం. ఈ కావ్యాలు కవి ప్రతిభా విశేషాలుని వెల్లడిస్తాయి. అద్భుత కధాగమనంతో పాఠకుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తాయి.

అర్ధాలు :

ఆచార్యుడు – గురువు

విపత్తు – ఆపద

నూనృత – సత్యం

హృద్యం – మనసుకి ఆహ్లాదం కలిగించడం

యశస్సు – కీర్తి

ఊత – ఆధారం

పర్యాయ పదాలు :

భూమి, వసుధ, పుడమి

ఆసరా, ఆధారం

భార్య, సతి, కళాత్రం, ధార

తనయుడు, పుత్రుడు, సుతుడు, కొడుకు

ఏనుగు, కరి, మాతంగం

నానార్ధాలు :

క్రమము, నీటిచాలు, వితరణ, కత్తి అంచు – ధార

పుణ్యం, స్వభావం, న్యాయం, ఆచారం, నీతి – ధర్మం

మానవుడు, అర్జునుడు – నరుడు

దిక్కు, కోరిక, నమ్మకం – ఆశ

కులం, వెదురు, పిల్లనగ్రోవి – వంశం

ప్రకృతి – వికృతి :

పుస్తకం – పొత్తం

నీరము – నీరు

యజ్ఞము – జన్నము

విద్య – విద్దె

గృహము – గీము

దీపము – దివ్వె

సత్యము – సత్తేము

ధర్మం – దమ్మము

రాజ – రేడు

కావ్యం – కబ్బం

వ్యుత్పత్తి అర్ధాలు :

పుత్రుడు – పున్నామ నరకము నుండి తప్పించేవాడు – కుమారుడు

ధర్మం – లోకం చేత ధరించబడేది

పతివ్రత – పతిని సేవించుటయే వ్రతముగా కలది – సాధ్వి

జ్యోత్స్న – కాంతిని కలిగి ఉండేది

వ్యతిరేక పదాలు :

చేసి – చేయక

వస్తాడు – రాడు

తింటే – తినకపోతే

వినండి – వినకండి

చెప్పి – చెప్పక

2. చైతన్యం

ఉద్దేశ్యం :

ప్రతి మానవ సమాజంలో అందరికీ అతీతంగా కొందరు ఉంటారు. వారు భవిష్యత్తును దర్శిస్తారు. ముందుచూపుతో ఆలోచిస్తారు. దారి దీపమై ముందుకు సాగుతారు. వారు తాత్వికులు. వారు తమ మాటల ద్వారా చేతల ద్వారా దిశానిర్ధేశం చేస్తారు. కవి కూడా ఈ కోవకి చెందినవాడే. అతని కవిత్వంలో సామాజిక చైతన్యం కలిగిస్తాడు. కవి తన రచనల ద్వారా ప్రజలను ఆలోచింపజేస్తాడు. ఒక వంక మనిషిలో మంచితనం మెచ్చుకుంటూ కూటిలత్వాన్ని ఎండగడతాడు. ఆ నిబద్ధత తోనే కవి తన మనసులో భావాలు లోకానికి ఈ కవిత రూపంలో వెల్లడించారు. విధ్యార్ధులలో సామాజిక చైతన్యం కలిగించి సమాజాభివృద్ధికి పాటుపడేలా చేయడమే ఈ పాఠం ఉద్దేశ్యం

నేపధ్యం :

కవిత్వానికి ఉండవలసిన ప్రధమ లక్షణం సామాజిక ప్రయోజనం. సమాజంలో అసమానతలు రూపుమాపడానికి కవి తన కలాన్ని కదిలించాలి. ప్రజల గొంతుకగా కవి వినబడాలి. తోటి మానవాళికి అండగా నిలవాలంటే గుండె నిండా ధైర్యం నింపుకోవాలి. సొంత లాభం కోసం కాకుండా పరుల మేలు కోరి పని చేయాలి అని ప్రేరణ ఇస్తూ కవి తన ఆకాంక్ష వ్యక్తం చేస్తున్న సందర్భంలో కవి కలం నుండి జాలువారినదే ఈ గేయకవిత

ప్రక్రియ – గేయ కవిత :

గేయ కవిత పాడుకోవడానికి అనువైనది. మాత్రా ఛందస్సు అనుసరించి నడుస్తుంది. లయాత్మకంగా సాగుతుంది. మానవాళి శ్రేయస్సును సమాజ పురోగమనాన్ని లోక కళ్యాణాన్ని కాంక్షించే గేయాన్ని అభ్యుదయ గేయం అంటారు

అర్ధాలు :

మారుతం – గాలి

చింత – భాద, దుఃఖం

స్థిరమైన – శాశ్వతమైన, నిలకడైన

మానసము – మనసు

క్రూరులు – చెడ్డవారు, దుర్మార్గులు

పర్యాయ పదాలు :

అభ్రములు, జలదరములు, మేఘములు

యుద్ధం, సమరం, పోరు

చుక్కలు, తారలు, నక్షత్రాలు

శోకం, దుఃఖం, ఏడుపు

నానార్ధాలు :

దిక్కు – దిశ, ఉపాయం, మార్గం

వర్షం – వాన, సంవత్సరం

నామం – పేరు, బొట్టు

వాహిని – నది, సైన్యం

లోకం – జగత్తు, చూపు, గుంపు

ప్రకృతి – వికృతి :

అగ్ని – అగ్గి

సింహం – సింగం

రాక్షసి – రక్కసి

కార్యము – కర్జము

మేఘము – మెయిలు

3. హరివిల్లు

ఉద్దేశ్యం :

మనిషికి ప్రకృతికి విడదీయరాని బంధం. ప్రకృతిని తరచి చూడడం మనిషి అలవాటు. ఉదయించే సూర్యుడు, రాలిపడే చినుకు, జల జల పారే నీరు, చిరుగాలి సవ్వడి, పూల పరిమళాలు, కిలకిలారావాలు, చిమ్మచీకటి, చల్లని వెన్నెల ఇలా ప్రతిదీ మనిషిని ఆకర్శించి ఆనందాశ్చర్యాలతో ఓలలాడిస్తుంది. ప్రకృతి అందాలకి పరవశించిన మనిషి మైమరిచిపోతాడు. ఆ తన్మయత్వంలో నుండి జరిగిన కావ్య సృష్టి ప్రకృతికి ప్రతిబింబం అవుతుంది. కవి తన మనసులో భావాలను అందంగా ఆకర్షణీయంగా చెప్పడమే వర్ణన. ఇది కవిలోని సృజనాత్మకతను వెలికి తీస్తుంది. ప్రకృతిలో అద్భుతాలు చూడడం అలవాటైతే మనిషి హృదయంలో సున్నితత్వం విరబుస్తుంది. మానవత్వం మొలకెత్తుతుంది. విచక్షణారహితంగా ప్రకృతిని ధ్వంసం చేసే ప్రవృత్తికి అడ్డుకట్ట పడుతుంది. రసార్ద్రరమైన కవి కలం లోనుంచి జాలువారిన భావ పరంపరను ఆస్వాదించడంతో పాటు ప్రకృతి నుండి పాఠాలను నేర్చుకుంటూ విధ్యార్ధులలో మానవీయత మేలుకొలపడం ఈ పాఠం ఉద్దేశ్యం

నేపధ్యం :

మానవుడు కల్పనాశిల్పి. అతని సౌందర్య తృష్ణ వల్ల తన చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని తిలకించి పులకించి పునరవ్యక్తీకరించగలిగాడు. తన ఎద నుండి పాఠకుని ఎదకి చెరవేయడానికి సాహిత్యాన్ని హేతువుగా చేసుకున్నాడు కవి. నన్నయ్య మొదలుకుని నేటి వరకు కవులు తమ కావ్యాలతో ప్రకృతి వర్ణనలకే పెద్దపీట వేశారు. ప్రబంధాలలో వర్ణనలదే పై చేయి. వర్ణనలు రెండు రకాలు. స్వాభావిక వర్ణనలు, భావాత్మక వర్ణనలు. స్వాభావిక వర్ణనలలో వర్ణించే వస్తువు స్వరూప స్వభావాలు మాటల రూపంలో ఉంటే భావాత్మక వర్ణనలలో అలంకారాలతో కూడి ఉంటాయి. వివిధ సందర్భాలలో కవులు కధానుగుణంగా వర్ణించిన ప్రకృతి దృశ్యాలను పరిచయం చేయడంతో పాటు పద్య రచనా శైలిలో వైవిధ్యాలను పరిశీలించేందుకు అనువుగా ఈ పాఠం రూపొందింది.

ప్రక్రియ – వర్ణన :

రచనా ప్రక్రియ ఏదైనప్పటికి కవి చెప్పిన విషయం పాఠకుని మనసు తాకేదిగా ఉండాలి. అతనిలో భావసంచాలనాన్ని కలిగించాలి. కవి తన రచనతో పాఠకునికి లంకె వేసుకుని తనతో పాటూ నడిపించాలి. ఇందుకోసం కవి వివిధ పద ప్రయోగాలతో తన రచన రసాత్మకం చేస్తాడు. దీనిని వర్ణన అంటారు. విషయాన్ని కేవలం విషయంగా కాకుండా సరైన పోలీకలతో కలిపి వివరిస్తాడు. కావ్యాలలో అష్టాదశ వర్ణనలు ఉంటాయి. ప్రబంధాలు వర్ణనలకు పుట్టినిల్లు. భావ కవిత్వమయినా, అభ్యుదయ కవిత్వమయినా వర్ణనతోనే రచనకి భావాపుష్టి కలుగుతుంది.

అర్ధాలు :

భానుడు – సూర్యుడు

తాండవం – నృత్యం, నాట్యం

మిక్కిలి – అధికం, ఎక్కువ

తత్తరపాటు – కలవరపాటు, తొందరపాటు

కనుమరుగు అవ్వడం – కనబడకపోవడం, మాయమవడం

పర్యాయ పదాలు :

నభం – ఆకాశం, గగనం

ధనువు – ధనస్సు, చాపము, విల్లు, హరివిల్లు

పయోధరము – మేఘము, జలదరము, అంబుదం

కేదారం – పొలం, క్షేత్రం, వరిమడి

సస్యము – పంట, పైరు

వెల్లువ – ప్రవాహం

నెచ్చెలి – స్నేహితుడు, మిత్రుడు

నానార్ధాలు :

ధర – భూమి, వెల, రక్తనాళం

పంక్తి – వరుస, గుంపు

తారక – నక్షత్రం, కంటి గుడ్డు

చుక్క – నక్షత్రం, బిందువు

వ్యుత్పత్తి అర్ధాలు :

సూర్యుడు – వ్యాపారములందు జీవులను ప్రేరేపించువాడు – రవి

ధర – విశ్వమును ధరించినది – భూమి

తోయజము – తోయమందు (నీటి యందు) పుట్టినది – పద్మం

శైలము – శిలలు దీనియందు కలవు – పర్వతం

ప్రకృతి – వికృతి : 

సంధ్య – సందె

చంద్రుడు – చందురుడు

దిశ – దేస

ఆకాశం – ఆకసము

ముత్యము – ముత్తేము

మేఘము – మెయిలు

4. ఆత్మకధ

ఉద్దేశ్యం :

సామాజిక జీవితం సమస్యల వలయం. అందులో ఆటు పోట్లు ఉంటాయి. జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు. తాము నమ్మిన జీవన సూత్రాలను అనుసరించి ఎదిగిన ఎందరో గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని వారి బాటలో నడిచి విజయ శిఖరాలు అధిరోహించిన వారిలో ఈ కవి ఒకడు. సమాజం అతని కృషిని గౌరవించి సమున్నతoగా సన్మానిస్తుంది. కానీ కవి ఆ సన్మానానికి పొంగిపోడు. గతంలో తన జాతి జనులకి జరిగిన అనేక అవమాన పరంపరలు అతని కళ్ల ముందు కదులుతూ ఉంటాయి. వాటి తాలూక దుఖం అతన్ని పట్టి భాదిస్తుంది. విద్య ద్వారానే వ్యక్తికి గౌరవం లభిస్తుంది. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా తాను ఎక్కడ నుండి వచ్చాడో గుర్తెరగాలి. తన మూలాలు మరువకూడదనే సత్యాన్ని తెలపడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశ్యం

నేపధ్యం :

స్వేచ్చ మానవ సహజాతం. వ్యక్తి తన స్వతంత్రానికి భంగం కలిగితే సహించడు. తన హక్కులను అణచవేయాలని ప్రయత్నిస్తే తిరగబడతాడు. పిల్లలు సైతం తమకి ఇష్టం లేకపోతే తల్లిపాలు తాగనంటారు. తల తిప్పుకుంటారు. ప్రతి మనిషికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. తనకి సాటి మనుషుల మధ్య గుర్తింపు కోరుకుంటాడు. సమాజంలో కొన్ని నిరంకుశ భావాలు, కట్టుబాట్లు మనిషి స్వేచ్చకీ సంకెళ్ళు వేస్తాయి. అతడు వాట్ని తెంచుకుని తనలో ఉన్న సృజనాత్మకత శక్తిని ప్రపంచానికి చాటుకుంటాడు. మనిషిలో మంచితనం మానవీయత ప్రపంచం గుర్తించి గౌరవిస్తుంది. అనేకానేక సమస్యలకు కుంగిపోక ఎదురు నిలిచి ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా జ్ఞాన శిఖరాలు అధిరోహించిన ఒకానొక కవి జీవితమే నేటి మన పాఠం

ప్రక్రియ – వచన కవిత :

ఈ పాఠం వచన కవిత అనే ప్రక్రియకి చెందినది. పద్య గేయాల్లో ఉండే ఛందో నియమాలతో సంబంధం లేకుండా వ్యవహారిక భాషలో లయాత్మకంగా సాగే కవిత వచన కవిత. సరళమైన పదాలు, వాక్యాలతో ధ్వని గర్భితముగా ఉండే కవిత వచన కవిత. రచయిత తాను చెప్పదలచుకున్న భావాన్ని సూటిగా స్పస్టంగా చెప్పడం వచన కవిత ప్రత్యేకత. ఆధునిక కవిత్వానికి కొత్త నెత్తురు ఎక్కించిన శ్రీ శ్రీ వచన కవితకి పట్టం కట్టారు. వారి బాటలో నడుస్తున్న ఆధునిక కవులందరు వచన కవితలోనే రచనలు చేస్తున్నారు.

అర్థాలు :

చౌరస్తా – కూడలి

అర్పణము – సమర్పించడం

చురకత్తులు – పదునైన కత్తులు

పర్యాయ పదాలు :

స్వర్ణం – బంగారం, పసిడి, హేమం, కనకం

సూర్యుడు – భాస్కరుడు, రవి, భానుడు, ఇనుడు

కళ్ళు – నేత్రాలు, నయనాలు, చక్షువులు

దేహం – తనువు, శరీరం, కాయం, మేను

నానార్థాలు :

తల – శిరస్సు, గుంపు, చోటు

కాలం – సమయం, మరణం, నలుపు

క్రియ – పని, చర్య

రామ – స్త్రీ, శ్రీరాముడు

ప్రకృతి – వికృతి :

బోజనము – బోనము

బ్రద్న – పొద్దు

కథ – కత

పుష్పం – పువ్వు

5. స్నేహం

ఉద్దేశ్యం :

విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు అన్నారు గౌతమ బుద్ధుడు. మనిషికి అవసర కాలంలో ఆదుకున్న మిత్రుడు కన్నా ప్రియమైనది ఏది ఉండదు అన్నాడు గురునానక్. కష్టకాలంలో మనకి నిజమైన మిత్రుడు ఎవరో తెలుస్తుంది అన్నాడు గాంధీజీ. స్నేహం ప్రతి వ్యక్తి జీవితంలో మధురమైన అనుభూతిగా నిలుస్తుంది. ఆటపాటలు ఆడే వయసులో మొగ్గల ప్రారంభం అయ్యి మహావృక్షంలా ఎదిగి జీవితాంతం తోడుగా నిలుస్తుంది. కొందరితో స్నేహం మనల్ని అత్యున్నత శిఖరాలకి చేరిస్తే కొందరి స్నేహం అధః పాతాళానికి తొక్కేస్తుంది. ప్రతి మనిషి జీవితంలో గొప్ప పాత్ర వహించేది స్నేహం అయినప్పుడు మనం ఎలాంటి స్నేహం ఎంచుకోవాలి ఆ స్నేహం వల్ల కలిగే ప్రయోజనాలు ఏవో తెలపడమే ఈ పాఠం ఉద్దేశ్యం

ప్రక్రియ – పద్యం :

సాహిత్య ప్రక్రియలో విశిస్టమైనది పద్యం. ఇది ఛందోబద్ధమైనది. లయాత్మకంగా, గాన యోగ్యముగా ఉంటుంది. ధారణకు అనువుగా ఉంటుంది. అందుకే మన ప్రాచీన కవులు మొదలు ఆధునిక కవుల వరకు పద్య రచనకి ప్రాధాన్యత ఇచ్చారు. కవి తన రచనలో భావ వ్యక్తీకరణకి అనువుగా కొన్ని ప్రత్యేక పద్య శైలులు ఎంచుకుంటాడు. ఉద్ధతికి విక్రీడిత పద్యాలు, సుకుమారతకు మాలా పద్యాలు, తాత్విక భావాలకు గీత పద్యాలు, పుష్పాపచయాది సందర్భాలకు రగడలు, పంచచామరాలు మొదలైన పద్య రీతులు కావ్యాలలో శోభిస్తాయి

అర్థాలు :

సంపద – ధనం

సౌధము – భవనము

తండులములు – అటుకులు

ప్రతిజ్ఞ – శపథం

సఖ్యత – స్నేహం

పర్యాయ పదాలు :

మిత్రులు, నేస్తాలు, స్నేహితులు

తల్పములు, శయ్యలు, పరుపులు

వసనములు, అంబరములు, వస్త్రాలు

ఉదకము, సలిలం, జలం

పత్రం, దళం, ఆకు

నానార్ధాలు :

విభుడు – ప్రభువు, శివుడు, బ్రహ్మ

కను – చూచు, వెదకు, జన్మనిచ్చి

దళం – ఆకు, భాగం, దండు

ఫలం – పండు, కార్యం, పరిణామం

వ్యుత్పత్తి అర్థాలు :

గురువు – అజ్ఞానం అనే అంధకారమును చేదించేవాడు – ఉపాధ్యాయుడు

మిత్రుడు – సర్వభుతాల పట్ల స్నేహభావం కలవాడు – సూర్యుడు

మోక్షం – జీవున్ని పాశం నుండి విడిపించేది – ముక్తి

పురంధ్రి – గృహాన్ని ధరించేది – ఇల్లాలు

అమృతం – మరణం లేనిది – సుధ

పదాలు – అర్థాలు :

బ్రహ్మానందం – అంతులేని ఆనందం

చక్రపాణి – చక్రము పాణి (చేయి) యందు కలవాడు

కుంభవృష్టి – కుంభం (కుండ) లతో కుమ్మరించినట్టు కురిసే వాన

తళతళలాడే – ప్రకాశించు

ప్రచండ వాయువు – తీవ్రమైన గాలి

ప్రకృతి – వికృతి :

కార్యము – కర్జము

గృహము – గీము

గౌరవం – గారవం

ధర్మము – దమ్మము

లక్ష్మి – లచ్చి

6. తీర్పు

ఉద్దేశ్యం :

బుద్ధుడు నడయాడిన భారతావని శాంతి, సహానాలకి పుట్టినిల్లు. పరోపకారం మనకి జీవనాడి. మనిషిగా జీవించడానికి కొన్ని విలువలు నియమ నిష్టాలు ఏర్పాటు చేసి దాన్ని మానవత్వం అన్నారు. మనిషి పురుషార్ధపరుడు కావాలి అంటారు పెద్దలు. ధర్మబద్ధంగా జీవితాలను కొనసాగిస్తూ జన్మ సాఫల్యం చేసుకోవాలన్నది దీని పరమ ఉద్దేశం. మనస్సు చంచలమైనది. చూచిన ప్రతీదీ తనకి కావాలని ప్రేరేపిస్తుంది. సాధనతో దీన్ని అదుపులో ఉంచుకోవాలి. కరుణ, సత్యం, ధర్మం, న్యాయం, భూతదయ, అహింస, క్షమాగుణం మొదలైన సాత్విక గుణాలను విధ్యార్ధులు అలవర్చుకుని ఉన్నతమైన జీవనం సాగిస్తూ మానవత్వం చాటుకోవాలని తెలపడం ఈ పాఠం ఉద్దేశ్యం.

నేపధ్యం :

ఒకరోజు సిద్ధార్ధుడు రాజకుమారులతో కలిసి వనవిహారానికి వెళ్ళాడు. సిద్ధార్ధుడు ప్రకృతి అందాన్ని సరోవరాలను పంటచేలను పశుకాపర్లను పశు పక్ష్యాదులను చూసి ఆనందిస్తున్నాడు. ఇంకో రాజకుమారుడు దేవదత్తుడు చేత ధనూర్భానాలు ధరించి జంతువుల వేటకి సిద్ధంగా ఉన్నాడు. ఇంతలో ఒక హంసల గుంపు క్రేంకారం చేస్తూ ఆకాశ మార్గంలో పయనిస్తూ ఉండడాన్ని దేవదత్తుడు చూశాడు. బాణం సంధించి ఒక హంసను నేలకూల్చాడు. దీనిని చూసిన సిద్ధార్ధుడు మిక్కిలి వ్యధ చెంది ఆ హంసను రక్షించాడు. ఇది ఇద్దరి మధ్య వాదానికి దారి తీసింది. న్యాయం కోసం రాజస్థానానికి వెళ్లారు. చివరికి హంస ఇద్దరిలో ఎవరికి చెందిదో అనేది పాఠం ద్వారా తెలుస్తుంది

ప్రక్రియ – ఖండ కావ్యం :

చిన్న కధ, కొన్ని పాత్రలు, పరిమిత పద్యాలు గల రచన ఖండ కావ్యం. దీనిలో వ్యర్ధ పదాలకు, వర్ణనలకు అవకాశం ఉండదు. మహాకావ్యాల్లో రసవత్తరమైన ఘట్టాలను పాత్రలను చారిత్రక, దేశభక్తి సన్నివేశాలు మొదలైన వాటిని రమణీయంగా వ్యక్తీకరించడం దీని ప్రత్యేకత. దీనిలో పద్యాలు సంప్రదాయ వృత్తాలలో ఛందోబద్ధంగా ఉంటాయి.

అర్ధాలు :

అంకము – ఒడి 

వినుత్రోవ – ఆకాశ మార్గం

ఆస్య – ముఖం

మారాళము – హంస 

భాస్పములు – కన్నీళ్ళు

పర్యాయ పదాలు :

అంబరము – ఆకాశం, గగనం 

శరం – బాణం, అమ్ము

సరోవరం – సరస్సు, తటాకం

వాక్కులు – మాటలు, పలుకులు

కరములు – చేతులు, హస్తాలు

నానార్ధాలు :

శ్రీ – లక్ష్మీ, సంపద 

ఖగము – పక్షి, బాణం

మధు – తేనె, చైత్రం

ఘృతము – నెయ్యి, నీరు

సోమ – శ్రయము, పరాక్రమం

ప్రకృతి – వికృతి :

లక్ష్మీ – లచ్చీ

హంస – అంచ

న్యాయము – నాయము

రత్నము – రతనము

అంకము – అంకె

భీతి – బీతు

త్రోవ – తోవ

ప్రాణము – పానము

రాక్షసి – రక్కసి

సంతోషం – సంతసము

7. మాట మహిమ

ఉద్దేశ్యం :

నరం లేని నాలుక పరిపరివిధాల వదంతులు పుట్టిస్తుంది. దాని ఫలితంగా ధన, మాన, ప్రాణాలకి ముప్పు వాటిల్లుతుంది. అవయవలన్నింటిలో ప్రధానమైనది మనకి గౌరవం తెచ్చి పెట్టేది నాలుక. విలువైన మాటలే బంధాలను స్నేహాలను పెంచుతాయి. వ్యక్తి సంస్కారానికి మాట గీటురాయి వంటిది. పెదవి దాటి వచ్చే మాటపై అదుపు, పొదుపు అవసరం. మాటతీరు బాగలేకపోతే ఎదురయ్యే కష్ట నష్టాలను తెలపడం, మాట విలువ తెలుసుకుని యోగ్యతతో కూడిన మాటలే మాట్లాడడం అలవరచుకునేలా చేయడం ఈ పాఠం ఉద్దేశ్యం

నేపధ్యం :

మన చుట్టూ రకరకాల మనుషులు ఉంటారు. ఒక్కొక్కరి మాటతీరు ఒక్కోలా ఉంటుంది. కొందరి మాటలు ప్రేమని పంచితే, మరికొందరు మాటలు మనసు ముక్కలు చేస్తాయి. కొందరు మాటలు ధైర్యం నింపితే మరికొందరి మాటలు పిరికితనం నూరిపోస్తాయి. నాలుక అదుపులో ఉంచుకుని మాట్లాడే స్వభావం పెంపొందించుకోవడం ఎంత అవసరమో మోసపు మాటల మాయలో పడకుండా జగరుకతతో ఉండడం అంతే అవసరం

ప్రక్రియ – ఆధునిక పద్యం :

తెలుగు సాహిత్య ప్రక్రియలో విశిస్టమైన ప్రక్రియ పద్యం. పూర్వం సాహిత్య రచనలు అన్నీ పద్య ప్రక్రియలో జరిగేవి. పద్య ముఖ్య లక్షణం ఛందస్సు. పద్యాలలో వృత్తాలు, జాతులు, ఉపజాతులు ఉన్నాయి. ఆధునిక రచయితలపై కూడా ప్రాచీన పద్య ప్రభావం ఎంతైనా ఉంది. అందుకే ఆధునిక రచయితలు తమ భావాలను ప్రాచీన పద్య శైలిలో ఛందోబద్ధంగా రచించడం జరుగుతుంది. ఆధునిక పద్యంలో పద్యశైలి ప్రాచీన పద్య లక్షణాలతో ఉంటుంది. వస్తువు ఆధునికమైనది ఉంటుంది

అర్ధాలు :

పధమున – మార్గము 

మితము – కొద్దిగా

కులాలుడై – కుమ్మరివాడు

దుర్గుణాలు – చెడుగుణాలు

గరళం – విషం

పర్యాయ పదాలు :

నేస్తాలు, మిత్రులు

జిహ్వా – నాలుక, రసజ్ఞ

తిలకించు – చూచు, వీక్షించు

సిరి – లక్ష్మీ, సంపద

నానార్ధాలు :

పయనము – ప్రస్థానం, గమనం

అమృతము – సుధ, నెయ్యి

కాంచుట – చూచుట, పొందు

ప్రకృతి – వికృతి :

భాష – బాస

పుస్తకాలు – పొత్తములు

దూరము – దువ్వు

వర్ణం – వన్నె

హృదయం – ఎద

సహాయం – సాయం

జాతీయాలు :

కంకణం దాల్చు – కార్యం నెరవేర్చే శపధం పట్టడం

గిల్లి జోలబాడటం – మనిషి కింద మంట పెట్టి మీద నీళ్ళు చల్లడం

జుట్టు ముడిపెట్టడం – తగాదా పెట్టడం

వంట జీర్ణించుకోవడం – పూర్తిగా విషయం అవగాహన చేసుకోవడం

8. ఇల్లలకగానే

ఉద్దేశ్యం :

ప్రతి మనిషికి కొన్ని అభిరుచులు ఉంటాయి. ఆడవాళ్ళు పెళ్లవగానే ఇల్లు చక్కదిద్దడంలో లీనమైపోతారు. బరువు బాధ్యతలతో వంటింటి కుందేళ్ళు ఐపోతారు. ఇంటి పనుల్లో పడి కోరికలకు కళ్ళెం వేసుకుంటారు. అభిరుచులు ఆటకెక్కిస్తారు. భర్త, పిల్లలను చూసుకోవడం భాగ్యం అనుకుంటారు. చివరికి తమ అస్తిత్వం కోల్పోతారు. వివాహితకు కుటుంబం అండగా నిలిస్తే వారు విజయ బావుటా ఎగురవేస్తారు. స్త్రీల ఆత్మాభిమానం పెంపొందించుకోవాలి అని తెలపడం ఈ పాఠం ఉద్దేశ్యం

ప్రవేశిక :

వివాహం అయిన స్త్రీ తన చదువు, సృజనాత్మకత, నైపుణ్యాలు పక్కన పెట్టాల్సి వస్తుంది. యంత్రంలా పని చేస్తున్న క్రమంలో తనకో పేరు ఉంది అని మర్చిపోతుంది. ఇంటి పనిలో మునిగి స్వీయ చైతన్యం ఆత్మ గౌరవం కోల్పోవడంలో అనౌచిత్యాన్ని ఈ కధ ద్వారా తెలుసుకుందాం

ప్రక్రియ – కధ :

తెలుగు సాహిత్యంలో కధ ఒక ప్రధాన ప్రక్రియ. వ్యక్తి జీవితంలో ఎదురయ్యే సంఘటనలు వివిధ పాత్రల ద్వారా గొప్ప శిల్ప నైపుణ్యంతో గుండెకి హత్తుకునేలా చెప్పే వచన రచనే కధ. ప్రస్తుతం కధ, కధానిక అనే రెండు పదాలు ఒకే అర్ధంలో వాడుతున్నాం. ఎందరో రచయితలు తమ కధల ద్వారా తెలుగు సాహిత్యం పరిపుష్టం చేస్తున్నారు

అర్ధాలు :

నేర్పరి – నైపుణ్యం, ప్రావీణ్యం  

తీర్చి దిద్దిన – బాగుపరిచిన, రూపొందించిన

భుజం తట్టడం – ప్రోత్సహించడం, ప్రేరణ కలిగించడం

విధ్యార్జన – జ్ఞాన సంపాదన

పర్యాయ పదాలు :

గుర్తు – సంకేతం, జ్ఞాపకం, సంజ్ఞ

బట్టలు – వస్త్రాలు, వలములు, చెలములు

ఉత్తరాలు – జాబులు, లేఖలు

తపన – కోరిక, ఆశ, ఈప్పితం

ఇల్లాలు – భార్య, శ్రీమతి, సతి

ప్రకృతి – వికృతి :

తీరం – దారి

గౌరవం – గారవం

ప్రాణము – పానము

భాష – బాస

ఆశ్చర్యం – అచ్చెరువు

సామాన్య వాక్యాలు – సంయుక్త వాక్యాలు :

రాధ పాట పాడుతున్నది. రవి పాట పాడుతున్నాడు – రాధ, రవి పాట పాడుతున్నారు

సాందీపుడు గురువు. శ్రీకృష్ణుడు శిష్యుడు – సాందీపుడు, శ్రీకృష్ణుడు గురుశిష్యులు

రవి బజారుకి వెళ్ళాడు. రఘు బజారుకి వెళ్ళాడు – రవి, రఘు బజారుకి వెళ్లారు

భీముడు వీరుడు, అర్జునుడు వీరుడు – భీముడు, అర్జునుడు వీరులు

సామాన్య వాక్యాలు – సంశ్లిష్ట వాక్యాలు :

శైలజ నడుస్తున్నది. శైలజ పాట పాడుతున్నది – శైలజ నడుస్తూ పాట పాడుతున్నది

నెమలి వేగంగా వచ్చింది. నెమలి పాముని చూసింది – నెమలి వేగంగా వచ్చి పాముని చూసింది

నేను ఉదయాన్నే లేచాను, నేను వ్యాయామం చేశాను – నేను ఉదయాన్నే లేచి వ్యాయామం చేశాను

ఏనుగు తొండం ఎత్తింది, ఏనుగు ఘీంకరించింది – ఏనుగు తొండం ఎత్తి ఘీంకరించింది

9. రంగస్థలం

ఉద్దేశ్యం :

కళారూపాలు ఆస్వాదించే వారికి ఆనందం పంచుతాయి. మానవుడు సంఘ జీవనం మొదలు పెట్టిన నాటి నుండి మనోల్లాసం కలిగించే అనేక రకాల ఆటపాటలు జీవితంలో భాగం చేసుకున్నాడు. కాలక్రమంలో అవి కళారూపాలుగా రూపుదిద్దుకున్నాయి. హరికధ, బుర్రకధ, చిందు భాగవతం, యక్ష గానం మొదలైనవి అన్నీ ఈ కోవకి చెందినవే. అలాంటివాటిలో ఒకటైన నాటకం గురించి దాని ఔన్నత్యం గురించి వివరించడం ఈ పాఠం ఉద్దేశ్యం

నేపధ్యం :

నాటకం ఒక కళారూపం మాత్రమే కాదు, ఒక గొప్ప సాహితీ ప్రక్రియ కూడా. ఎందరో లబ్ధ ప్రతీష్టులైన కవులు అనేక నాటకాలు రాశారు. నటీనటులు తమ అద్భుత నటనతో వాటికి దృశ్య రూపం కల్పించారు. అనేక నాటక సమాజాలు నాటకాలు ప్రదర్శిస్తూ వాటికి ఆదరణ కల్పించాయి. అత్యున్నత శిఖరాలు అధిరోహించిన నాటక రంగం సినిమా ప్రవేశంతో తన ప్రభావం కోల్పోయింది. కేవలం వినోదం పంచడంతో సరిపెట్టుకోకుండా సామాజిక సమస్యలు, సాంఘిక దురాచరాలని ఎత్తి చూపుతూ కొత్త పుంతలు తొక్కుతూ ఈనాటికీ తన ఉనికిని చాటుకుంటున్న నాటకం గురించి నేటి తరం తెలుసుకోవడం ఎంతో అవసరం

ప్రక్రియ – వ్యాసం :

ఒక విషయం గురించిన సమాచారం విశేషాలు పాఠకులకి అర్ధం అయ్యేలా సంగ్రహంగా రాసే ప్రక్రియను వ్యాసం అంటారు. వ్యాసానికి ఒక స్పష్టమైన ప్రారంభం, వివరణ, ముగింపు అనే లక్షణాలు ఉంటాయి. రచయిత విషయాన్ని కూలంకుశంగా పరిశీలించి అవసరం అయిన సమాచారం క్రోడీకరించి వ్యాసం రాస్తారు

నాటికలు – రచయితలు :

ఆత్మ వంచన – బుచ్చిబాబు

తేలుకుట్టిన దొంగలు – పొట్లూరి వేంకటేశ్వర రావు

కప్పలు – ఆత్రేయ

కంఠాభరణం – పానుగంటి

గృహప్రవేశం – మునిమాణిక్యం

సరిపడని సంగతులు – బళ్ళారి రాఘువ

సత్యం గారి ఇల్లు ఎక్కడ – గొల్లపూడి

అర్ధాలు :

కనుమరుగు – కనపడకపోవడం

హర్షధ్వనాలు – చప్పట్లు, కేరింతలు

నిత్యనూతనం – ఎల్లప్పుడూ కొత్తగా

సమ్మేళనం – కలయిక

ఆద్యంతం – మొదట నుండి చివర వరకు

పర్యాయ పదాలు :

స్త్రీలు, మహిళలు

గ్రామం, పల్లెటూరు

హాస్యం, నవ్వు

నృత్యం, నాట్యం

వీక్షకులు, ప్రేక్షకులు

నానార్ధాలు :

ఉల్లాసం – ఆనందం, ఉత్సాహం

చేరువ – దగ్గర, సాన్నిత్యం

నూతనం – కొత్త, వింత

కాలం – సమయం, మరణం, నలుపు

కృషి – ప్రయత్నం, వ్యవసాయం, పరిశ్రమ

10. ప్రియమైన నాన్నకు

ఉద్దేశ్యం :

మనిషి ప్రేమతో నిండిన ప్రేమకు పులకరిస్తాడు. ఆత్మీయంగా హత్తుకుంటే ఆనందిస్తాడు. ఆధునిక కాలంలో మనిషికి ఉరుకుల పరుగుల జీవనశైలి నిత్యకృత్యం అయింది. అమ్మ నాన్నలను అయిన వాళ్ళను ఆత్మీయులను పాలకరించుకుని మనసు విప్పి సుఖదుఃఖాలు పంచుకునే కాలమే నేడు కరువైంది. సాంకేతిక పరిజ్ఞానం మనిషిని యాంత్రికుని చేసి తన చుట్టూ తిప్పుకుంటుంది. ఈ నేపధ్యంలో మనసులో మాటలను మమతలను ఒకరినొకరు పంచుకునేలా చేయగల ఏకైక సాధనం ఉత్తరం. బాలలలో లేఖ రచన పట్ల ఆసక్తి పెంపొందించి కుటుంబ విలువలు కాపాడడం మానవ సంబంధాలు భాంధవ్యాలకు ప్రాణం పోయడమే ఈ పాఠం ఉద్దేశ్యం

నేపధ్యం :

ఉత్తరం ద్వారా వాస్తవిక సంఘటనలు, అనుభవాలు, ఆలోచనలు ఆసక్తికరంగా వ్యక్తీకరించడం జరుగుతుంది. ఉత్తరం రాయడం ఒక కళ. మన అనుకున్నవారి బాగోగులు భావోద్వేగాలును ఉత్తరం రూపంలో అందుకుంటే కలిగే ఆనందానికి అవధులు ఉండవు. ఉత్తరం చదువుతుంటే రాసినవారు ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్న అనుభూతి కలుగుతుంది. ఆత్మీయ బంధం పెనవేసుకుంటుంది. అందుకే ఉత్తరం పదే పదే చదువుతూ గుండెకు హత్తుకుంటాం. పదిలంగా దాచుకుంటాం. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాలు అయిన వాట్సప్, మెయిల్ ఇలాంటి అనుభూతి ఇవ్వలేవు. ఆత్మీయతలు, ప్రేమనురాగాలు పెంపొందాలన్నా మనుషుల మధ్య దూరం తగ్గాలన్నా లేఖ అత్యుత్తమ సాధనం. పిల్లల ఎదుగుదల కోసం తాను కొవ్వొత్తిలా కరిగిపోతూ బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని నిరంతరం తపించిన తండ్రిని తలచుకుంటూ ఒక కూతురు తండ్రికి రాసుకున్న ఉత్తరమే ఈ పాఠం

ప్రక్రియ – లేఖ :

తెలుగు సాహిత్యంలో లేఖా రచన ఒక అద్భుత ప్రక్రియ. వ్యక్తులు, సంస్థల మధ్య సమాచారం పరస్పరం పంచుకోవడానికి ఉపయోగించే సాధనమే లేఖ. లేఖల ద్వారా తమ భావాలు, అనుభవాలు, అభిప్రాయాలు వ్యక్తం అవుతాయి. కేవలం విషయ సమాచారమే కాకుండా ప్రముఖులు రాసిన లేఖల్లో సాహితీ విలువలు ఉంటాయి. అందువల్ల వచన రచనలో ఒక సాహిత్య ప్రక్రియగా లేఖను పేర్కొంటారు. ఎందరో రచయితలు లేఖల రూపంలో తన హృదయాన్ని ఆవిష్కరించారు. సంజీవ దేవ్ లేఖలు, నెహ్రూ లేఖలు, చలం లేఖలు, ఔరంగజేబు లేఖలు, అబ్రహం లింకన్ లేఖలు ఈ కోవకి చెందినవే. కొందరి లేఖలు ఆలోచింపజేస్తే మరికొందరి లేఖలు ఆనందింపజేస్తాయి. అందుకే లేఖలను చైతన్యానికి ప్రతీకలు అంటారు

అర్ధాలు :

ఉరకలు – పరిగెత్తడం, ప్రవహించడం

కరువు – దుర్భిక్షo, క్షామం   

స్మృతులు – జ్ఞాపకాలు

అస్తిత్వం – ఉనికి

పర్యాయ పదాలు :

ఎద, హృదయం

లేఖ, ఉత్తరం

జ్ఞాపకం, మననం

లేమి, వెలితి

ఆత్రుత, తొందర

పశువు, గొడ్డు

నానార్ధాలు :

భోగం – పాము పడగ, శుభం, కీర్తి,భోజనం, తపస్సు, భువనం, మరదలు (మేనమామ పుత్రిక)

ప్రకృతి – వికృతి :

కుమారుడు – కొమరుడు

శ్రీ – సిరి

పంక్తి – బంతి

క్షేమం – సేమము

ఆశ – ఆస

11. ఆశావాది

ఉద్దేశ్యం :

విధ్యార్జనకు పుట్టుపూర్వోత్తరాలు, ఆర్ధిక అసమానతలు అవరోధాలు కావు అని నిరూపించిన ధీశాలి ప్రకాశరావు. పట్టుదల, కృషి ఉంటే అక్షర సింహాసనం ఎక్కి సాహితీ సామ్రాజ్యం ఏలవచ్చు అని నిరూపించి చూపిన కార్యదక్షుడు. పద్య రచనలో పట్టు సాధించి కొందరికే పరిమితం అయిన అష్టావధాన ప్రక్రియలో రాణించడం ద్వారా అత్యున్నత పద్మ శ్రీ పురష్కారం అందుకుని నేటి తరానికి స్పూర్తి ప్రదాతగా నిలిచిన ఆ మహానీయుని సాహితీ జీవన ప్రస్థానం తెలపడం ఈ పాఠం ఉద్దేశ్యం.

ప్రక్రియ – ముఖాముఖి :

ఉన్నత శిఖరాలు అధిరోహించిన మహనీయుల జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. మరెన్నో వెలుగునీడలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవడం ద్వారా మన జీవితం సుగమం చేసుకోవడానికి వీలు అవుతుంది. ప్రశ్నలు అడగడం ద్వారా సమాచారం సేకరించడమే ముఖాముఖి. సేకరించిన సమాచారం ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా పాఠకులకు అందించడం జరుగుతుంది. ముఖాముఖి ద్వారా వ్యక్తుల వ్యక్తిత్వం వారి అనుభవాలు, జీవిత విశేషాలను స్వయంగా వారి ద్వారా తెలుసుకునే వీలు ఉంటుంది

ప్రవేశిక :

సాహితీ వ్యవసాయంలో పద్య సేద్యం చేసిన ఓ భాషా పరిమళం, సుందర శబ్దాలతో అందమైన పద్యాలు అల్లిన ఓ అష్టవధాన రూపం ఆశావాది ప్రకాశరావు. నీదే కులం అని అడిగిన వారికి నాది కవికులం అని చాటిన కవితావాది ఆశావాది. అవధానం కొందరి సొత్తు. అది నీవెలా చేస్తావు ఆన్న అవహేళనలకు తన సాహిత్య పటిమతో సమాధానం ఇచ్చిన సౌజన్యమూర్తి. తెలుగు భాషకే సొంతం అయిన అవధాన ప్రక్రియలలో వారు అగ్రశ్రేణిలో నిలిచారు. తిరుపతి వెంకట కవులను ప్రేరణగా తీసుకుని సి వి సుబ్బన్న శతావధానిని గురువుగా నిలుపుకుని వారి సాహితీ ప్రస్థానం విశిష్ట పురష్కారాలకు వేదికైంది. అలనాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారిచే బాలకవిగా పిలిపించుకుని మొన్నటి రాష్ట్రపతి రామనాధ్ కోవిoద్ చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్న భాషాజీవి. ప్రస్తుత పాఠ్యభాగం ఆశావాది ప్రకాశరావు రచించిన “ప్రకాశ ప్రదీపనం” లోనిది

అర్ధాలు :

గోష్టి – చర్చ 

ఆశువు – అప్పటికి అప్పుడు చెప్పే కవిత్వం

పృచ్చకులు – అష్టవధానంలో ప్రశ్నించేవారు (8 మంది ఉంటారు)

పర్యాయ పదాలు :

నేత్రం – నయనం, కన్ను, అక్షి   

నాన్న – తండ్రి, జనకుడు

కౌముది – వెన్నెల, చంద్రిక

నానార్ధాలు :

కవి – కవిత్వం రాసేవాడు. నీటికాకి 

గురువు – ఉపాధ్యాయుడు, బృహస్పతి

కృషి – ప్రయత్నం, వ్యవసాయం

వ్యుత్పత్తి అర్ధాలు :

కృతులు –

పౌత్రుడు – పుత్రుని యొక్క పుత్రుడు 

ఆచార్యుడు – ధర్మ మార్గం ఆచరించి చూపువాడు

ప్రకృతి – వికృతి :

 దైవం – దయ్యం

కార్యం – కర్జము

పద్యం – పద్దెము

కీర్తి – కిరీతి

కవిత – కయిత

విజ్ఞానం – విన్నానం

అక్కరం – అక్షరం

సందియం – సందేహం

జాతీయాలు :

ఎత్తిపొడుపు – నిందించడం

కత్తి మీద సాము – చాలా దుర్లభం, కష్టతరం

తామరతంపర – కుప్పలు తెప్పలు, కోకొల్లాలు 

12. ఏ దేశమేగినా

ఉద్దేశ్యం :

తెలుగులో పద్యం, కధ, వచన కవిత మొదలైన ప్రక్రియలతో పాటు యాత్రా రచన కూడా ఒక సాహితీ ప్రక్రియ. దాని పట్ల విద్యార్ధులకు అవగాహన కలిగించడం, రచయిత్రి తన విదేశీ యాత్ర అనుభవాలను పరిచయం చేయడం, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల పట్ల విదేశీయుల మనోభావాలు తెలపడం ఈ పాఠం ముఖ్య ఉద్దేశ్యం.

నేపధ్యం :

“ఈనాడు ఊసుపోక ఊరికే తిరిగే లోక సంచారులు కాదు ప్రపంచానికి కావలసినది. తమ తిరుగుడుకి సార్ధకత కల్పించగల లోక సంచారులు కావాలి. అంటే దేశాలు తిరిగి తాము సంపాదించిన అనుభవాన్ని, చూసిన ప్రదేశాల వివరాల్ని ఏ కారణం వల్లనో దేశాలు తిరగలేక స్థిరవాసులయిన లక్షలాది మంది ప్రజలకు అందించగలిగి ఉండాలి లోకసంచారులు” అని లోకసంచారి అనే పుస్తకంలో ప్రముఖ చారిత్రక సాంస్కృతిక హిందీ రచయిత రాహుల్ సాంకృత్యాయన్ వెల్లడించారు

సరిగ్గా అలాంటి ఒక సదుద్దేశ్యంతో శ్రీమతి ఊటుకూరి లక్ష్మీ కాంతమ్మ గారు భారత ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా వివిధ దేశాలు పర్యటించారు. ఆ పర్యటన సాగిన విధానం ఆమె పొందిన అనుభవాలు, విశేషాలను ఈ పాఠం చదివి తెలుసుకుందాం

ప్రక్రియ – యాత్రా రచన :

యాత్రికుడు తాను పొందిన యాత్రనుభవాలను గ్రంధస్థం చేయడం యాత్రా రచన. వ్యక్తులు స్వదేశంలో కానీ విదేశంలో కానీ విశిష్టత గల దర్శించినపుడు అక్కడి విశేశాలను పొందిన అనుభూతిని అనుభవాలను వివరిస్తూ వర్ణనాత్మకంగా రాయడమే యాత్రా రచన.

నేటికీ ఏ తీర్ధ యాత్రకో, విహార యాత్రకో వెళ్ళి వచ్చిన వారు తమ స్నేహితులతో ఇరుగుపొరుగువారికో అక్కడ వింతలు, విశేషాలు కధలు కధలుగా చెప్పడం చూడవచ్చు. యాత్రా రచనలు చదువుతునప్పుడు పాఠకుడు తాను కూడా అక్కడ ఉన్నట్లు అనుభూతి చెందుతాడు. పిల్లలు కూడా తాము వెళ్ళిన ఊళ్ళ గురించి విజ్ఞాన యాత్రల గురించి యాత్రా రచన చేయడం అవసరం. ఇది తమ అనుభవాలకి అక్షర రూపం కల్పించడం

రచన – గ్రంధకర్త :

ఆటా జనికాంచె – ఎండ్లూరి సుధాకర్

ఇనుపతేరనెనుక – రావూరి భరద్వాజ

నవ భారతి – మాలతీ చందూర్

రష్యాలో స్నేహాయాత్ర – వసా ప్రభావతి

నేను చూసిన అమెరికా – అక్కినేని నాగేశ్వర రావు

కాశీ యాత్ర చరిత్ర – ఏనుగుల వీరాస్వామి

అర్ధాలు :

జోతలు – నమస్కారాలు

సమాగమం – కలయిక

సాధ్వి – పతివ్రత

కలగుండు – కలవరం

ఉత్కృష్టం – గొప్పగా

అధిరోహించిన – ఎక్కిన

పర్యాయ పదాలు :

జాబు, ఉత్తరం, లేఖలు

ఆదేశం, ఆజ్ఞ, అనుజ్ఞ

జ్ఞప్తి, స్మృతి, జ్ఞాపకం

ప్రకృతి – వికృతి :

దీపము – దివ్వె

మాణిక్యం – మానికం

యత్నం – జతనం

యాత్ర – జాతర

నిత్యం – నిచ్చెలు   

13. నా చదువు

ఉద్దేశ్యం :

విద్య వలన వినయం వినయం వలన పాత్రత కలుగుతుంది అనేది ఆర్ష వాక్యం. అంటే విద్య వ్యక్తి అభివృద్ధితో పాటు సమాజాభివృద్ధికి తోడ్పడుతుంది. విద్యాభ్యాసం కోసం ఎంతోమంది ఎన్ని ఆటంకాలు వచ్చిన ఎదురీది వివిధ ప్రయత్నాలు చేసి సఫలీకృతులయ్యారు. అలాగే కోరుకున్న రంగంలో రాణించి దేశాభివృద్ధిలో భాగస్వాములయ్యారు. విద్యార్ధులకు అలాంటి వ్యక్తుల జీవిత విశేషాలు తెలిపి వారి బాటలో నడిచేలా చూడడం దేశాభివృద్ధికి పాటుపడేలా చేయడం ఈ పాఠం ఉద్దేశ్యం

నేపధ్యం :

తెలుగులో వచన కవిత్వానికి పట్టం కట్టిన ప్రముఖ రచయితలలో శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి గారు అగ్రగణ్యలు. ఆధునిక తెలుగు కధకి గురజాడ బీజం వేస్తే తరవాత శ్రీపాద వారు దానికి జవజీవాలు కల్పించారు. పద్య కవిత ప్రభావానికి ఎదురొడ్డి తెలుగు సాహిత్యాన్ని ఆధునిక వచన రచన వైపుకి చేయి పట్టి నడిపించిన వైతాళికుడు శ్రీపాద. వీరు చక్కని తెలుగుదనంతో గ్రామీణ నేపధ్యంతో కధలు, కావ్యాలు రాయడంలో సిద్ధహస్తులు. ఈయన తన చిన్నతనంలో చదువు సాగించిన తీరుకు ఒక ప్రత్యేకత ఉంది. నాడు తన విద్యాభ్యాసంలో ఎదురైన సమస్యలు వాటిని అధిగమించిన విధానం నేటి తరానికి మార్గదర్శకం. శ్రీపాద వారు తన చిన్ననాటి సామాజిక స్థితిగతులను అవకాశాలుగా మార్చుకుని రచయితగా కవిగా ఎదిగిన తీరు తన ఆత్మకధ “అనుభవాలు – జ్ఞాపకాలునూ” లో వివరించారు. అందులో తన బాల్యం, విద్యాభ్యాసం గురించి తెలిపే నేపధ్యం లోనిది ఈ పాఠ్యాంశం.

ప్రక్రియ – ఆత్మకధ :

వ్యక్తి తన జీవిత అనుభవాలు, అభిప్రాయాలు కలబోసి తనకి తానే రాసుకునే సాహితీ ప్రక్రియ ఆత్మకధ. తనకై తాను రాసుకున్న జీవిత చరిత్ర. అవి ఆత్మకధలే అయినా సామాజిక జీవితాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. ఇది ఉత్తమ పురుష కధనంలో ఉంటుంది. ఆత్మకధలు చదవడం ద్వారా పాఠకుడు రచయితతో కలిసి పయనిస్తున్నట్లు అనుభూతి చెందుతాడు. అందుచేత ఎన్ని ఆత్మకధలు, జీవిత చరిత్రలు చదివితే అన్నీ జీవితాలను ఏకకాలంలో జీవించినవారమవుతాము అంటారు.

ఆత్మకధలు :

సత్య శోధన – మహాత్మా గాంధీ

నేను – నా దేశం – దరిశి చెంచయ్య

నా ఎరుక – అధిబట్ల నారాయణదాసు

పింజారి – షేక్ నాజర్

హంపి నుండి హరప్పా దాకా – తిరుమల రామచంద్ర

నా జీవిత యాత్ర – టంగుటూరి ప్రకాశం పంతులు

నా గొడవ – కాళోజీ నారాయణరావు

నా అంతరంగ కధనం – బుచ్చిబాబు

సాలగ్రామం – కపిలవాయి లింగమూర్తి

అర్ధాలు :

సఫలం – విజయవంతం

ప్రాప్యo – పొందదగినది

పారంగతుడు – నిష్ణాతుడు

ప్రవర్తన – నడవడిక

దీక్షాపరుడు – అనుకున్న కార్యం నెరవేర్చేవాడు

ఉడాయించడం – వెళ్ళిపోవడం

పర్యాయ పదాలు :

మార్గం, తోవ, దారి

రహస్యం, గుట్టు, మర్మం

గూడు, గృహం, సదనం, ఆవాసం

సీమ, ప్రాంతం, ప్రదేశం

మహిళ, వనిత, స్త్రీ

నానార్ధాలు :

పూనిక – యత్నం, సన్నాహం 

నిర్మాణం – ఆకృతి, కల్పన

దృక్పధం – అభిప్రాయం, మార్గం

పాదు – కుదురు, ఆవాసం

సుతరాం – ఏమాత్రం, కొంచెమైనా

ప్రకృతి – వికృతి :

విద్య – విద్దె

దేవళం – దేవాలయం

వీది – వీధి

నిదుర – నిద్ర 

చట్టం – శాస్త్రం

రాతిరి – రాత్రి

దిస్టి – దృష్టి 

14. ఆకుపచ్చశోకం

ఉద్దేశ్యం :

భూగోళం మీద జీవకోటికి ప్రాణవాయువు ఇచ్చి పచ్చదనం పెంచేవి చెట్లు. నాగరికత పేరుతో మనిషి ప్రకృతిని విచక్షణ లేకుండా కొల్లగొడుతున్నాడు. అవసరాన్ని మించి అడవులు ధ్వంసం చేస్తున్నాడు. ప్లాస్టిక్ భూతం ఒక వైపు అడవుల నరికివేత మరోవైపు పర్యావరణాన్ని ప్రమాదంలో పెడుతున్నాయి. ఈ ప్రమాదం గుర్తెరిగి పర్యావరణం కాపాడవలసిన అవసరం గూర్చి తెలపడమే ఈ పాఠం ఉద్దేశ్యం.

ప్రక్రియ – పర్యావరణ కవిత్వం :

తెలుగు సాహిత్యంలో పర్యావరణ కవిత్వం ఒక ఆధునిక ప్రక్రియ. మానవ కార్యకలాపాల వల్ల ప్రకృతికి పర్యావరణానికి కలుగుతున్న హానిని దానివల్ల కలిగే పర్యవసానాలను తెలపడమే పర్యావరణ కవిత్వం ఉద్దేశ్యం. పర్యావరణ భావనలను రచయిత కవిత రూపంలో వ్యాసరూపంలో వ్యక్తీకరిస్తారు. అందువల్ల దీనిని కవితా వ్యాసం అంటారు

అర్ధాలు :

హరితం – పచ్చదనం 

ఉపద్రవం – ప్రమాదం

బాహువులు – చేతులు

ఛాయ – నీడ

గరళం – విషం

పర్యాయ పదాలు :

చెట్లు – తరువులు, భుజములు

ముస్తాబు – అలంకరణ, అందంగా తయారు చేయడం

జాడ – గుర్తు, ఆనవాలు

తాపం – వేడి, ఉష్ణం, సెగ

సముద్రం – పయోధి, జలది

నానార్ధాలు :

ఎండ – వెలుగు, అతపం

కాలం – సమయం, నలుపు

కాయం – శరీరం, గురి, స్వభావం

జాడ – విధం, ఆచూకి, దారి

దాహం – దప్పిక, కాలడం

ప్రకృతి – వికృతి :

మనిషి – మానిసి

పట్టణం – పత్తనం

సముద్రం – సంద్రం

ఛాయ – చాయ

కధ – కత

జాతీయాలు :

పానకంలో పుడక – సందర్భానికి సంబంధం లేకుండా ఆటంకం కలిగించడం  

తామరతంపరగా – తొందరగా విస్తరించడం

కూర్చున్న కొమ్మను నరుక్కోవడం – ఆశ్రయం ఇచ్చిన వారినే చెడగొట్టడం

నిమ్మకు నీరెత్తినట్లు – ఎలాంటి సమస్య ఉన్నా నిబ్బరంగా ఉండడం

నడుం కట్టాలి – ఒక పని పూర్తి చేయడానికి పూర్తిగా సంసిద్ధం చేయడం

AP DSC Quick Revision | Class 1 & 2 Telugu

 

ఒకటవ తరగతి – తెలుగు

 

చందమామ రావే – తాళ్ళపాక అన్నమయ్య

పద్య రత్నాలు – వేమన

మేలుకొలుపు – వేటూరి ప్రభాకర శాస్త్రి

అమ్మ ఒడి – దేవులపల్లి కృష్ణశాస్త్రి

తారంగం – చింతా దీక్షితులు

తాయిలం – బి వి నరసింహారావు

పడవ – దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి

ఉడత ఉడత హూచ్ – సమతా రావు

ఊహల ఉయాల – తురుమెళ్ళ ఇంద్రాణి దేవి

బావా బావా పన్నీరు – వెలగా వెంకటప్పయ్య

ఆట – ఆదర్శ సామ్రాట్

ఇల్లు ఈగ – జై సీతారామ్

ఎలుకమ్మ – కస్తూరి నరసింహమూర్తి

శుభదాయిని – కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు

 

రెండవ తరగతి – తెలుగు

 

వాన – పాయల సత్యన్నారాయణ

చిలకల్లారా చిలకల్లారా – గురజాడ అప్పారావు

పూచిన పూలు – న్యాయపతి రాఘవరావు 

పరుగు పందెం – జై సీతారామ్

కొంటె కోతి – కస్తూరి నరసింహ మూర్తి

ఏ ఉరెలదాం – నాగ భైరవ ఆదినారాయణ

అప్పడాలు – బజ్జీలు – శాంతి వనం (మూలం)

సబ్బు బిళ్ళ – అలపర్తి వెంకట సుబ్బారావు

చిచ్చు బుడ్డి – పెద్దింటి సత్యనారాయణ మూర్తి

అరటి చెట్టు – సమతా రావు (సంకలనం)

అద్దాల బస్సు – బాలాంత్రపు రజనీకాంతరావు

కొయ్య గుర్రం – వెలగా వెంకటప్పయ్య

మొక్క జొన్న – కె. సభా (మూలం)

అమ్మమ్మ గారిల్లు – అలపర్తి వెంకట సుబ్బారావు

పాప నవ్వు – వేటూరి ప్రభాకర శాస్త్రి

ఒత్తుల బుట్ట – చింతా దీక్షితులు

మ్యావ్ మ్యావ్  – జై సీతారామ్

AP DSC Quick Revision | Class 3 Telugu

 

3వ తరగతి – తెలుగు తోట

1. తెలుగు తల్లి

పదాలు – అర్ధాలు:

కల్పవల్లి = కోరిన కోర్కెలు తీర్చేది

జాబిల్లి = చందమామ

తేనుంగు = తెలుగు

చంద్రశాల = చలువరాతి మేడ

కనవోయి = చూడవోయి

రేడు = రాజు

అనుంగు = ప్రియమైన

సుదూరం = చాలా దూరం

చనవోయి = వెల్లవోయి

నవ యుగం = కొత్త కాలం

నిర్భయంగా = భయం లేకుండా

నిశ్చయంగా – నమ్మకంగా, తప్పనిసరిగా

 

కవి పరిచయం:

శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీ శ్రీ) : 30.04.1910 – 15.06.1983

మహాకవి, అభ్యుదయ యుగకర్త, కధకులు, నాటక కర్త, విమర్శకులు, అనువాదకులు

మహా ప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన

ఇతర రచనలు – మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి

స్వీయ చరిత్ర – అనంతం

తల్లీ భారతి వందనం

కవి పరిచయం:

దాశరది కృష్ణమాచార్య : 22.07.1925 – 05.11.1987

నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి. నిజాం రాచరికం నుండి
తెలంగాణ విమోచనకి మేలుకొలుపు పాడినవారు

ఆంధ్ర ప్రదేశ్ ఆస్థాన కవిగా ఉన్నారు

పద్యాన్ని, పాటని సమానంగా నిర్వహించిన కవి

ఇతర రచనలు – అగ్నిధార, రుద్రవీణ, మహాంద్రోదయం, తిమిరంతో సమరం

స్వీయ చరిత్ర – యాత్రా స్మృతి

ఐకమత్యం

ఈ కధకు లియో టాల్ స్టాయ్ కధ ఆధారం

కవి పరిచయం;

లియో టాల్ స్టాయ్ : 09.09.1828 – 20.11.1910

రష్యన్ కధకులు, నవలాకారులు

ఇతర రచనలు – యుద్ధం – శాంతి, అన్నాకెరినినా

 

2. మర్యాద చేద్దాం

పరమానందయ్య గారి శిష్యుల కధ  

పదాలు – అర్ధాలు:

పండితుడు = బాగా చదువుకున్న వాడు, అన్నీ తెలిసినవాడు

జనులు = ప్రజలు

అమాయకత్వం = తెలియనితనం

పొరుగూరు = పక్క ఊరు

దంపతులు = భార్యా భర్తలు

అఘాయిత్యం = చేయకూడని పని 

బావురుమను = బోరున ఏడవడం

బిక్క మొహం = ఏడుపు మొహం

అతిధులు = అనుకోకుండా ఇంటికి వచ్చేవారు

మర్యాద = గౌరవం

అలికిడి = శబ్దం 

కుమ్మరించడం = ఒక్కసారిగా పోయడం

చిత్ర హింసలు = నానా భాదలు

బంధించి = కట్టివేసి

సన్మానించడం = గౌరవించడం

ఘనంగా = గొప్పగా

జింక – ఈసఫ్ కధ

 

3. మంచి బాలుడు

పదాలు – అర్ధాలు:

వీధులు = బజారులు

జడిసి = భయపడి

జనులు = ప్రజలు, జనం

త్రోవ = దారి

వడి = వేగం 

సాయం = సహాయం

ముదుసలి = ముసలి

జాలి = దయ

కొనిపోవు = తీసుకుపోవు

మనము = మనస్సు

దుర్బలులు = బలం లేనివారు

మనుజుడు – మనిషి

మనుగడ – జీవనం, జీవితం

 

కవి పరిచయం:

ఆలూరి భైరాగి : 05.11.1925 – 09.09.1978

మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించారు

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ పొందారు

బాలల కోసం చక్కని గేయ కధలు రచించారు

ఇతర రచనలు – చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి, దివ్యభవనం

 

భాషాంశాలు:

వాక్యం చివర ఉండే చుక్కను “వాక్యంత బిందువు” అంటారు(.). ఆంగ్లంలో ఫుల్ స్టాప్
అంటారు. ఈ పూర్ణ విరామ బిందువు ఉంటే ఆ వాక్యం అక్కడికి పూర్తి అయింది అని అర్ధం

వాక్యాలు ఆపి చదవడాన్ని స్వల్ప విరామం అంటారు. అలా స్వల్ప విరామం ఇచ్చే చోట ఉండే
గుర్తును “స్వల్ప విరామ చిహ్నం” అంటారు(,). ఆంగ్లంలో కామా అంటారు.

కలపండి చేయి చేయి

కవి పరిచయం:

దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి : 01.11.1897 – 24.02.1980

ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచారు.

కవిత్వ లక్షణాలు – అక్షర రమ్యత, భావనా సౌకుమార్యం, శబ్ద సంస్కారం

వీరి కవిత్వాన్ని శ్రీ శ్రీ ఇక్షు సముద్రంతో పోల్చారు

పద్మ భూషణ్ పురష్కారం అందుకున్నారు

ఇతర రచనలు – కృష్ణ పక్షం, ఊర్వశి, ప్రవాసం

బావిలో నీళ్ళు – అక్బర్ బీర్బల్ కధ

 

4. నా బాల్యం

పదాలు – అర్ధాలు;

ఆశ = కోరిక

ఆరుగాలం = ఏడాది అంతా

దినచర్య = ప్రతిరోజూ చేసే పనులు 

గురుదక్షిణ = గురువుకి ఇచ్చే కానుక

వార్షికోత్సవం = సంవత్సరం చివర జరిపే పండగ

గుంజ = రాట

పామరులు = చదువుకోనివారు

 

షేక్ నాజర్ జీవిత విశేషాలు:

జననం – 1920 ఫిబ్రవరి 05 గుంటూరు జిల్లా పొన్నెకళ్లు గ్రామం

తండ్రి – షేక్ మస్తాన్, తల్లి – బీనాబీ

బుర్రకధ ప్రక్రియకి నాజర్ కొత్త మెరుగులు దిద్దారు

పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్
కరువు వంటి ఇతివృత్తాలుతో బుర్రకధలు రూపొందించారు

1986 లో  పద్మ శ్రీ అందుకున్నారు

మరణం – 1997 ఫిబ్రవరి 22

 

షేక్ నాజర్ తన కధ తానే చెప్పుకున్నట్టు అక్షరీకరించినది – అంగడాల రమణమూర్తి

స్వీయ చరిత్రాత్మకమైన ఈ కధకు “పింజారి” అని పేరు పెట్టారు

 

బంగారు పాపాయి

కవి పరిచయం:

మంచాల జగన్నాధ రావు ; 1921 – 1985

కవి, సంగీత విద్వాంసులు, ప్రసిద్ద వాగ్గేయకారుల కృతులకి స్వర రచన చేశారు

 

5. పొడుపు – విడుపు

పదాలు – అర్ధాలు:

నుయ్యి = బావి

ప్రారంభించు = మొదలుపెట్టు

ఏరు = నది

 

కవి పరిచయం:

చింతా దీక్షితులు : 25.08.1891 – 25.08.1960

కవి, కధకులు, విద్యావేత్త

తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు

గిరిజనులు, సంచార జాతుల గురించి తెలుగులో కధలు రాసిన తొలి రచయిత

జానపద గేయాలు సేకరించారు

ఇతర రచనలు – ఏకాదశి, శబరి, వటీరావు కధలు, లక్కపిడతలు

 

భాషాంశాలు:

పేర్లని తెలిపే పదాలని “నామవాచకాలు” అంటారు

చందమామ

కవి పరిచయం:

నండూరి రామమోహనరావు : 24.04.1927 – 02.09.2011

కవి, అనువాదకులు, గొప్ప భావుకులు

ఈయన రాసిన బాల గేయాల సంపుటం – హరివిల్లు

నరావతారం, విశ్వరూపం రచనల ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకి
పరిచయం చేశారు

ఇతర రచనలు – విశ్వ దర్శనం, అక్షర యాత్ర

టామ్ సాయర్, హకల్ బెరిఫిన్ – మార్క్ ట్వయిన్ రచనలకి అనువాదం

వికటకవి – తెనాలి రామకృష్ణ కధలు

 

6. మే మే మేకపిల్ల

పదాలు – అర్ధాలు:

బుద్ది = ఆలోచన

వాలకం = తీరు

గందరగోళం = తికమక

అదృశ్యం = మాయం

పొగరు = గర్వం

తిన్నగా = నేరుగా

మరగడం = కాగడం

కాగు = పెద్ద బిందె

 

కవి పరిచయం:

1949 లో బాపట్లకి చెందిన ఆర్. శకుంతల రచించిన చందమామ కధ

 

భాషాంశాలు:

నామవాచకాలకి బదులుగా వాడేవి సర్వనామాలు

నేను, మేము, మీరు, వాళ్ళు, అతను, ఆమె, అది మొదలైనవి

తెలుగు తోట

కవి పరిచయం:

కందుకూరి రామభద్రరావు : 31.01.1905 – 08.10.1976

రచనలు – లేమొగ్గ, తరంగిణి, గేయ మంజరి

 

7. పద్య రత్నాలు

1. అనగ ననగ రాగ మతిశయిల్లుచు నుండు ——————– వినుర
వేమ!

అర్ధాలు:

అనగననగ = పాడగా పాడగా

అతిశయిల్లు = అభివృద్ది చెందు 

వేము = వేప

సాధనం = అభ్యాసం

సమకూరు = నెరవేరు

ధర = భూమి, నేల

2. బహుళ కావ్యములను పరికింపగా వచ్చు ——————– వినుర వేమ!

అర్ధాలు:              

బహుళ = అనేక

కావ్యములు = గ్రంధాలు

పరికించు = పరిశీలించు

శబ్దచయము = పదాల సమూహం 

సహనం = ఓర్పు 

అబ్బు = అలవాటగు

3. చదువు చదవకున్న సౌఖ్యంబు నుండదు ——————— వినుర
వేమ!

అర్ధాలు:

చదువు = విద్య

చదవకున్న = నేర్చుకోకున్నా

సౌఖ్యం = సుఖం

సరసుడు = మంచి గ్రహించే వాడు

మర్మము = సారం, భావం, రహస్యం

 

4. ఐక్యమత్యమొక్క టావశ్యకంబెప్డు ———————- వినుర వేమ!

అర్ధాలు:

ఐకమత్యం = కలసి ఉండడం

బలిమి = బలం

ఆవశ్యకం = అవసరం

ఎప్డు – ఎల్లప్పుడూ 

 

5. కమలములు నీట బాసిన ——————— సుమతీ!

అర్ధాలు;

కమలములు = తామర పూలు

కమలాప్తుడు = సూర్యుడు 

రశ్మి – కిరణం, వేడి

సోకి = తాకి, తగిలి

నెలవు = చోటు

 

6. లావుగల వానికంటెను ——————– సుమతీ!

అర్ధాలు:

సుమతీ = మంచి బుద్ధి గలవాడా

లావు = బలం, శక్తి

భావింపగ = ఆలోచింపగ

నీతిపరుడు = తెలివిగలవాడు

గ్రావం = కొండ

గజము = ఏనుగు

మావటివాడు = ఏనుగును నడిపించేవాడు

మహి = భూమి 

7. కలిమి గల లోభి కన్నను ——————– గువ్వల చెన్న!

అర్ధాలు:

కలిమి – సంపద

లోభి = పిసినారి

వితరని = దాత

విలసితముగా = చక్కగా

పేద = బీదవాడు 

చలిచెలమ = మంచినీటి గుంట

కులనిధి = ఎక్కువ నీరు గలది

అంభోది = సముద్రం 

 

8. దేశసేవ కంటే దేవతార్చన లేదు ——————– తెలుగుబాల

అర్ధాలు:

అర్చన = పూజ, సేవ

స్వార్ధపరత = అన్నీకావాలనుకోవడం 

చావు = మరణం

సానుభూతి = దయ కలిగి ఉండడం

స్వర్గం = సుఖం

 

9. సంపదల తెలునప్పుడిచ్చకములాడి ——————– చెలిమి కాండ్రు

అర్ధాలు:

ఇచ్చకములు = ప్రియమైన మాటలు

చెలిమి కాండ్రు = స్నేహితులు 

ఆప్తవరులు = హితులు

కాంచు = చూచు

 

 

కవి పరిచయం:

వేమన : వేమన శతకం

17 -18 శతాబ్ద మధ్య కాలం. కడప జిల్లా వారని చరిత్రకారుల
భావన. వేమన సమాధి అనంతపురం జిల్లా కటారుపల్లెలో ఉంది.

బద్దెన : సుమతీ శతకం

13 వ శతాబ్దం

గువ్వల చెన్నడు :

17 – 18 శతాబ్ద మధ్య కాలం. కడప జిల్లా రాయచోటి ప్రాంతం స్వస్థలం.

మకుటం : గువ్వల చెన్న

జంధ్యాల పాపయ్య శాస్త్రి : తెలుగు బాల శతకం

గుంటూరు జిల్లా పెదనందిపాడు మం. కొమ్మూరు గ్రామం (04.08.1912 – 12.06.1992)

రచనలు – విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ

దువ్వూరి రామిరెడ్డి :

నెల్లూరు జిల్లా (09.11.1895 – 11.09.1947)

రచనలు – కృషీవలుడు, జలదాంగాన, గులాబీ తోట, పానశాల

 

భాషాంశాలు:

పనులను తెలిపే పదాలు “క్రియా పదాలు” అంటారు

అందమైన పాట

కవి పరిచయం:

జి.వి.సుబ్రమణ్యం : 10.09.1935 – 15.08.2006

విద్వాంసులు, విమర్శకులు. తెలుగులో నవ్యసంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ
చేపట్టారు

రచనలు – వీరరసము, రసోల్లాసము, సాహిత్య చరిత్రలో చర్చనీయ అంశాలు

దిలీపుని కధ – పురాణ కధ

 

8. మా వూరి ఏరు

పదాలు – అర్ధాలు:

ఏడాది = సంవత్సరం

ముచ్చటగా = చక్కగా

పారు = ప్రవహించు

గుండ్లు = గుండ్రని రాళ్ళు

పొదరిండ్లు = దట్టమైన పొదలు

సుగంధం = మంచి వాసన  

వరద = ఎక్కువ నీటి ప్రవాహం

రొదలు = శబ్దాలు

వినువీధి = ఆకాశం

హొయలుగా = వయ్యారంగా

తిరుణాళ్ళు = ఊరి పండగ

పొంగు = ప్రవాహం పెరుగు

ఇంకిపోవడం = నేలలోకి వెళ్ళిపోవడం

ఇసుక తిన్నెలు = ఇసుక మేటలు

కొరత = తక్కువ

ఉద్యానవనం = పూల తోట

ప్రారంభించు = మొదలు పెట్టు

ఏరు = నది 

 

కవి పరిచయం:

మధురాంతకం రాజారాం : 05.10.1930 – 01.04.1999

రాయలసీమ జీవితం ప్రతిబంబిస్తూ 400 కి పైగా కధలు రాశారు.

మానవ సంబందాల్లో సున్నిత పార్శ్వలని చిత్రించారు. 

ఉత్తమ ఉపాధ్యాయులు. కేంద్ర సాహిత్య అకాడమీ పురష్కారం అందుకున్నారు

పంట చేలు

కవి పరిచయం:

పాలగుమ్మి విశ్వనాధం : 01.06.1919 – 25.10.2012

ఆకాశవాణిలో పని చేశారు. లలిత సంగీతానికి ప్రచారం కల్పించారు. వేలాది పాటలకి
సంగీతం కూర్చారు. గీత కర్త.

బుద్ది బలం – పంచతంత్ర కధలు

 

9. తొలి పండగ

పదాలు – అర్ధాలు:

గ్రామం = ఊరు, పల్లెటూరు

కమ్మని = మంచి, చక్కని

తొలి = మొదటి

ప్రారంభం = మొదలు

ఆది = మొదలు

నైవేద్యం = దేవునికి పెట్టేది 

షడ్రుచులు = ఆరు రుచులు

పంచాంగం = ఆయిదు భాగాలు కలది

విశేషాలు – కొత్త విషయాలు

అందాల తోటలో

కవి పరిచయం:

కస్తూరి నరసింహమూర్తి గారు రచించిన “పాపాయి సిరులు” అనే గేయ సంపుటి నుండి
తీసుకున్నారు

 

నక్క యుక్తి – జానపద కధ

కవి పరిచయం:

జంధ్యాల పాపయ్య శాస్త్రి : 1892 – 1980

గద్వాల సంస్థాన కవి. సహస్రావధాని.

రచనలు – ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యం, రత్నలక్ష్మీ శతపత్రం, కేనోపనిషత్తు

     

AP DSC Quick Review | Class 4 Telugu

 

4వ తరగతి – తెలుగు తోట

1. గాంధీ మహాత్ముడు

కవి పరిచయం:

బసవరాజు అప్పారావు (13.12.18914 – 10.06.1933)

భావకవి, గీత కర్త

బసవరాజు అప్పారావు గేయాలు పేరిట ఈయన గీతాలు సంపుటంగా వెలువడ్డాయి

పదాలు – అర్ధాలు:

స్వరాజ్యం = సొంత పాలన

ప్రణవం = ఓంకారం

మోక్షం = విడుపు, విముక్తి

అధర్మం = అన్యాయం

కంపించుట = వణుకుట

స్వస్తి = శుభం

తేనెల తేటల మాటలతో

కవి పరిచయం:

ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (29.05.1944 – 25.07.2019)

కవి, కధకులు, విమర్శకులు,లలిత గీత కర్త. ఆకాశవాణిలో పని చేశారు 

తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి.

కవితా సంపుటి – అనుభూతి గీతాలు

తెలివైన దుప్పి – జాతక కధ

 

2. గోపాల్ తెలివి

పదాలు – అర్ధాలు:

దర్బారు = రాజసభ

విదూషకుడు = హాస్యగాడు

సామంతులు = రాజు కింద రాజులు

చూడగంటి

కవి పరిచయం:

తాళ్ళపాక అన్నమయ్య (09.05.1408 – 23.02.1503)

పదకవితా పితామహులు. 32 వేల సంకీర్తనలు రాశారని ప్రతీతి

వేంకటేశ్వర స్వామి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతి ని
నిర్మించారు

తేట తెలుగు పలుకుబడి, దేశి పదసంపద, వాడుక భాషలో అపురూప మాధురి అన్నమయ్య
కవిత్వంలో ఉంటాయి

విందు

కవి పరిచయం:

సోదుం రామ్మోహన్ (02.03.1939 – 12.11.2008)

పత్రికా రచయిత, పలు రచనలు అనువాదాలు చేశారు. నిఘంటు నిర్మాణం చేశారు.

రెండు దశాబ్దాలు విశాలాంద్ర లో ఒక దశాబ్దం పాటు ఉదయం పత్రికలో పని చేశారు

 

3. దేశమును ప్రేమించుమన్నా..

కవి పరిచయం:

గురజాడ వెంకట అప్పారావు (21.09.1862 – 30.11.1915)

ఆధునిక తెలుగు కవిత్వానికి, సాహిత్యానికి మార్గదర్శకులు

యుగకర్త, కవి, కధకులు, నాటక కర్త, చరిత్రకారులు, శాసన పరిశోదకులు, భాషావేత్త

తెలుగు సాహిత్యంలో వాడుక భాష ప్రవేశపెట్టి చిరస్మరణీయ రచనలు చేశారు

కన్యాశుల్కం నాటకం ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్ట రచన

పదాలు – అర్ధాలు:

ఒట్టి = ఏమి లేని

కద్దు = కలదు, ఉన్నది

దేశాభిమానం = దేశం మీద ప్రేమ

తోడుపడు = సహాయపడు

చెట్టా పట్టాలు = ఒకరి చేయి మరొకరు పట్టుకోవడం

భాషాంశాలు:

ప్రశ్నార్ధక గుర్తు (?) గల వాక్యాలను ప్రశ్నార్ధక వాక్యాలు అంటారు

తెలుగు తల్లి

కవి పరిచయం:

పిల్లలమర్రి వెంకట హనుమంతరావు (07.05.1921 – 13.09.1989)

విమర్శకుడు, కవి

సాహిత్య వ్యాసాలు, కధలు, ఏకాంకికలు, ఖండ కావ్యాలు రచించారు

ముఖ్య రచనలు – సాహిత్య సంపద, ఆంధ్రాభ్యుదయం, కాపు పాటలు

కందిరీగ కిటుకు

కవి పరిచయం:

రావూరి భరద్వాజ (05.07.1927 – 18.10.2013)

జననం – గుంటూరు జిల్లా తాడికొండ

ఈయన రాసిన తొలికధ – విమల

అపరిచితులు, కధాసాగరం వంటి 37 కధాసంపుటాలు, ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43
పిల్లల కధలు, జల ప్రళయం, కరి మింగిన వెలగపండు వంటి 17 నవలలు రాశారు

అవార్డులు – జ్ఞానపీఠ్, కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ, సోవియట్ భూమి
నెహ్రూ పురష్కారం, రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డ్, గోపీచంద్ జాతీయ సాహిత్య
పురష్కారం, కళారత్న (ఆ. ప్ర.), లోక్ నాయక్ ఫౌండేషన్ పురష్కారం

 

4. పరివర్తన

కవి పరిచయం: వెంకట పార్వతీశ కవులు

బాలాంత్రపు వెంకట రావు (1882 – 1955)

తల్లిదండ్రులు – సూరమ్మ, వెంకట నరసింహం

జన్మ స్థలం – మళ్ళాము, తూ. గో. జిల్లా

ఓలేటి పార్వతీశం (1880 – 1970)

తల్లిదండ్రులు – వెంకమ్మ, అచ్యుత రామయ్య

జన్మ స్థలం – పిఠాపురం, తూ. గో. జిల్లా 

పదాలు – అర్ధాలు:

పరివర్తన = మార్పు

చిందర వందర = క్రమం లేకపోవుట

ఆహ్లాదంగా = సంతోషంగా

ఆసక్తి = ఇష్టంగా

ఆత్మీయంగా = ప్రేమగా

చిన్నబుచ్చుకొను = నిరాశపడు 

పడవ నడపవోయి

కవి పరిచయం:

వింజమూరి శివరామారావు (1908 – 1982)

జన్మ స్థలం – తూ. గో. జిల్లా పిఠాపురం దగ్గర చంద్రపాలెం

రచనలు – గోర్కీ కధలు, కల్పవల్లి, ఖండకావ్య సంపుటి

బిరుదు – కళాప్రపూర్ణ

ఉపాయం – ఇతిహాసం, మహాభారతం

 

5. సత్య మహిమ

కవి పరిచయం:

అవధాని రమేష్ (20వ శతాబ్దం)

ఆంధ్ర రాష్ట్రంలో కర్నూల్ జిల్లా అవుకు అగ్రహారంలో జన్మించారు

తల్లిదండ్రులు – సుబ్రమణ్య శాస్త్రి, సావిత్రమ్మ

రచనలు – కాసుల పేరు, ప్రతీకారం, మూడు మంచి కధలు

ఈ గేయకధ రమేష్ గారి రచన అయిన “గుజ్జెన గూళ్ళు” నుండి తీసుకోబడింది

పదాలు – అర్ధాలు:

మహిమ = గొప్పతనం

ఆకలంక = చెడుగుణం లేనట్టి

చరితుండు = చరిత్ర కలవాడు

సత్య వ్రతంబు = ఎల్లవేళలా నిజం చెప్పడం

నిత్యంబు = ఎల్లప్పుడూ

గతి = జీవితం నడిచే విధానం

తెన్నులు చూచి = ఎదురు చూసి  

మోము = ముఖం

తత్తరం = గాబర

ఆర్తి = దుఖం

కని = చూసి

దీనత = దారిద్ర్యం

కరుణ = దయ, జాలి

మిరుమిట్లు = మెరుగులు

తిలకించు = చూసి

మది = మనసు, బుద్ధి

మొగంబు = ముఖం

మిసిమి = నూతన కాంతి

బహుమానం = కానుక

వన్నె = అందం రంగు

చెన్ను = అందం

భాషాంశాలు:

పనుల గురించి తెలిపే పదాలు – క్రియా పదాలు

కన్నడ గేయం – ఎస్.సి.ఈ.ఆర్.టి పాఠ్య పుస్తకం

ఏ కాలుది నేరం? – మర్యాద రామన్న కధలు

 

 

6. ముగ్గులలో సంక్రాంతి

పదాలు – అర్ధాలు:

పద్మం = తామరపువ్వు

విశిష్టత = గొప్పతనం

సంబరం = సంతోషం

ధనస్సు = విల్లు

రాశి = నక్షత్ర గుంపు

కలశం = చిన్న కుండ, చెంబు

గొబ్బిళ్ళు = ముగ్గుపై అలంకరించిన 
ఆవుపేడ ముద్దలు

ఆయనం = గమనం 

భాషాంశాలు:

నామవాచకం యొక్క గుణాలను తెలిపే పదాలు “విశేషణాలు”

విశేషణం నామవాచకం ముందు వస్తుంది

గొబ్బిళ్ళ పాట – సంప్రదాయ జానపద గేయాలు

నకిలీ కన్ను – నసీరుద్దీన్ కధలు

 

7. పద్య రత్నాలు

1. ధనము కూడబెట్టి దానంబు సేయక ——————– వినుర వేమ!                            (వేమన)                                     

అర్ధాలు:

లెస్స = మిక్కిలి / ఎక్కువగా

తెరువరి = బాటసారి

 

2. పుత్రోత్సాహం తండ్రికి ——————— సుమతీ!                                                       (బద్దెన)

అర్ధాలు:

పుత్రోత్సాహం = కొడుకు పుట్టిన సంతోషం

జన్మించినపుడు = పుట్టినప్పుడు

కనుగొని = గుర్తించి  

పొందురు = పొందుతారు

జనులు = ప్రజలు

3. పరులకొరకె నదులు ప్రవహించు, గోవుల ——————– తెలుగు బాల!        (జంధ్యాల పాపయ్య శాస్త్రి)

అర్ధాలు:

పరులు = ఇతరులు

గోవులు = ఆవులు

పరహితము = ఇతరులకు మేలు

పరమార్ధం = నిజమైన ప్రయోజనం

 

4. బలవంతుడ నాకేమని ————— సుమతీ!                                                                   (బద్దెన)

అర్ధాలు:

బలవంతుడు = బలం కలవాడు

పలువురు = చాలా మంది

సర్పం = పాము

నిగ్రహించు = ఎదిరించి

పలుకుట = మాట్లాడడం

5. మొదలు చూచిన కడుగొప్ప పిదప కురుచ ——————– కుజన సజ్జనుల మైత్రి
    (ఏనుగు లక్ష్మణ కవి)

అర్ధాలు:

కురచ = పొట్టి

ఆది = మొదలు

తనరు = వర్ధిల్లు 

దినపూర్వ = ఉదయకాల

ఛాయ = నీడ

కుజన = చెడ్డవారి

సజ్జనుల = మంచివారి

మైత్రి = స్నేహం

6. ఎంత చెలిమి యున్న ఎగతాళి చేయకు ———————- తెలుగు బిడ్డ!                                 (నార్ల చిరంజీవి)

అర్ధాలు:

చెలిమి = స్నేహం

ఎగతాళి = వెటకారం

వేళాకోళం = సరసం

విరసం = అయిష్టం

7. మతము లెన్ని యున్న మానవత్వమొక్కటే ——————– నార్లవారిమాట!       (నార్ల వేంకటేశ్వర రావు)

అర్ధాలు:

మానవత్వం = మనిషికి ఉండే సహజగుణం  

పరమార్ధం = గొప్పదైన అర్ధం

 

8. బ్రతుకవచ్చు గాక బహుబంధనము లైన ———————- మానధనులు!                              (పోతన)

అర్ధాలు:

బంధనములు = కట్లు

లేమి = పేదరికం

మానధనులు = మానమే ధనంగా కలవారు(పరువు కలవారు)

జీవధనం = ప్రాణం 

9. పూజకన్న నెంచ బుద్ధి ప్రధానంబు ——————– వినురవేమ!                                            (వేమన)

అర్ధాలు:

బుద్ధి = ఆలోచన

ప్రధానం = ముఖ్యం

దృడం = గట్టిది

భాషాంశాలు:

జరిగిపోయిన పని తెలిపేది – భూత కాలం

జరుగుతున్న పని తెలిపేది – వర్తమాన కాలం

జరగబోయే పని తెలిపేది – భవిష్యత్ కాలం

వీరగంధం

కవి పరిచయం:

త్రిపురనేని రామస్వామి (15.01.1887 – 16.01.1943)

హేతువాద రచయిత. ఈయన “కవిరాజు” అనే బిరుదు పొందారు

రచనలు – సూత పురాణం, పల్నాటి పౌరుషం

పేను – నల్లి – నీతి చంద్రిక

 

8. బారిష్టర్ పార్వతీశం

కవి పరిచయం:

మొక్కపాటి నరసింహ శాస్త్రి (09.10.1892 – 05.03.1973)

ఈయన ప. గో. జిల్లా నరసాపురంలో జన్మించారు

బారిష్టర్ పార్వతీశం తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన హాస్య నవల

రచనలు – మొక్కుబడి, అభ్యుదయం, పెదమామయ్య

పదాలు – అర్ధాలు:

కాపుర స్థలం = నివాసం

ఐదవ ఫారం = పదవ తరగతి

హితోపదేశం = మేలు చేసే మాట

బారిస్టర్ = ఇంగ్లాండ్ లో న్యాయశాస్త్రం 
చదివేవాడు

సామాగ్రి = సామాన్లు, వస్తువులు

దంతధావనం = పళ్ళు తోమడం

కచ్చికలు = కాల్చిన పిడకలు

అంగవస్త్రం = తువ్వాలు

చాదు = పిండితో చేసిన బొట్టు

దేశవాళీ దువ్వెన = చెక్క దువ్వెన

గార్డు = కాపలా వ్యక్తి

ప్రాధేయపడి = బతిమాలి

చెన్నపట్నం = మద్రాస్

దొర = తెల్లజాతి పురుషుడు

దొరసాని = తెల్లజాతి స్త్రీ

బస = తాత్కాలిక నివాసము

బంట్రోతు = సేవకుడు

స్టీమరు = ఆవిరితో నడిచే పెద్ద నావ

అంతరిక్ష మార్గం = ఆకాశం వైపు 

భాషాంశాలు:

వాక్యం పూర్తి అయితే సమాపక క్రియ అంటారు

వాక్యం పూర్తి కాకపోతే అసమాపక క్రియ అంటారు

ఏరువాక పాట

కవి పరిచయం:

బిరుదురాజు రామరాజు (16.04.1925 – 08.02.2010)

జననం – వరంగల్ దగ్గర దేవనూరు గ్రామం

తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటగా పరిశోదన చేశారు

రచనలు – జానపద రామాయణం, తెలుగు సాహిత్యోద్ధారకులు

అత్యాశ – పంచతంత్రం కధ

 

9. రాజు – కవి

కవి పరిచయం:

గుర్రం జాషువా (28.09.1895 – 24.07.1971)

జననం – గుంటూరు జిల్లా వినుకొండ

కవిత్వ లక్షణాలు – ప్రశస్తమైన పద్యశిల్పం, సులలితమైన ధార, అట్టడుగు వర్గాల
పట్ల ప్రేమ, సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం

బిరుదులు – నవయుగ కవి చక్రవర్తి, కళాప్రపూర్ణ

రచనలు – ఫిరదౌసి, గబ్బిలం, క్రీస్తు చరిత్ర

పదాలు – అర్ధాలు:

సౌధం = భవనం

జన్మించడం = పుట్టడం

ప్రబలడం = ఎక్కువ కావటం

సుకవి = మంచి కవి

శతం = నూరు, వంద

రాజదండం = రాజశాసనం

ధనమయం = ధనంతో నిండినది

రుచిమయం = కాంతితో నిండినది

గండవితతిమయం = రాళ్ళతో నిండినది

ప్రస్తుతింతురు = పొగుడుతారు

సుధ = అమృతం 

ఆత్మగౌరవకాములు = తమ గౌరవం కోరుకునేవారు

ఇహం = ఈ లోకం

పరం = పరలోకం

గగనం = ఆకాశం

తార = నక్షత్రం 

 

 

పర్యాయ పదాలు:

ఇల్లు =

ధనం =

కత్తి =

ప్రపంచం =

తార =

వెయ్యేళ్ళ కవినోయ్

కవి పరిచయం:

అడవి బాపిరాజు (08.10.1895 – 22.09.1952)

కవి, నవలాకారుడు, కధకుడు, చిత్రకారుడు

రచనలు – నారాయణరావు, హిమబిందు, గోనగన్నారెడ్డి, శశికళ, గంగిరెద్దు

 

     

        

 

9th తెలుగు – పదజాలం | Mega DSC Special I Telugu Content

AP DSC 2024: All the Details Here

 AP DSC – Notification.

ఏపీ డీఎస్సీ 2024: పూర్తి వివరాలు ఇవే

AP DSC 2024: All the Details Here


 

======================

ఆంధ్ర ప్రదేశ్ లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. నేడు (ఫిబ్రవరి 7) విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేస్తూ వివరాలు వెల్లడించారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా 6,100 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.  ఈ ప్రక్రియ ఫిబ్రవరి 12 నుంచి ప్రారంభం అయ్యి ఏప్రిల్ 7న ఫలితాల విడుదల తో ముగుస్తుందని తెలియచేసారు.

పోస్టుల వారీగా వివరాలు:

SGT: 2280 పోస్టులు

SA: 2299 పోస్టులు

TGT: 1264 పోస్టులు

PGT: 215 పోస్టులు

Principal: 42 పోస్టులు

మొత్తం పోస్టులు: 6100  

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12-02-2024

ఫలితాలు విడుదల తేదీ: 07-04-2024    

======================.

https://www.manatet.in/2024/02/ap-dsc-2024-all-details-here.html


 

 

error: Content is protected !!