6th Class Social Bits 12th Lesson సమానత్వం వైపు

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

1. వైవిధ్యంనకు కారణం/లు.
A) భౌగోళిక ప్రాంతం
B) శీతోష్ణస్థితులు
C) కొత్త ప్రాంతాల్లో స్థిరపడటం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

2. ప్రపంచంలో ప్రధానంగా ఇన్ని మతాల ప్రాచుర్యంలో ఉండి ఆచరించబడుతున్నాయి.
A) 6
B) 8
C) 10
D) లెక్కలేనన్ని
జవాబు:
B) 8

3. డా|| బి.ఆర్. అంబేద్కర్ ఈ కులంలో జన్మించారు.
A) మెహర్స్
B) పెరియార్స్
C) దాసులు
D) పల్లారులు
జవాబు:
A) మెహర్స్

4. అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన సంఘ సంస్కర్తలు
A) వెన్నెలకంటి రఘురామయ్య
B) పొట్టి శ్రీరాములు
C) సరస్వతి గోరా
D) పై అందరూ
జవాబు:
D) పై అందరూ

5. భారతదేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయిని
A) సరస్వతి గోరా
B) రమాబాయి సరస్వతి
C) సావిత్రిబాయి ఫూలే
D) దువ్వూరి సుబ్బమ్మ
జవాబు:
C) సావిత్రిబాయి ఫూలే

6. ఈమెను “భారత స్త్రీ వాద మాతా మహి” అని కీర్తిస్తారు.
A) దువ్వూరి సుబ్బమ్మ
B) పొణక కనకమ్మ
C) సరస్వతి గోరా
D) సావిత్రిబాయి ఫూలే
జవాబు:
D) సావిత్రిబాయి ఫూలే

7. సావిత్రిబాయి ఫూలే తన భర్తతో కలిసి ఇక్కడ భారతదేశంలోనే ప్రథమ బాలికల పాఠశాలను స్థాపించారు.
A) ముంబయి
B) పూనె
C) అహ్మద్ నగర్
D) నాగపూర్
జవాబు:
B) పూనె

8. గాంధీజీ జాతి వివక్షతను ఈ దేశంలో ఎదుర్కొని, దానిని ప్రతిఘటించారు.
A) దక్షిణాఫ్రికా
B) దక్షిణ అమెరికా
C) భారతదేశం
D) బ్రిటన్
జవాబు:
A) దక్షిణాఫ్రికా

9. ఒక వ్యక్తి జన్మస్థలం ఆధారంగా చూపే వివక్షత.
A) జాతి వివక్షత
B) కుల వివక్షత
C) ప్రాంతీయ వివక్షత
D) లింగ వివక్షత
జవాబు:
C) ప్రాంతీయ వివక్షత

10. PWD చట్టం – 2016 ప్రకారం ఎవరిని దివ్యాంగులుగా పరిగణిస్తారు?
A) నడవలేని వారిని
B) చూడలేని వారిని
C) వినలేని, మాట్లడలేనివారిని
D) పై అందరిని
జవాబు:
D) పై అందరిని

11. అసమానతలు, వివక్షతలకు మూల కారణం.
A) వృత్తులు
B) అవిద్య
C) సాంప్రదాయాలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

12. భారతదేశపు తొలి మహిళా వైద్యురాలు.
A) డా|| సావిత్రిబాయి పూలే
B) డా|| ఆనందీ బాయి జోషి
C) డా|| సరస్వతీ గోరా
D) ఎవరూ కాదు
జవాబు:
B) డా|| ఆనందీ బాయి జోషి

13. సతీ సహగమనం ను ఈ సం||లో నిషేధించినారు.
A) 1829
B) 1929
C) 1892
D) 1992
జవాబు:
A) 1829

14. నెల్సన్ మండేలాను ఇలా ‘పిలుస్తారు.
A) అమెరికా గాంధీ
B) సరిహద్దు గాంధీ
C) దక్షిణాఫ్రికా గాంధీ
D) నైజీరియా గాంధీ
జవాబు:
C) దక్షిణాఫ్రికా గాంధీ

15. నెల్సన్ మండేలా ఈ సం||లో భారతరత్న అవార్డును స్వీకరించారు.
A) 1980
B) 1990
C) 1991
D) 1992
జవాబు:
B) 1990

16. “చట్టం ముందు అందరూ సమానం” అని తెలిపే రాజ్యాంగ ఆర్టికల్ (నిబంధన)
A) 14వ
B) 15వ
C) 16వ
D) 17వ
జవాబు:
A) 14వ

17. మహిళలు అత్యవసర సమయంలో చేయవలసిన నంబరు కానిది.
A) 112
B) 181
C) 1091
D) 1098
జవాబు:
D) 1098

18. అంటరానితనంను (పాటించడం) నిషేధించిన రాజ్యాంగ నిబంధన.
A) 15వ
B) 16వ
C) 17వ
D) 21వ
జవాబు:
C) 17వ

19. 21 (A) వ నిబంధన హక్కు గురించి తెల్పుతుంది.
A) వివక్షత నిషేధం
B) విద్యాహక్కు
C) ఆరోగ్య హక్కు
D) పనిహక్కు
జవాబు:
B) విద్యాహక్కు

20. ప్రభుత్వం సమానత్వాన్ని సాధించడానికి అనుసరించే మార్గం
A) చట్టాలు
B) సంక్షేమ కార్యక్రమాలు
C) A & B
D) ఏదీకాదు
జవాబు:
C) A & B

21. డా|| ఏ.పి.జె. అబ్దుల్ కలాం భారతదేశానికి ఎన్నవ అధ్యక్షుడిగా ఉన్నారు.
A) 10వ
B) 11వ
C) 12వ
D) 13వ
జవాబు:
B) 11వ

22. ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ అన్న పుస్తకాన్ని రాసినవారు
A) నెల్సన్ మండేలా
B) డా|| ఏ.పి.జె. అబ్దుల్ కలాం
C) మరియప్పన్ తంగవేలు
D) డా|| బి.ఆర్. అంబేద్కర్
జవాబు:
B) డా|| ఏ.పి.జె. అబ్దుల్ కలాం

23. భారతీయ పారా ఒలింపిక్ హైజంప్ క్రీడాకారుడు మరియప్పన్ తంగవేలు 2016లో ఈ దేశంలో జరిగిన పారా ఒలింపిక్స్ లో బంగారు పతకాన్ని సాధించారు?
A) అమెరికా
B) బ్రెజిల్
C) దక్షిణాఫ్రికా
D) చైనా
జవాబు:
D) చైనా

24. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ చేతుల మీదుగా ‘సింధుతాయి’ ఈ పురస్కారాన్ని అందుకున్నది.
A) నారీశక్తి
B) నారీలోకశక్తి
C) వీరనారీ
D) నారీరత్న
జవాబు:
A) నారీశక్తి

25. 9 ఈ చిహ్నం ఏ సమానత్వాన్ని సూచిస్తుంది?
A) ప్రాంతీయ సమానత్వం
B) మత సమానత్వం
C) కుల సమానత్వం
D) లింగ సమానత్వం
జవాబు:
D) లింగ సమానత్వం

II. ఖాళీలను పూరించుట

కింది ఖాళీలను పూరింపుము.

1. భారతదేశం ………… లతో కూడిన దేశం.
2. మనం వ్యక్తులనుగానీ, సంఘాన్ని గానీ ఒక కోణంలో మాత్రమే చూస్తే అది ……… అవుతుంది.
3. సావిత్రిబాయి ఫూలే ……….. రాష్ట్రానికి చెందిన సంఘ సంస్కర్త.
4. చర్మపు రంగు ఆధారంగా చూపే వివక్షత ………….
5. ……….. సం||లో అనందీబాయి జోషి వైద్యురాలిగా పట్టా అందుకున్నారు.
6. నెల్సన్ మండేలా ………. సంవత్సరంలో 27 సం|రాలు జైలు జీవితం తర్వాత విడుదలయ్యారు.
7. ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పించే నిబంధన …………..
8. ……….. వ నిబంధన రాజ్యం ఏ ఒక్క పౌరుని పట్ల వివక్షత చూపరాదు.
9. దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షతకు వ్యతిరేకంగా …………. పోరాడినాడు.
10. దళితులను ప్రభుత్వం ………. కులాలుగా పరిగణిస్తుంది.
11. భారతదేశ ప్రథమ మహిళా ప్రధానమంత్రి ………….
12. భారతదేశ ప్రథమ మహిళా రాష్ట్రపతి ……………
13. సమాజంలో స్త్రీ, పురుషులు పాటిస్తున్న సామాజిక సంప్రదాయాల గురించి ……….. వ శతాబ్దం నుండి చర్చలు జరుగుతున్నాయి.
14.

Prepare for TET & DSC exams with free mock tests, study materials, and expert guidance at www.tetdsc.com. Ace your teaching career with quality resources!

ఈ చిత్రంలో వ్యక్తి పేరు …………

15. మహిళలను (విద్యార్థినిలను) ఈవ్ టీజింగ్ చేస్తే …………. నంబరుకు డయల్ చేయాలి.
జవాబు:

  1. వైవిధ్యం
  2. మూస ధోరణి
  3. మహారాష్ట్ర
  4. జాతి వివక్షత
  5. 1886
  6. 1990
  7. 16వ నిబంధన
  8. 15 (1)
  9. నెల్సన్ మండేలా
  10. షెడ్యూల్డ్
  11. శ్రీమతి ఇందిరాగాంధీ
  12. శ్రీమతి ప్రతిభాపాటిల్
  13. 19
  14. డా||బి.ఆర్. అంబేద్కర్
  15. 1091

III. జతపరుచుట

కింది వానిని జతపరుచుము.

1.

Group – A Group- B
i) ఇంటిపనులు a) లింగ వివక్షత
ii) జన్మస్థలం b) ప్రాంతీయ వివక్షత
iii) చర్మపు రంగు c) వర్ణ (జాతి) వివక్షత
iv) వినికిడి లోపం d) దివ్యాంగులపట్ల వివక్షత
v) పుట్టిన కుటుంబం e) కుల వివక్షత

జవాబు:

Group – A Group- B
i) ఇంటిపనులు a) లింగ వివక్షత
ii) జన్మస్థలం b) ప్రాంతీయ వివక్షత
iii) చర్మపు రంగు c) వర్ణ (జాతి) వివక్షత
iv) వినికిడి లోపం d) దివ్యాంగులపట్ల వివక్షత
v) పుట్టిన కుటుంబం e) కుల వివక్షత

2.

Group – A Group – B
i) ప్రథమ మహిళా ఉపాధ్యాయిని a) రాజా రామ్మోహన్ రాయ్
ii) ప్రథమ మహిళా వైద్యురాలు b) డా|| బి.ఆర్.అంబేద్కర్
iii) నారీశక్తి అవార్డు గ్రహీత c)  సింధుతాయి
iv) మెహర్‌లో ఇంగ్లాండు వెళ్ళిన ప్రథములు d) ఆనందీబాయి జోషి
v) సతీసహగమనం e) సావిత్రిబాయి ఫూలే

జవాబు:

Group – A Group – B
i) ప్రథమ మహిళా ఉపాధ్యాయిని e) సావిత్రిబాయి ఫూలే
ii) ప్రథమ మహిళా వైద్యురాలు d) ఆనందీబాయి జోషి
iii) నారీశక్తి అవార్డు గ్రహీత c)  సింధుతాయి
iv) మెహర్‌లో ఇంగ్లాండు వెళ్ళిన ప్రథములు b) డా|| బి.ఆర్.అంబేద్కర్
v) సతీసహగమనం a) రాజా రామ్మోహన్ రాయ్
Prepare for TET & DSC exams with free mock tests, study materials, and expert guidance at www.tetdsc.com. Ace your teaching career with quality resources!

జవాబు:
i) – e, ii) – a, iii) – c, iv) – b, v) – d.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *