పెరుగుదల : (Growth)
జీవిలో జరిగే పరిమాణాత్మకమైన, భౌతికమైన, శారీరక మార్పుల వివరణనే పెరుగుదల అంటారు.
పెరుగుదల ప్రతి జీవిలోను జరిగే సర్వసాధారణమైన ప్రక్రియ.
జీవి యొక్క ఆకారంలోను, పరిమాణంలోను సంభవించే మార్పులనే పెరుగుదల అంటారు.
పెరుగుదల అనునది కేవలం పరిమాణాత్మక మార్పులకే పరిమితం. ఇది ఒక దశలో ఆగిపోతుంది.
Note : వెంట్రుకలు, గోర్లు జీవితాంతం పెరుగుతాయి
వ్యక్తి వికాసానికి పెరుగుదల పునాది వేస్తుంది. ఇది భౌతికపరమైన చర్యకు సంబంధించినాంశం.
శిశువు అంగాలు, అవయవాలు, బరువు వృద్ది చెందడాన్ని పెరుగుదల అంటారు.
పెరుగుదలకు సంబంధించిన మార్పులు రెండు రకాలు.
అంతర్గత మార్పులు : శరీరం లోపలి అవయవాలైన మూత్రపిండాలు, హృదయం, మెదడు, నాడీమండల వ్యవస్థ, కాలేయం ఊపిరితిత్తులు మొ|| వాటి పరిమాణం వృద్ధి చెందడం.
బహిర్గత మార్పులు : శరీరం వెలుపలి అవయవాలైన కాళ్ళు, చేతులు, శరీర పరిమాణం వృద్ది చెందడం.
ఉదా : పొడవు, లావు, ఎత్తు, బరువు
శిశువు శారీరకంగా పెరగడమే కాకుండా, అంతర్గత అవయవాలు, మెదడు పరిమాణంలో కూడా వృద్ధి ఉంటుంది.
శారీరక పెరుగుదల కాక మానసిక పెరుగుదల కూడా ఉంటుంది.
హార్లాక్ : పెరుగుదల పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది. అంటే శిశువు శరీరపరిమాణం, నిర్మితి లలోజరిగే వృద్ధి
క్రో & క్రో : ఆకృతిపరమైన, శారీరకపరమైన మార్పులను పెరుగుదల అంటారు.

Follow the Telugu eTutor channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb6Ixb56buMQiQIKRI2H


Excellent
Thank you
Thank you so much for your supporting . I hope this time I’ll get good score in tet