6th Class Social Bits 11th Lesson భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

1. భారతదేశంలో భిన్నత్వానికి కారణం.
A) విశాలమైన దేశం
B) అనేక జాతుల అనుసంధానం
C) భౌగోళిక మరియు శీతోష్ణస్థితి అంశాలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

2. వేదాలను ఏ సంప్రదాయం ద్వారా ఒక తరం నుండి మరొక తరానికి తీసుకు వచ్చారు?
A) మౌఖిక
B) గ్రంథస్థ
C) (శాసన) రచన
D) పైవన్నీ
జవాబు:
A) మౌఖిక

3. అశోకుడు వేయించిన అన్ని శాసనాల్లో ఈ లిపి ఉపయోగించారు.
A) బ్రహ్మీ
B) దేవనాగరి
C) కరో
D) హిరోగ్లిఫక్
జవాబు:
A) బ్రహ్మీ

4. తెలుగు భాషలో ఇన్ని అక్షరాలు కలవు.
A) 54
B) 56
C) 65
D) 45
జవాబు:
B) 56

5. భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని?
A) 22
B) 24
C) 26
D) 20
జవాబు:
A) 22

6. భారత రాజ్యాంగంలో గుర్తించిన భాషలు ఈ షెడ్యూల్ లో కలవు.
A) 7వ
B) 8వ
D) 10వ
C) 9వ
జవాబు:
B) 8వ

7. భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో గుర్తించబడిన భాష కానిది.
A) తెలుగు
B) హిందీ
C) ఇంగ్లీషు
D) ఉర్దూ
జవాబు:
C) ఇంగ్లీషు

8. ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పవిత్ర ప్రదేశమైన తిరుమల ఈ జిల్లాలో ఉంది.
A) కర్నూలు
B) కడప
C) చిత్తూరు
D) నెల్లూరు
జవాబు:
C) చిత్తూరు

9. చతుర్విధ పురుషార్థాలలో లేనిది.
A) ధర్మం
B) న్యాయం
C) అర్ధం
D) మోక్షం
జవాబు:
B) న్యాయం

10. మొత్తం ఇంతమంది తీర్థంకరులు కలరు.
A) 22
B) 24
C) 26
D) 28
జవాబు:
B) 24

11. ‘జైన’ అనే పదం ‘జిన’ అనే ఈ పదం నుండి వచ్చింది.
A) సంస్కృతం
B) హిందీ
C) గ్రీకు
D) గుజరాతీ
జవాబు:
A) సంస్కృతం

12. వర్థమాన మహావీరుని జననం.
A) క్రీ.పూ. 599
B) క్రీ.పూ. 563
C) క్రీ.శ. 599
D) క్రీ.శ. 563
జవాబు:
A) క్రీ.పూ. 599

13. జైనుల పవిత్ర గ్రంథాలను ఇలా పిలుస్తారు.
A) పీఠికలు
B) గ్రంథసాహెబ్
C) అంగాలు
D) త్రిరత్నాలు
జవాబు:
C) అంగాలు

14. పంచవ్రతాలు (జైన మత సిద్ధాంతాలు) లో మహావీరుడు చేర్చిన సిద్ధాంతం.
A) అహింస
B) సత్యం
C) అస్తేయం
D) బ్రహ్మచర్యము
జవాబు:
D) బ్రహ్మచర్యము

15. గౌతమ బుద్ధుడు ఇక్కడ జన్మించాడు.
A) వైశాలి
B) లుంబిని
C) సాంచి
D) పాటలీపుత్రం
జవాబు:
B) లుంబిని

16. గౌతమ బుద్ధుని మరణం.
A) క్రీ.పూ. 527
B) క్రీ.పూ. 483
C) క్రీ.శ. 527
D) క్రీ.శ. 483
జవాబు:
B) క్రీ.పూ. 483

17. గౌతమ బుద్ధుని బోధనలను ఇలా పిలుస్తారు.
A) త్రిపీఠికలు
B) త్రిరత్నాలు
C) పంచవ్రతాలు
D) ఆర్యసత్యాలు
జవాబు:
D) ఆర్యసత్యాలు

18. గొప్ప బౌద్ధ స్మారక కట్టడమైన సాంచి స్థూపంను నిర్మించినది.
A) అశోకుడు
B) శాతవాహనుడు
C) సముద్రగుప్తుడు
D) బిందుసారుడు
జవాబు:
A) అశోకుడు

19. ముస్లిం భక్తులు తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా ఈ యాత్ర చేయాలనుకుంటారు.
A) వాటికన్
B) హజ్ (మక్కా)
C) అమృతసర్
D) పైవన్నీ
జవాబు:
B) హజ్ (మక్కా)

20. రోమన్ కాథలిక్ చర్చికి అధిపతిని ఇలా అంటారు.
A) పాస్టర్
B) ఫాదర్
C) బిషప్
D) పోప్
జవాబు:
D) పోప్

21. సిక్కు మత స్థాపకుడు.
A) గురుగోవింద్
B) గురుతేజ్ బహదూర్
C) గురునానక్
D) గురు అర్జున్ సింగ్
జవాబు:
C) గురునానక్

22. భారతదేశ విశిష్ట సాంస్కృతిక లక్షణం.
A) ఏకత్వంలో భిన్నత్వం
B) భిన్నత్వంలో ఏకత్వం
C) A & B
D) ఏదీకాదు
జవాబు:
B) భిన్నత్వంలో ఏకత్వం

23. గోమఠేశ్వర్ ఆలయం (బాహుబలి) ఈ రాష్ట్రంలో కలదు.
A) తమిళనాడు
B) మధ్యప్రదేశ్
C) ఆంధ్రప్రదేశ్
D) కర్ణాటక
జవాబు:
D) కర్ణాటక

24. కొత్త కరెన్సీ నోట్లపై ఇన్ని భారతీయ భాషలు ముద్రించబడి ఉన్నాయి.
A) 14
B) 15
C) 16
D) 12
జవాబు:
B) 15

25. బుద్ధుడు స్వర్గస్తుడైన ‘కుశినగర్’ ప్రాంతం ప్రస్తుతం ఈ రాష్ట్రంలో కలదు.
A) మధ్యప్రదేశ్
B) మహారాష్ట్ర
C) ఉత్తరప్రదేశ్
D) బీహార్
జవాబు:
C) ఉత్తరప్రదేశ్

II. ఖాళీలను పూరించుట

కింది ఖాళీలను పూరింపుము

1. భారతీయ సంస్కృతి దాదాపు ………. సం||రాల పూర్వమే ప్రారంభమైనది.
2. ……… ఒక ప్రసార మాధ్యమం.
3. భాష మరియు …….. ల మధ్య సన్నిహిత సంబంధం ఉంది.
4. మనం చదవడానికి, రాయడానికి …………………. ఉపయోగిపడుతుంది.
5. ఆర్యభట్ట …………. అనే పుస్తకం రాశారు.
6. శస్త్ర చికిత్సలపై రాయబడిన గ్రంథమే …………
7. కొత్త కరెన్సీ నోట్లపై ………. భారతీయ భాషలలో ముద్రించారు.
8. మళయాళం భాషను ……… రాష్ట్రంలో ప్రధాన భాషగా ఉంది.
9. ‘హిందూ’ అనే పదం ……….. అనే పదం నుండి వచ్చింది.
10. సనాతన ధర్మం అని ……….. మత జీవనాన్ని పిలుస్తారు.
11. జైనమతం యొక్క ప్రధాన లక్ష్యం ………. సాధించటం.
12. 24వ తీర్థంకరుడు ………..
13. జైనుల ఆధ్యాత్మిక గురువులను ……… అంటారు.
14. త్రిరత్నాలు ……… మతానికి చెందినవి.
15. బుద్ధుడు ………. వృక్షం క్రింద జ్ఞానోదయం అయింది.
16. బుద్దుడు స్వర్గస్తుడైన ప్రాంతం ………………
17. బౌద్ధమతం …….. సిద్ధాంతంపై ఆధారపడి ఉంది.
18. ప్రసిద్ధ రోమన్ కాథలిక్ చర్చి ……… నగరంలో కలదు.
19. ……….. ను ప్రవక్త లేదా అల్లా యొక్క దూతగా భావిస్తారు.
20. మక్కా మసీదు ……… దేశంలో కలదు.
21. సిక్కు అనే పదానికి ……….. అని అర్థం.
22. స్వర్ణదేవాలయం ………. నగరంలో కలదు.
23. అష్టాంగ మార్గం ………. మతస్తులు మోక్ష మార్గాలు.
24. సిక్కుమతంలో మొత్తం ………… మంది గురువులు కలరు.
జవాబు:

  1. ఐదువేల
  2. భాష
  3. సంస్కృతం
  4. లిపి
  5. ఆర్యభట్టీయం
  6. సుశ్రుత సంహిత
  7. 15
  8. కేరళ
  9. సింధు
  10. హిందూ
  11. మోక్షం
  12. వర్గమాన మహావీరుడు
  13. తీర్థంకరులు
  14. జైన
  15. బోది
  16. కుశినగర్
  17. అహింసా
  18. వాటికన్
  19. మహ్మద్
  20. సౌదీ అరేబియా
  21. విద్యార్థి లేదా శిష్యుడు
  22. అమృతసర్
  23. బౌద్ధ
  24. 10

III. జతపరుచుట

కింది వానిని జతపరుచుము.
1.

Group – A Group – B
i) గ్రంథ సాహిబ్ a) జైనమతం
ii) ఖురాన్ b) బౌద్ధమతం
iii) బైబిల్ c) క్రైస్తవ మతం
iv) త్రిపీఠికలు d) ఇస్లాం మతం
v) అంగాలు e) సిక్కు మతం

జవాబు:

Group – A Group – B
i) గ్రంథ సాహిబ్ e) సిక్కు మతం
ii) ఖురాన్ d) ఇస్లాం మతం
iii) బైబిల్ c) క్రైస్తవ మతం
iv) త్రిపీఠికలు b) బౌద్ధమతం
v) అంగాలు a) జైనమతం

2.

Group – A Group – B
i)  చరక సంహిత a) చరకుడు
ii) ఆర్యభట్టీయం b) ఆర్యభట్ట
iii) సుశ్రుత సంహిత c) సుశ్రుతుడు
iv) రామాయణం d) వాల్మీకి
v) మహాభారతం e) వ్యాసుడు

జవాబు:

Group – A Group – B
i)  చరక సంహిత a) చరకుడు
ii) ఆర్యభట్టీయం b) ఆర్యభట్ట
iii) సుశ్రుత సంహిత c) సుశ్రుతుడు
iv) రామాయణం d) వాల్మీకి
v) మహాభారతం e) వ్యాసుడు

3.

Group – A Group- B
భాషలు రాష్ట్రం
i)  కన్నడ a) కేరళ
ii) తమిళం b) ఒడిషా
iii) మళయాళం c) భారతదేశం
iv) ఒడియా d) కర్ణాటక
v) హిందీ e) తమిళనాడు

జవాబు:

Group – A Group- B
భాషలు రాష్ట్రం
i)  కన్నడ d) కర్ణాటక
ii) తమిళం e) తమిళనాడు
iii) మళయాళం a) కేరళ
iv) ఒడియా b) ఒడిషా
v) హిందీ c) భారతదేశం

4.

Group – A Group – B
క్షేత్రాలు మతం
i) వాటికన్ a) క్రైస్తవ మతం
ii) తిరుమల b) హిందూ మతం
iii) మక్కా c) ఇస్లాం మతం
iv) అమృత్ సర్ d) సిక్కిం మతం
v) శ్రావణ బెళగొళ e) జైన మతం

జవాబు:

Group – A Group – B
క్షేత్రాలు మతం
i) వాటికన్ a) క్రైస్తవ మతం
ii) తిరుమల b) హిందూ మతం
iii) మక్కా c) ఇస్లాం మతం
iv) అమృత్ సర్ d) సిక్కిం మతం
v) శ్రావణ బెళగొళ e) జైన మతం

5.

Group – A Group – B
i) హిందూ మతం a) స్థూపం
ii) క్రైస్తవ మతం b) గురుద్వారా
iii) ఇస్లాం మతం c) మసీదు
iv) సిక్కు మతం d)  చర్చీ
v) బౌద్ధ మతం e) దేవాలయం

జవాబు:

Group – A Group – B
i) హిందూ మతం e) దేవాలయం
ii) క్రైస్తవ మతం d)  చర్చీ
iii) ఇస్లాం మతం c) మసీదు
iv) సిక్కు మతం b) గురుద్వారా
v) బౌద్ధ మతం a) స్థూపం
Prepare for TET & DSC exams with free mock tests, study materials, and expert guidance at www.tetdsc.com. Ace your teaching career with quality resources!

జవాబు:
i) – c ii) – d iii) – b iv) – a

Prepare for TET & DSC exams with free mock tests, study materials, and expert guidance at www.tetdsc.com. Ace your teaching career with quality resources!

జవాబు:
i) – a ii) – b iii) – c iv) – d

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *