1. ఉత్తర, దక్షిణ ధృవాలను కలుపుతూ భూమి మధ్య గుండా గీయబడిన ఊహారేఖ. A) అక్షాంశం B) రేఖాంశం C) భూమధ్యరేఖ D) అక్షం జవాబు: D) అక్షం
2. భూమిని రెండు సమాన అర్ధభాగాలుగా చేయురేఖ. A) భూమధ్యరేఖ B) కర్కటరేఖ C)మకరరేఖ D) అక్షం జవాబు: A) భూమధ్యరేఖ
3. మొత్తం రేఖాంశాలు. A) 360 B) 180 C) 90 D) 270 జవాబు: A) 360
4. ఏ అర్ధగోళంలో నీరు ఎక్కువగా ఉంది. A) ఉత్తరార్ధగోళం B) దక్షిణార్ధగోళం C) పశ్చిమార్ధగోళం D) పూర్వార్ధగోళం జవాబు: B) దక్షిణార్ధగోళం
5. అక్షాంశాలలో పొడవైన అక్షాంశం A) కర్కటరేఖ B) మకర రేఖ C) భూమధ్య రేఖ D) ఆర్కిటిక్ వలయం జవాబు: C) భూమధ్య రేఖ
6. భూమధ్య రేఖ నుండి ఉత్తర ధృవం వరకు గల అర్ధగోళం A) ఉత్తరార్ధగోళం B) దక్షిణార్ధగోళం C) పశ్చిమార్ధగోళం D) పూర్వార్ధగోళం జవాబు: A) ఉత్తరార్ధగోళం
7. 0° రేఖాంశాన్ని ఇలా పిలుస్తారు. A) భూమధ్య రేఖ B) గ్రీనిచ్ రేఖ C) అంతర్జాతీయ రేఖ D) పైవన్నీ జవాబు: B) గ్రీనిచ్ రేఖ
8. అంతర్జాతీయ దినరేఖ అని దేనినంటారు? A) 0° రేఖాంశం B) 0° అక్షాంశం C) 180° రేఖాంశం D) 90° రేఖాంశం జవాబు: C) 180° రేఖాంశం
9. గ్లోబల్ అనే పదం ‘గ్లోబస్’ అనే ఈ భాష పదం నుండి వచ్చింది. A) లాటిన్ B) గ్రీకు C) రోమన్ D) ఫ్రెంచి జవాబు: A) లాటిన్
10. అక్షాంశం (లాటిట్యూడ్) అనే పదం ‘లాటిట్యూడో’ అను లాటిన్ పదం నుండి వచ్చినది. దీని అర్థం ఏమిటి? A) పొడవు B) వెడల్పు C) ఎత్తు D) లావు జవాబు: B) వెడల్పు
11. 0° రేఖాంశాన్ని ఇలా పిలుస్తారు. A) ముఖ్య రేఖాంశం B) ప్రామాణిక రేఖాంశం C) గ్రీనిచ్ రేఖాంశం D) పైవన్నీ జవాబు: D) పైవన్నీ
12. ‘లాంగిట్యూడో అనే లాటిన్ పదంనకు అర్థం A) పొడవు B) వెడల్పు C)మందం D) పరిధి జవాబు: A) పొడవు
13. భూమి యొక్క వాతావరణ విభజన వీని సహాయంతో అధ్యయనం చేయవచ్చు. A) అక్షాంశాలు B) రేఖాంశాలు C) A & B D) ఏదీకాదు జవాబు: A) అక్షాంశాలు
14. రాత్రి పగలు ఏర్పడటానికి కారణమైన భూ చలనం. A) భూభ్రమణం B) భూపరిభ్రమణం C) రెండూ D) ఏదీకాదు జవాబు: A) భూభ్రమణం
15. ఋతువులు ఏర్పడటానికి కారణమైన భూ చలనం A) భూభ్రమణం B) భూపరిభ్రమణం C) రెండూ D) ఏదీకాదు జవాబు: B) భూపరిభ్రమణం
16. భూ కక్ష్య పొడవు A) 965 మి||కి.మీ. B) 1610 మి||కి.మీ. C) 695 మి||కి.మీ. D) 569 మి॥కి.మీ. జవాబు: A) 965 మి||కి.మీ.
17. సూర్యుని కిరణాలు కర్కటరేఖపై నిట్టనిలువుగా పడే A) జూన్ 21 B) డిసెంబర్ 22 C) మార్చి 21 D) సెప్టెంబర్ 23 జవాబు: A) జూన్ 21
18. సూర్యుని కిరణాలు మకరరేఖపై నిట్టనిలువుగా పడే రోజు. A) జూన్ 21 B) డిసెంబర్ 22 C) మార్చి 21 D) సెప్టెంబర్ 23 జవాబు: B) డిసెంబర్ 22
19. లీపు సంవత్సరంలో ఎన్ని రోజులుంటాయి? A) 365 B) 365 C) 366 D) 364 జవాబు: C) 366
20. భూమికి మరియు సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే ఈ గ్రహణం సంభవిస్తుంది. A) చంద్రగ్రహణం B) సూర్యగ్రహణం C) రెండూ D) ఏదీకాదు జవాబు: B) సూర్యగ్రహణం
21. భూమిమీద ఉన్న సమస్త జీవరాశి మనుగడకు మూలం. A) చంద్రుడు B) సూర్యుడు C) నక్షత్రరాశులు D) పైవన్నీ జవాబు: B) సూర్యుడు
22. క్రిస్టమస్ వేడుకలు ఆస్ట్రేలియాలో ఏ కాలంలో జరుపుకుంటారు? A) వర్షాకాలం B) శీతాకాలం C) వేసవికాలం D) ఏదీకాదు జవాబు: C) వేసవికాలం
23. క్రింది పటంలో ‘0’ డిగ్రీ రేఖాంశమునకు ఆవలివైపు ఉన్న రేఖాంశం ఏది? A) 180 డిగ్రీల రేఖాంశం B) ‘0’ డిగ్రీ రేఖాంశం C) 150 డిగ్రీల తూర్పు రేఖాంశం D) 150 డిగ్రీల పశ్చిమ రేఖాంశం జవాబు: A) 180 డిగ్రీల రేఖాంశం
II. ఖాళీలను పూరించుట
1. భూమి గుండ్రంగా ఉందని ………….. శతాబంలో నావికులు ధృవీకరించారు. 2. పురాతన గోబును 1492లో …………… రూపొందించాడు. 3. ఆధునిక గ్లోబును 1570లో ………….. రూపొందించాడు. 4. భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న అర్ధభాగాన్ని ………….. అంటారు. 5. ఉత్తర ధృవం, ఆర్కిటిక్ వలయం, కర్కటరేఖలు ………… గోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు. 6. దక్షిణ ధృవం, అంటార్కిటిక్ వలయం, మకర రేఖలు …………. 7. అతిపెద్ద అక్షాంశం …………. 8. మధ్యాహ్నా రేఖలు అని ……… ను అంటారు. 9. 180° తూర్పు, పశ్చిమ రేఖాంశం …………. 10. భూమి తన అక్షంపై ………. నుండి ……… వైపుకు తిరుగుతుంది. 11. భూమి తన అక్షంపై ……….. కి.మీ||ల వేగంతో తిరుగుతుంది. 12. భూమి ఒకసారి తనచుట్టూ తిరిగి రావడానికి, పట్టుకాలం …………….. 13. భూమి యొక్క కక్ష్య ……… ఆకారంలో ఉంటుంది. 14. లీపు సంవత్సరంలో ………. నెలకు అదనపు రోజు కలుపబడుతుంది. 15. రాత్రి, పగలు సమానంగా ఉండే రోజులను ………. అంటారు. 16. చంద్రుడు, భూమి యొక్క నీడలోకి వెళ్ళినప్పుడు ………. గ్రహణం ఏర్పడుతుంది. జవాబు:
1. సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులన్నింటినీ ఇలా అంటారు. A) నక్షత్రాలు B) ఉల్కలు C) నక్షత్ర రాశులు D) ఖగోళ వస్తువులు జవాబు: D) ఖగోళ వస్తువులు
2. సొంతంగా, వేడి, కాంతిని కలిగి ఉండే ఖగోళ వస్తువులు. A) నక్షత్రం B) గ్రహం C) ఉల్క D) పైవన్నీ జవాబు: A) నక్షత్రం
3. సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండని ఖగోళ వస్తువులు. A)గ్రహాలు B) ఉపగ్రహాలు C) ఉల్కలు, తోక చుక్కలు D) పైవన్నీ జవాబు: D) పైవన్నీ
4. ఏడు నక్షత్రాల సమూహాన్ని ఇలా అంటారు. A) ఉర్సామేజర్ B) బిగ్ బేర్ C) సప్తర్షి D) ధృవ నక్షత్రం జవాబు: C) సప్తర్షి
5. ఉత్తర దిక్కులు స్థిరంగా ఉండే ఉత్తర నక్షత్రం A) ధృవ నక్షత్రం B) సప్తర్షి C) ఉర్సామేజర్ D) బిగ్ బేర్ జవాబు: A) ధృవ నక్షత్రం
6. భూమి ఎక్కడి నుండి వేడి, కాంతిని పొందుతుంది? A) చంద్రుని నుండి B) సూర్యుని నుండి C) స్వతహాగా కల్గి ఉంది D) తోక చుక్కల నుండి జవాబు: B) సూర్యుని నుండి
7. సౌర కుటుంబంలోని సభ్యుడు కానిది. A) సూర్యుడు B) ఎనిమిది గ్రహాలు, ఉపగ్రహాలు C) ఉల్కలు, గ్రహశకలాలు D) పాలపుంత జవాబు: D) పాలపుంత
8. సూర్యుని ఉపరితలంపై దాదాపు ఇన్ని డిగ్రీలసెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. A) 1,00,000°C B) 6000°C C) 16000°C D) 26,000°C జవాబు: B) 6000°C
9. భూమి కంటె సూర్యుడు ఎన్ని రెట్లు పెద్ద A) 13 లక్షలు B)3 లక్షలు C) 23 లక్షలు D) 15 కోట్లు జవాబు: A) 13 లక్షలు
10. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే స్థిర మార్గాన్ని ఇలా పిలుస్తారు. A) సౌర కుటుంబం B) కక్ష్య C) గెలాక్సీ D) పరిభ్రమణం జవాబు: B) కక్ష్య
11. క్రింది వానిలో అంతర గ్రహం కానిది. A) బుధుడు B) శుక్రుడు C) భూమిం D) గురుడు జవాబు: D) గురుడు
12. క్రింది వానిలో బాహ్యగ్రహం కానిది. A) శని B) ఇంద్రుడు C) అంగారకుడు D)వరుణుడు జవాబు: C) అంగారకుడు
13. మనం నివసిస్తున్న భూమి సూర్యుని నుండి ఎన్నవది? పరిమాణంలో ఎన్నవది? వరుసగా A) 5, 3 B) 3, 5 C) 3, 4 D) 4, 3 జవాబు: B) 3, 5
14. జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన A) బుధుడు B) భూమి C) అంగారకుడు D) చంద్రుడు జవాబు: B) భూమి
15. సూర్యుని కాంతి భూమిని చేరుకోవడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? A) 8 ని||లు B) 18 ని||లు C) 28 ని॥లు D) 13 ని॥లు జవాబు: A) 8 ని||లు
16. వాతావరణంలో ఆక్సిజన్ శాతం A) 78% B) 21% C) 11% D) 12% జవాబు: B) 21%
17. ఉపగ్రహాలు లేని గ్రహాలు A) బుధుడు, శుక్రుడు B) బుధుడు, భూమి C) శుక్రుడు, భూమి D) బృహస్పతి, శని జవాబు: A) బుధుడు, శుక్రుడు
18. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? A) 365 రోజులు B) 24 గంటలు C) 27 రోజులు D) 14 రోజులు జవాబు: C) 27 రోజులు
19. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి A) రాకేష్ శర్మ B) కల్పనా చావ్లా C) నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ D) యురిగగారిన్ జవాబు: C) నీల్ ఆర్మ్ స్ట్రాంగ్
20. గ్రహశకలాలు ఈ రెండు గ్రహాల మధ్య ఉన్నాయి. A) అంగారకుడు, బృహస్పతి B) భూమి, అంగారకుడు C) బృహస్పతి, శని D) బుధుడు, శుక్రుడు జవాబు: A) అంగారకుడు, బృహస్పతి
21. హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది? A) 76 సంవత్సరాలు B) 78 సంవత్సరాలు C) 74 సంవత్సరాలు D) 72 సంవత్సరాలు జవాబు: A) 76 సంవత్సరాలు
22. భారతదేశంలో అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టు సంస్థ A) ISRO B) NASA C) SHAR D) పైవన్నీ జవాబు: A) ISRO
23. అత్యధికంగా ఉపగ్రహాలు కల్గి ఉన్న గ్రహం A) ఇంద్రుడు B) వరుణుడు C) శని D) బృహస్పతి జవాబు: D) బృహస్పతి
24. అత్యధిక పరిభ్రమణ కాలం కల్గిన గ్రహం A) బుధుడు B) ఇంద్రుడు C) వరుణుడు D) గురుడు జవాబు: C) వరుణుడు
25. అత్యల్ప భ్రమణ కాలం కల్గిన గ్రహం A) భూమి B) గురుడు C) శని D)వరుణుడు జవాబు: B) గురుడు
26. ఒకే భ్రమణ కాలం కల్గియున్న రెండు గ్రహాలు A) భూమి, అంగారకుడు B) అంగారకుడు, గురుడు C) బుధుడు, శుక్రుడు D) బుధుడు, భూమి జవాబు: A) భూమి, అంగారకుడు
II. ఖాళీలను పూరించుట కింది ఖాళీలను పూరింపుము.
1. మన సౌర కుటుంబంలో మొత్తం ……….. గ్రహాలు కలవు. 2. భూమికి కల ఏకైక సహజ ఉపగ్రహం ………… 3. భూమి నుండి సూర్యుని దూరం సుమారు … కి.మీ. 4. గ్రహాలలో పెద్ద గ్రహం ……….. 5. గ్రహాలలో చిన్న గ్రహం ……………… 6. నీలిగ్రహం ………… 7. వరుణ గ్రహం ……….. 8. కాంతి సెకనుకు …. కి.మీ॥ వేగంతో ప్రయాణిస్తుంది. 9. భూమిచుట్టూ విస్తరించి ఉన్న గాలిపొరను …….. 10. భూమిపై, నీటిలో, గాలిలో గల అన్ని రకాల జీవులను కలిపి ………. ఆవరణం అంటారు. , 11. చంద్రుని వ్యాపం, భూమి వ్యాసంలో………. వంతు మాత్రమే. 12. భూమి నుంచి చంద్రుడు దూరం, సుమారు ……… కి.మీ. 13. చంద్రునిపై మానవుడు అడుగిడిన రోజు …… 14. ISROని విస్తరింపుము …………… 15. SHARని విస్తరింపుము …………… 16. SDSC ని విస్తరింపుము ……………….. 17. MOM ని విస్తరింపుము ……….. అంటారు. 18. హేలి తోకచుక్కను మనం ……….. సంవత్సరంలో చూడవచ్చు. జవాబు:
కొవ్వులు అదే మొత్తంలోని కార్బోహైడ్రేట్స్ తో పోలిస్తే ఎక్కువ శక్తిని ఇస్తాయి .
కొవ్వులు సాధారణంగా నూనెల వలె జిడ్డుగా ఉంటాయి.
కొవ్వులు ఉన్న ఆహారాన్ని మనం కాగితంపై ఉంచినప్పుడు కాగితం అపారదర్శకంగా మారింది .
ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వారు పాఠశాలకు వెళ్లినప్పుడు రాక్తహీనత కలిగిన విద్యార్థులకు ఐరన్ టాబ్లెట్స్, దృష్టి సమస్య ఉన్న విద్యార్థులకు కళ్ళజోడు ను అందిస్తారు .
ఖనిజ లవణాలు మరియు విటమిన్లను రక్షక పోషకాలు అంటారు.
అర్హీనియస్ రసాయన శాస్త్రంలో చేసిన పరిశోధనకు గాను ఏ సంవత్సరం లో నోబెల్ బహుమతి లభించింది – 1903 .
పదార్ధాలను వాటి రుచి మరియు జారుడు స్వభావం ఆధారంగా ఆమ్లాలు ,క్షారాలు అని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు .
ఆమ్లం మరియు క్షారం కానీ పదార్ధాలను తటస్థ పదార్థాలు అంటారు .
స్వచ్చమైన నీరు ఒక తటస్థ పదార్ధం .
తటస్థ పదార్థాలకు ఉదాహరణలు — స్వేదన జలం , ఉప్పు ద్రావణం , చక్కెర ద్రావణం .
కొన్ని ఆమ్లాలు మరియు క్షారాలు చాలా ప్రమాదకరమైనవి మరియు క్షయం చేయు స్వభావం కలవి…ఇలాంటి వాటిని స్పర్శ లేదా రుచి ద్వారా పరీక్షించలేము ..ఉదాహరణ :హైద్రో క్లోరికామ్లం ,సల్ఫ్యూరిక్ ఆమ్లం ,నత్రికామ్లుం ,సోడియం హైడ్రాక్సెడ్, మెగ్నీషియం హైడ్రాక్సెడ్ , పొటాషియం హైడ్రాక్సెడ్.
ఆమ్లాలు, క్షారాలను గుర్తించడానికి సహాయపడే పరిసరాలలో లభించే స్టార్ధాలను సూచికలు అంటారు.
సూచికలలో ముక్యమైనవి:
1. సహజ సూచికలు
2. క్రుత్రిమ సూచికలు
3. ఘ్రాణ సూచికలు
4. సార్వత్రిక సూచికలు
సహజ సూచికలు :
ప్రకృతిలో సహజంగా లభించే పసుపు మరియు మందారం లను సహజ సూచికలు అంటారు .
సాధారణంగా ఎక్కువ గా ఉపయోగించే సూచిక — లిట్మస్
లిట్మస్ లను దేని నుండి గ్రహిస్తారు – లైకేన్
లిట్మస్ కాగితపు పట్టీలు రెండు రంగులలో ఉంటాయి ..1. ఎర్ర లిట్మస్ 2. నీలి లిట్మస్ ..
ఒక పసుపు కాగితం పట్టీని నిమ్మరసం వంటి ఆమ్లంలో ఉంచినప్పుడు ఆ పసుపు కాగిత పట్టీ పసుపు రంగులోనే ఉండిపోతుంది .
పసుపు రంగు కాగితం పట్టీని సబ్బు వంటి ద్రావణంలో ముంచినప్పుడు అది ఎరుపు గోధుమ రంగులోకి మారుతుంది .
పసుపు రంగు కాగితం పట్టీని సున్నపు ద్రావణంలో ముంచినప్పుడు అది ఎరుపు గోధుమ రంగులోకి మారుతుంది .
ఆమ్లాలు, క్షారాలను పరీక్షించడానికి పసుపు ముద్దను వినియోగించవచ్చు .
ఇండిగోఫెరా టింక్షోరియా పువ్వులను కూడా సూచికగా వినియోగించవచ్చు ,
ఇండిగోఫెరా టింక్టోరియా- నీలి చెట్టు ..
మందార సూచిక తయారు చేయడానికి మందార పూల రేకులను తీసుకుని గోరు వెచ్చని నీటిలో నీరు ఊదా రంగు లోకి మారేంత వరకు కలియబెట్టాలి .తర్వాత వడపోసి ద్రావణం తీసుకోవాలి .
మందార ద్రావణం నిమ్మరసం ,వెనిగర్ లలో గులాబీ రంగులోకి మారింది .
మందార ద్రావణం సబ్బు మరియు సున్నపు ద్రావణంలో ఆకుపచ్చగా మారింది .
మందారను ఆమ్ల.క్షార సూచికగా వినియోగించవచ్చు ..
కృత్రిమ సూచికలు :
కృత్రిమంగా తయారు చేసిన సూచికలను కృత్రిమ సూచికలు అంటారు…
ప్రయోగ శాలలో సాధారణంగా ఉపయోగించే సూచికలు — మిథైల్ ఆరెంజ్ , ఫీనాప్తలిన్
నీలి లిటస్ ను ఎర్పు రంగులోనికి మార్ప్దేవి – ఆమ్లాలు
ఎర్ర లిట్మస్ ను నీలి రంగులోనికి మార్లేవి -క్షారాలు
మిథైల్ ఆరెంజ్ ఆమ్లాలలో ఎరుపు రంగు లోనికి మారుతుంది .
మిథైల్ ఆరెంజ్ క్షారాలలో పసుపు రంగులోనికి మారుతుంది .
గాలికన్న హైడ్రోజన్ వాయువు తేలికైనది కావున హైడ్రోజన్ వాయువు ఉన్న బెలూన్ పైకి ఎగురుతుంది .
పచ్చళ్లను అల్యూమినియం,రాగి స్పీల్ మొదలైన పాత్రలలో నిల్వ చేయరు ఎందుకంటే పచ్చళ్లలో ఆమ్లాలు ఉంటాయి
పచ్చళ్లలో ఉన్న ఆమ్లాలు లోహపు పాత్రలతో చర్య జరిపి విష పదార్ధాలు ఏర్పరచి పచళ్లను పాడు చేస్తాయి .
అందువలన పచ్చళ్లను సాధారణంగా పింగానీ లేదా గాజు పాత్రలలో నిల్వ చేస్తారు .
ఎక్కువ కాలం పచ్చళ్లలో ఉంచిన చెంచా క్షయం చెందడం మనం గమనించవచ్చు .
సోడియం హైడ్రాక్సెడ్ వంటి క్షారాలు లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి కానీ అన్నీ క్షారాలు లోహాలతో చర్య జరపవు .
గుడ్డు పెంకు కాల్షియం కారొనేట్ తో నిర్మించబడి ఉంటుంది .
పరీక్షనాళికలో గుడ్డు పెంకు ముక్కలను తీసుకుని దానికి సజల హైడ్రో క్లోరికామ్లం కలిపితే ఒక వాయువు విడుదలవుతుంది ..ఈ వాయువు దగ్గర మండుతున్న పుల్లను ఉంచితే అది ఆరిపోతుంది .
మండుతున్న పుల్లను ఆర్వే వాయువు – కార్టన్ డై ఆక్సెడ్
ఆమ్లము కాల్షియం కార్టొనేట్ తో చర్య జరపడం వలన కార్డన్ డై ఆక్సైడ్ విడుదలవుతుంది .
ఆమ్లం మరియు క్షారాల మధ్య జరిగే చర్యను పమంటారు – తటస్టీకరణం
తటస్థీకరనం లో ఏర్పడేవి – నీరు, లవణాలు
సోడియం హైడ్రాక్సెడ్ ద్రావణమునకు ఫీనాస్తలిన్ సూచిక కలిపితే అది గులాబీ రంగులోకి మారును. ఆ ద్రావణానికి హైడ్రో క్లోరిక్ ఆమ్లాన్ని గులాబీ రంగు పోయేంతవరకు కలపండి ..ఇప్పుడు ఆ ద్రావణం ఆమ్లం కాదు క్షారం కాదు. తటస్టీకరించ బడింది
ఆమ్లం మరియు క్షారం మధ్య చర్య జరిగి లవణం మరియు నీరు ఏర్పడినాయి .
సోడియం క్లోరైడ్ అనునది లవణం .దీనిని సాధారణ ఉప్పు అంటారు .
ఈ ద్రావణానికి మరల హైడ్రో క్లోరిక్ ఆమ్లం కలిపితే అది ఆమ్లీకృతం అయ్యి గులాబీ రంగులోనికి మారుతుంది .
తటస్థీకరనం ఏర్పడిన లవణ స్వభావం అది ఏర్పడడానికి ఉపయోగించిన ఆమ్ల క్షార స్వభావం పై ఆధారపడి ఉంటుంది .
సోడియం క్లోరైడ్ (ఉప్పు ) ఒక తటస్త్స పదార్దం .
సోడియం కార్డొనేట్ ( వాషింగ్ సోడా ) ఒక క్షార పదార్థం .
అమ్మోనియం క్లోరైడ్ ఒక ఆమ్ల లవణం .
మన నిత్య జీవితంలో ఆమ్లాలు , క్షారాలు శుభ్ర పరిచే పదార్ధాలుగా , తటస్థీకరణ ద్రావణాలుగా , నిలువ చేయు పదార్థాలుగా, మరకలను తొలగించే పదార్ధాలుగా , మందులుగా ఉపయోగపడతాయి .
మన జీర్ణాశయం గాస్త్రిక్ ఆమ్లం విడుదల చేస్తుంది .
గాస్త్రిక్ ఆమ్లం అనగా – హైడ్రో క్లోరిక్ ఆమ్లం
గాస్త్రిక్ ఆమ్లం ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది .
గాస్త్రిక్ ఆమ్లం అధిక మొత్తంలో విడుదల అవ్వడం వలన అజీర్ణం లేదా ఎసిడిటీ ఏర్పడుతుంది .
అసిడిటీ వలన పొట్టలో మంట , నొప్పి కలుగుతాయి .
అసిడిటీ నుండి ఉపశమనం పొందడానికి మనకు సహాయ పడేవి- అంటాసిడ్ లు
అంటాసిడ్ లు క్షారాలను కలిగి ఉంటాయి
అంటాసిడ్ లు కలిగి ఉండే క్షారాలకు ఉదాహరణ : అల్యూమినియం హైడ్రాక్సైడ్ , మెగ్నీషియం హైడ్రాక్సెడ్.
మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని దేనిని పిలుస్తారు – మెగ్నీషియం హైడ్రాక్సెడ్
అంటాసిడ్ లలో ఉండే క్షారాలు గాస్త్రిక్ ఆమ్లాన్ని తటస్టీకరించి ఉపశమనాన్ని కలిగిస్తాయి .
చీమలు మరియు తేనె టీగలు కుట్టినప్పుడు వాటి నుండి విడుదలయ్యే ఆమ్లం – ఫార్మిక్ ఆమ్లం
ఫార్మిక్ ఆమ్లం చర్మం లోకి వెళ్ళడం వలన దురద, నొప్పి కలుగుతాయి .
చీమలు, తేనెటీగలు కుట్టిన ప్రదేశం లో బేకింగ్ సోడా ముద్దను రుద్ది ఉపశమనం పొందవచ్చు .
బేకింగ్ సోడాలో ఉన్న క్షార పదార్ధం ఫార్మిక్ ఆమ్లాన్ని తటస్టీకరిస్తుంది .
ఇటీవల కాలంలో పొలంలో కృత్రిమ ఎరువుల వాడకం ఎక్కువ అవ్వడం వలన పొల్లాల్లోని మట్టి PH హెచ్చు తగ్గుదలకు కారణం అవుతుంది.
మట్టి యొక్క ఆమ్లత్వం , క్షారత్వం ఏది ఎక్కువ అయినా మొక్కలు బాగా పెరగవు . ఇలాంటప్పుడు మట్టిని తటస్థ స్థితి లోనికి మార్చాలి
మట్టి ఆమ్లత్వం ఎక్కువ ఉంటే రైతులు పొడి సున్నం ,పొటాషియం హైడ్రాక్సెడ్ వంటి క్షార స్వభావం ఉన్న పదార్థాలు కలుపుతారు .
మట్టి కి క్షార స్వభావం అధికంగా ఉంటే కంపోస్ట్ (పశువుల ఎరువు ) వంటి సేంద్రీయ ఎరువులు కలుపుతారు .
10 గ్రాముల మట్టిని సేకరించి అరలీటర్ నీటిని కలిపి ద్రావణము తయారు చేసి ఆ ద్రావణాన్ని వడగట్టి వడ కట్టిన ద్రావణాన్ని యూనివర్సల్ సూచిక లేదా PH పేపర్ తో పరీక్షించాలి .
మట్టి స్వభావాన్ని బట్టి వివిధ రంగుల పూలను ఇచ్చే మొక్క — హైడ్రాంజియా
మట్టి PH 5.5 కన్నా తక్కువ ఉంటే హైడ్రాంజియా నీలం రంగు పువ్వులను ఇస్తుంది .
మట్టి PH 6.5 కన్నా ఎక్కువ ఉంటే హైడ్రాంజియా పింక్ రంగు పూలను ఇస్తుంది .
పూసే పూల రంగులను బట్టి హైడ్రాంజియా మొక్కల ద్వారా మట్టి స్వభావం తెలుసుకోవచ్చు .
ఆమ్ల స్వభావం కలిగిన వర్షాన్ని ఆమ్ల వర్షం అంటారు.
ఆమ్ల వర్షాలకు అతి పెద్ద కారణం – వాయు కాలుష్యం
ఆమ్ల వర్షం వలన భవనాలకు , తాజ్ మహల్ వంటి చారిత్రక కట్టడాలకు, మొక్కలకు, జంతువులకు హాని కలుగుతుంది .
ఇంధనాలైన బొగ్గు, పెట్రోలియం నూనెలు దహనం చెందడం వలన సల్ఫర్ డై ఆక్సైడ్ , నైట్రోజన్ డై ఆక్సైడ్ వాయువులు వర్షపు నీటి చుక్కలతో చర్య జరపడం వలన సల్ఫ్యూరిక్ ఆమ్లం , నత్రికామ్లం తయారవుతాయి .
ఆమ్ల వర్షంలో ప్రధానంగా ఉండే వాయువులు – సల్ఫ్యూరిక్ ఆమ్లం , నత్రికామ్లం
భారతదేశంలో అనాదిగా దంతదావనానికి ఉపయోగిస్తున్న మొక్కలు – వేప , మిస్వాక్ , గానుగ.
ఈ మొక్కలలో క్షార లవణాలు గల పదార్థాలు ఉన్నాయి . ఈ క్షారాలు నోటిలోని బాక్టీరియా విడుదలచేసే ఆమ్లాలను తటస్థీకరిస్తాయి .
ఈ మొక్కలు బ్యాక్టీరియా ,ఫంగస్ లను హరించడమే కాక నొప్పి నివారణలకు కూడా పనిచేస్తాయి .
ఆమ్లం ఉపయోగం
వెనిగర్ (ఆసిటిక్ ఆమ్లం) –ఆహార పదార్థాల తయారీ , నిల్వ
సిట్రిక్ ఆమ్లం –ఆహార పదార్థాల నిల్వ , శీతల పానీయాలు
నత్రికామ్లం మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లం –రసాయన ఎరువులు ,రంగులు ,అద్దకాలు
సల్ఫ్యూరిక్ ఆమ్లం – వాహనాల బ్యాటరీలు
టానిక్ ఆమ్లం –సిరా తయారీ మరియు తోలు పరిశ్రమ
క్షారాలుఉపయోగాలు
కాల్షియం హైడ్రాక్సైడ్– నేల లోని క్షారతను తటస్థీకరిస్తుంది ,గోడల సున్నము
మెగ్నీషియం హైడ్రాక్సెడ్ –అంటాసిడ్ మరియు విరోచనకారి
ఓలేటి పార్వతీశం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించారు.
పరివర్తన పాఠ్యాంశంలో అబ్బాయి పేరు – రాము
రాముకు ఆటలంటే ఇష్టం . బద్దకం ఎక్కువ . చదువంటే శ్రద్ద తక్కువ
బాబూ రాము చుట్టు ప్రక్కల పిల్లలు అందరూ బడికి వెల్లుతున్నారు. నువ్వుకుడా త్వరగా తయారయ్యి బడికి వెళ్ళు అని అన్నది – రాము వాళ్ళ అమ్మ
రాము బడికి వెళ్లకుండా మామిడి తోటలోకి వెళ్ళాడు.
రాము మొదట కాకిని ఆడుకుందామా అని అడిగాడు.
రానున్నది వానాకాలం . నాకు గూడు లేదు. పుల్లలు తెచ్చుకుని గూడు కట్టుకుంటున్నాను అని కాకి ఎగిరిపోయింది.
కాకి తరువాత రాము తేనె టీగలను ఆడుకుందామా అని అడిగాడు
నాకు అంత తీరిక లేదు బాబు. పూల నుండి తేనెను సేకరిస్తున్నాను. పూలు తొందరగా వాడి పోతాయి . నాకు చాలా పని ఉంది అంది – తేనెటీగ .
తేనెటీగ తరువాత రాము చీమల వద్దకు వెళ్ళి ఆడుకుందామా అని అడిగాడు.
బాబూ ఇది నేను గింజలు సేకరించుకునేకాలం. ఇప్పుడు గింజలు సేకరించుకోకపోతే వానాకాలంలో ఏమితింటాం . ఇప్పుడు కష్టపడి గింజలు సేకరించుకుంటే అప్పుడు సుఖంగా ఉండవచ్చు. అంది – చీమ
రాములో పరివర్తన వచ్చి బడికి వెళ్లిపోయాడు.
పదాలు — అర్థాలు
పరివర్తన = మార్పు
చిందరవందర = క్రమ పద్దతిలో లేకపోవడం
ఆహ్లాదం = సంతోషం
చిన్నబుచ్చుకును = నిరాశపడు
క్రాకిమాటలు విని రాము చిన్నబుచ్లుకున్నాడు.
తేనెటీగలు మాట విని రాము దిగులుపడ్డాడు.
కింది పదాలు చదివి జతపరచండి ?
గలగల (ఆ) (అ) వానచినుకులు
చకచ (ఉ) (ఆ) సెలయేరు
పకపక (ఈ) (ఇ) ఏడవడం
వలవల (ఇ) (ఈ) నవ్వడం
టపటప (అ) (ఉ) నడవడం
కింది పదాలు చదివి వేరుగా ఉన్నవాటి కింద గీత గియండి ?
1. కాకి, కోయిల, పాము, పిచ్చుక
2. బొద్దింక, చీమ, ఈగ, ఏనుగు
3. కుక్క, పిల్లి, దోమ, గేదె
4. గులాబీ, టమాట, బెండకాయ, పొట్లకాయ
“పడవ నడపవోయి” అనే ఈ మాసపు పాట ఎవరు రచించారు – వింజ మూరి శివరామారావు
వింజమూరి శివరామారావు జననం — 1908
మరణం — 1982
వింజమూరి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రపాలెం గ్రామంలో జన్మించారు.
వింజమూరి శివరామారావు కవి, రచయిత, ఆకాశవాణి కళాకారులు.
వింజమూరి శివరామారావు రచనలు — 1. గోర్కీ కథలు 2. కల్పివల్లి
ఉపాయం అనే కధ మహాభారతం అనే ఇతిహాసం నుండి గ్రహించబడింది
కౌరవులు, పాండవులు ఏ వంశానికి చెందిన వారు – భరతవంశం
కౌరవులు, పాండవులు బంతి ఆట ఆడుతున్నప్పుడు భీముడు బంతిని తన్నితే బంతి వెళ్ళి బావిలో పడింది.
దారిలో వెలుతున్న దోణా చార్యుడు బాణాల సహాయంతో బంతిని తీశారు.
దొణాచార్యుని ఉద్దేశించి “ మీ వంటి గొప్పవారు మా చిరంజీవులకు తారసపడడం మా పూర్వ జన్మ సుకృతం. ఈ పిల్లలు మా మనుమలు. వీరిని మీ శిష్యులుగా స్వీకరించి విలువిద్య నేర్పండి అన్నది ఎవరు — భీష్ముడు.
దొణుడు అంగీకరించగానే పరుగున వచ్చి దొణునికి పాదాభివందనం చేసింది – అర్జునుడు.
సత్యమహిమ
సత్యమహిమ పాఠ్యాంశ ప్రకీయ – గేయకథ
సత్యమహిమ పాఠ్యాంశ ఇతివృత్తం — నైతిక విలువలు పెంపోందించడం
సత్యమహిమ పాఠ్యాంశ రచయిత — అవధాని రమేష్
అవధాని రమేష్ శతాబ్దం – 20వ శాతాబ్దం
సత్యమహిమ అనే గేయ కథ ఎచట నుండి గ్రహించబడింది — గుజ్జనగూళ్లు
గుజ్జన గూళ్ళు అనునది ఎవరి రచన — అవధాని రమేష్
అవధాని రమేష్ ఆంధ్ర రాష్ట్రం లోని కర్నూలు జిల్లా అవుకు ఆగ్రహారంలో జన్మించారు.
అవధాని రమేష్ తల్లిదండులు — సావిత్రమ్మ, సుబ్రమణ్య శాస్త్రి
అవధాని రమేష్ గారి రచనలు — 1. కాసులపేరు
2.ప్రతీకారం
3.మూడు మంచి కథలు
పదాలు — అర్థాలు
మహిమ = గొప్పతనం
అకలంక = మచ్చలేని, చెడ్డగుణాలు, లేనట్టి
చరితుండు = చరిత్ర గలవాడు.
సత్యవ్రతండు = సత్యమును మాత్రమే మాట్లాడేవాడు
నిత్యంబు = ఎల్లప్పుడు
గతి = జీవితం నడిచేవిధానం
తెన్నులుచూసి = ఎదురు చూసి
మోము = ముఖం
తత్తరం = గాబరా
ఆర్తి = దుఃఖం
కని = చూసి
దీనత = దారిద్ర్యం
మిరు మిట్లు = మెరుగులు
తిలకించి = చూసి
మది = మనస్సు
మొగంబు = ముఖం
మిసిమి = నూతనకాంతి
వన్నె = అందం, రంగు
చెన్ను = అందం
కింది ఆధారాలతో కొత్త పదాన్ని కనుక్కోండి
క్షీరాన్నం = పాయసం
ఒక శరీరభాగం = పాదము
ఒక పక్షి = పావురము
పుణ్యము కానిది = పాపము
రాయి = పొషాణము
పక్క భాగం = పార్వ్వము
బెల్లంతో చేసేది = పాయసం
కియా పదాలు :- పనులు జరగడాన్ని తెలియ చేయు పదాలను క్రియా పదాలు అంటారు
Ex:- వెళ్తారు, కోశారు, తెచ్చారు, ఇచ్చారు.
కింది వాక్యాలలో కియా పదాలు గుర్తించి గీత గియండి.
1. మానాన్న బొమ్మలు కొన్నాడు.
2. అత్త ఉత్తరు రాసింది.
3. ప్రవల్లిక నాట్యం చేసింది
4. తరుణ్ చిత్రం గీశాడు.
5. పిల్లలందరూ ఆటలు ఆడారు
6. మురళి పాటలు పాడాడు.
కన్నడ గేయం అని ఇవ్వబడిన ఈ మాసపు గేయం ఎచట నుండి గ్రహించబడింది – NCERT పాఠ్యపుస్తకం
ఏ కాలుది నేరం ? అని ఇవ్వబడిన ఈ మాసపు కథ ఎచట నుండి గ్రహించారు – మర్యాద రామన్న కథలు
మర్యాద రామన్న వద్దకు నలుగురు అన్నదమ్ములొచ్చారు.
పెద్దవారు ముగ్గురు ఫిర్యాదులు. చిన్నవాడు ముద్దాయి.
పెద్దవాడు వారు చేస్తున్న దూది వ్యాపారం గురించి రామన్నకు తెలిపాడు.
నలుగురు అన్నదమ్ములు దూది కొట్టంలో ఎలుకల బాధ తప్పడం కోసం ఒక పిల్లిని పెంచుకొనుచూ, పెల్లి 4 కాళ్ళను నలుగురు పంచుకుని ఎవరి కాలును వారు జాగ్రత్తగా చూసుకుంటున్నారు.
నాల్గవవాడు తీసుకున్న కాలుకి గాయం అవడం వలన నూనె గుడ్డలు చుట్టాడు.
పెల్లి దీపం వద్ద వెళ్ళడం వలన నూనెగుడ్డ అంటుకుని పిల్లి వలన దూది కోట్టెం తగలబడి పోయింది.
అందువలన 4వ వాడు ముద్దాయి అని పెద్దవాడు చెప్పాడు.
పిల్లి 3 కాళ్లతో పరిగెత్తి దూది కొట్టంలోకి వెళ్లింది కావున. ఆ ౩ కాళ్ళు పంచుకున్న మీ ముగ్గురే ముద్దాయిలు. మీరే 4వ వాడికి నష్టపరిహరం చెల్లించాలి అని మర్యాద రామన్న తీర్పు ఇచ్చాడు.
ముగ్గులో సంత్రాంతి
ముగ్గులో సంక్రాంతి పాఠ్యాంశ ప్రక్రియ – వ్యాసం
పాఠ్యాంశ ఇతివృత్తం – సంస్కృతి, సంప్రదాయాలు
ఈ పాఠంలో అనూష వాళ్ళ తమ్ముడు ఆదిత్య కలసి వాళ్ళ అత్తమ్మ ముగ్గుల పోటీలో వేసే ముగ్గును చూడడానికి వెళ్లారు.
అత్తమ్మను ముగ్గుల పోటీ వద్ద చూసి అదిగో అత్తమ్మ అన్నాడు – ఆదిత్య.
అత్తమ్మ ఒకే ముగ్గులో భోగిమంట, గంగిరెద్దులు, గాలిపటాలు భలేగా వేశావే అంది అనూష.
భోగిరాజు సాయంత్రం రేగుపళ్లు, శెనగలు, చెరకుముక్కలు, చిల్లర డబ్బులు, బంతిపూ ల రేకులు కలిపి భోగిపళ్లు పోస్తారు.
సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించడాన్ని ధనూస్వక్రమనం అంటారు. దీనిని ధనుర్మాసం అని కూడా అంటారు.
పశువులను పూజించే పండుగ – కనుమ
దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి ప్రయాణ సూచికగా రథంలో సూర్యుడ్ని నిలిపి రధం ముగ్గువేస్తారు.
సంక్రాంతి పండుగరోజు అనేక పందాలుతో పాటు బొమ్మల కొలువు పెడతారు.
పదాలు — అర్భాలు
పద్మం = తామరపువ్వు
ధనస్సు = విల్లు
రాశి = నక్షత్రాల గుంపు
కలశం = చిన్నకుండ లేదా చెంబు
ఆయనం = గమనం
ముస్లింలు జరుపుకునే పండగలలో పవిత్ర పండగ — రంజాన్
దీనిని ఈద్ అని, ఈద్ ఉల్ ఫితర్ అంటారు.
రంజాన్ పండుగ ఇస్తాం క్యాలండర్ ప్రకారం రంజాన్ నెల మొదటి రోజు పారంభం అవుతుంది .
ఈరోజు రాతిరి చంద్రదర్శనం కాగానే మసీదులలో చేయు ప్రత్యేక పార్ధనలు – తరావీ నమాజ్
రంజాన్ నెల అంతా ఉపవాసం చేస్తారు.
తెల్లవారు జామున 4 గంటలకే నిద్రలేస్తారు.
సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందే భోజనం చేయడాన్ని ఏమని పిలుస్తారు – సహరి
పగలంతా ఉపవాసం చేస్తారు.
సూర్యాస్తమయం తర్వాత ఉపవాస దీక్ష విరమిస్తారు. దీనిని ఇఫ్తార్ అంటారు.
ముస్లింలు సంవత్సరానికి ఒకసారి వారి ఆదాయం, సంపదపై ఒకలెక్క ప్రకారం పేదలకు చేయు దానధర్మాలను ఏమంటారు — జకాత్.
రంజాన్ నెల చివరిరోజు చంద్ర దర్శనంతో షవ్వాల్ నెల పారంభం అవుతుంది.
తరువాత రోజు పెద్ద ఎత్తున ఈద్ పండుగ జరుపుకుంటారు
ఈద్ గాహ్ కి వెళ్ళి సామూహిక పార్థనలు చేస్తారు.
ఇంటిల్లి పాదీ ఆరోజు ఉదయం సేమ్యా పాయసం సేవిస్తారు.
తమాషా పదాలు.:-
మట్టి అనగా అర్ధం మన్ను
మట్టి మనుషులు అర్ధం= శ్రామికులు, శ్రమజీవులు.
మట్టిలో కలసిపోవడం = మరణించడం
మట్టి పాలైన = వృధా అయిన
మన్ను తిన్న పాములాగ = కదలక, మెదలక
నోట్లో మట్టికొట్టథం = అన్యాయం చేయడం
తల అనగా అర్ధం – శిరస్సు , శిరము
తలవంపులు అనగా అర్ధం = పేరు పొగట్టడం
తలసరి అనగా అర్ధం = ఒక్కొక్కరి
తలపండిన అనగా అర్ధం = అనుభవం కలిగిన
తలలో నాలుక అనగా అర్థం = అందరికీ గుర్తుండడం
తలదూర్హడం = సంబంధం లేని విషయాలలో కలుగచేసుకోవడం.
విశేషణాలు :- ఒక వాక్యంలో నామవాచకం రంగు, రుచి, స్థితి మొదలైన గుణాలను తెలియచేయు పదాలు.
వాక్యంలో విశేషణం సాధారణంగా నామవాచకానికి ముందు వస్తుంది.
నామవాచకం గుణాలు తెలిపే పదాలు — విశేషణాలు.
Ex. అందమైన, పచ్చని, తియ్యని, కమ్మని.
కింది వాక్యాలు చదివి విశేషణ పదాలు కింద గీత గదియండి?
1. ఏనుగు పెద్ద జంతువు
2. నిమృ్మకాయకు పుల్లని రుచి ఉంటుంది.
3. పుస్తకానికి అందమైన అట్టవేశారు.
4. పచ్చని గోరింటాకు ఎర్రగా పండుతుంది
5. కాచిన పాలు తాగాలి.
గొబ్బిళ్ళ పాట అనే ఈ మాసపు పాట ఎచట నుండి గ్రహించబడింది – సంప్రదాయ జానపద గేయాలు
గొబ్బియళ్ళు గొబ్బ్జియళ్ళు స్ట
గొబ్బియళ్ళు చందమామ ఓ చందమామ.
నకలీ కన్ను అనే ఈ మాసపు కధ ఎచట నుండి గ్రహించారు — నసీరుద్దీన్ కథలు.
ధనికుడి లోభం, దరిద్రుడి దానం అనునది – సామెత
మౌల్వీనసీరుద్దీన్ ఒక ధనుకుడిని కలిశాడు. ఆయన లోభి
ఆ ధనికుడి కళ్ళలో ఒకటి నకిలీది.
నసీరుద్దీన్ ను ధనికుడుతో ఇలా అన్నాడు … నా కళ్ళలో ఏది నకలీ కన్నో కనుక్కుంటే చందా ఇస్తాను అన్నాడు.
మౌల్వి ఎడమకన్ను నకిలీదని చెప్పాడు
నసీరుద్దీన్ ఎలా చెప్పావని అడిగితే. : మీ అసలు కన్నుకు దయా, జాలి ,కరుణా ఉండవు కదా. అందుకే అది రాయిలా కనిపించింది. ఎడమ కంట్లో కొంచెం దయా, పేమ కనిపించాయి అని చెప్పాడు.
పద్యరత్నాలు
పాఠ్యాంశ ప్రకియ – పద్యం
ఇతివృత్తం — నైతిక విలువలు
ధనము కూడ బెట్టి దానంబు సేయక …. అనే పద్యం ఎవరు రచించారు
వేమన శతకం రచయిత — వేమన
పుత్రా తృాహము తండ్రికి ….. అనే పద్యం ఎవరు రచించారు – బద్దెన
సుమతీ శతకం రచయిత — బద్దెన
పరుల కొరకే నదులు ప్రవహించు , గోవులు – అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – తెలుగు బాల శతకం
తెలుగు బాల శతకం రచయిత — జంద్యాల పాపయ్య శాస్త్రి
మొదలు చూసిన కడుగొప్ప పిదప కుజచ…. అనే పద్యం ఎవరు రచించారు – ఏనుగు లక్ష్మణ కవి
సుభాషిత రత్నావళి రచయిత — ఏనుగు లక్ష్మణ కవి
ఎంత చెలిమి యున్న ఎగతాళి చేయకు – అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు — తెలుగు పూల శతకం
తెలుగు పూల శతకం రచయిత — నార్ల చిరంజీవి
మతములెన్ని యున్న మానవత్వముక్కటే – అనే పద్యం ఎవరు రచించారు — నార్ల వెంకటేశ్వరరావు
బ్రతుకవచ్చు గాక బహు బంధనములైన — అనే పద్యం ఎవరు రచించారు – పోతన
పూజకన్నా నెంచ బుద్ది ప్రధానంబు — అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – వేమన
పదాలు — అర్ధాలు
లెస్స = మిక్కిలి ఎక్కువగా
తెరువరి = బాటసారి
పుత్రొ త్సాహము = కొడుకు పుట్టిన సంతోషం
జనులు = ప్రజలు
కనుగొని = గుర్తించి
పరులు = ఇతరులు
పరహితము = ఇతరులకు మేలు
పరమార్ధము = నిజమైన ప్రయోజనం
నిగ్రహించు = ఎదిరించు
కురచ = పొట్టి
ఆది = మొదలు
తనరు = వర్ధులు
దినపూర్వ = ఉదయకాలం
ఛాయ = నీడ
కుజన = చెడ్డవారు
సజ్జనలు = మంచివారు
మైత్రి = స్నేహం
చెలిమి = స్నేహం
సరసం = ఇష్టం
విరసం = అయిష్టం
బంధనములు = కట్లు
లేమి = పేదరికం
జీవధనం = ప్రాణం
మానధనులు = మానమే ధనంగాకలవారు
బుద్ది = ఆలోచన
ప్రధానము = ముఖ్యం
దృడం = గట్టిది
కింది తమాషా వాక్యాలు చదివి, జవాబు రాయండి !
1. వడన తినే వడ- దవడ
2. రోజాలను పెట్టుకునే రోజాలు- సరోజ (అమ్మాయి)
3. జనాలు తినే జనం- భోజనం
4. ఖండాలు, దేశాలు లేని పటం- కపటం
5. పేమను పంచే కారం- మమకారం
6. తాగలేని పాలు – పాపాలు
భూతకాలం:- జరిగిపోయిన పనిని తెలియచేయు కాలం
Ex:- పాడింది, వెళ్లాము
వర్తమాన కాలం :- జరుగుతున్న పనిని తలియచేయు కాలాలను వర్తమాన కాలం అంటారు
Ex:- ఆడుతున్నాడు, ఎక్కుతూ ఉంది
భవిష్యత్ కాలం : జరగబోయే పనిని తలియచేయు కాలాన్ని భవిష్యత్ కాలం అంటారు.
Ex:- తెస్తాడు, వెళతాడు
కింది వాక్యాలు చదివి అవి ఏ కాలంలో ఉన్నాయో రాయండి ?
1. జోసఫ్ రేపు విశాఖపట్టానికి వెళ్ళాడు భవిష్యత్ కాలం
2. రమణి సినిమా చూసింది భూతకాలం
3. హర్షిత పాఠం చదువుతున్నది వర్తమాన కాలం
4. ఖాదర్ కథ రాశాడు భూతకాలం
5. మణి మేఖల ముగ్గు వేస్తున్నది వర్తమానకాలం
6. రాబర్ట్ రేపు ఇంటికి రంగులు వేస్తాడు భవిష్యత్ కాలం
వీరగంధము తెచ్చినారము
వీరుడెవ్వడో తెల్పుడి అనే ఈ మాసపు గేయం ఎవరు రచించారు — తిపురనేనిరామస్వామి
తీపురనేని రామస్వామి జననం – 1887 జనవరి 15
మరణం — 1943 జనవరి 16
తిపురనేని రామస్వామి హేతువాద రచయిత
తిపురనేని రామస్వామి బిరుదు – కవిరాజు
తిపురనేని రామస్వామి రచనలు – 1. సూతపురాణం 2. పల్నాటి సారుషం
పేను – నల్లీ అనే ఈ మాసపు కథ ఎచట నుండి గ్రహించారు – నీతి చందిక
నీతి చందిక రచయిత – పరవస్తు చిన్నయసూరి
రాజు గారి మంచంలో పేను నివసించేది
ఒకరోజు పేను దగ్గరికి నల్లీ వచ్చింది
నల్లికి తనకు రాజుగారి రక్త తాగాలనుంది అని తన కోరికను పేనుతో చెప్పింది
నల్లీ పేను మాట వినకుండా తొందరపడి రాజు గారిని కుట్టడం వలన రాజుగారి సైనికుల చేతిలో పేను చనిపోయింది .నల్లీ త్వరగా పారిపోయింది ..పేను దొరికిపోవడం వలన చనిపోయింది ..
బారిష్టర్ పార్వితిశం
పాఠ్యాంశ ప్రక్రియ – కధనం
పాఠ్యాంశ ఇతివృత్తం – హస్యం
పాఠ్యాంశ రచయిత — మొక్కపాటి నరసింహశాస్త్రి
మొక్కపాటి నరసింహశాస్త్రి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు
తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన హస్య నవల — బారిష్టర్ పార్వతీశం
చెన్న పట్నంలో (మద్రసులో టోపీలు అమ్మేవారి దగ్గర ఖర్జుర పాకులతో అల్లిన ఆడవారు పెట్టుకునే పెద్ద టోపీ కొన్నాడు
తూత్తుకుడిలో రైలు ఆగింది. అక్కడ కొలంబోవెళ్లే ప్టీమరు ఎక్కాడు .
కొలంబో నుండి మార్చేల్స్ వెళ్ళే స్టీమర్ ఎక్కాడు .
పదాలు — అర్ధాలు
ఐదవ ఫారము = 10వ తరగతి
హితోపదేశం = మేలు చేసే మాట
బారిష్టర్ = ఇంగ్లాండ్ లో న్యాయశాస్త్రం చదువుకున్న వారు
దంతధావనము = పళ్ళు తోముకోవడం
కచ్చికలు = కాల్లిన పిడకలు
అంగవస్తం = తువ్వాలు
చాదు = పిండితో తయారు చేసిన బొట్టు
దొర = తెల్లజాతి పురుషుడు
దొరసాని = తెల్లజాతిస్త్రీ
స్టీమరు = ఆవిరితో నడిచే పెద్దనావ
గుర్రనికి సుడులు కావాలి. గాడిదకు అవసరంలేదు. గుర్రన్ని కోనాలి. గాడిదను కోనక్క ర్లేదు . గుర్రనికి జీను కావాలి గాడిదకు అక్కరలేదు. ఆశ్వానికి సంరక్షణకావాలి.గార్థభానికి అవసరం లేదు. హయానికి గుగ్గిళ్ళ దాణా పెట్టాలి. గాడిదకు ఇవి అనవసరం అందుకే నేను గాడిదను అధిరోహిస్తాను అని అన్నది – చిలకమర్తి రాసిన గణపతి నవలలో గణపతి
ఆశ్వానికి పర్యాయ పదాలు – గుర్రం, హయం
గాడిదకు మరొక పేరు – గార్థభం
రోహిణి కార్తెలో ఎండకు రోళ్ళు పగులుతాయి
నక్షత్రలు మొత్తం – 27
1.అశ్వని
4.రోహిణి
7.పునర్వసు
10ముఖ
13.హస్త
16. విశాఖ
19. మూల
22. శ్రవణం
25.పూర్వ బాధ్ర
2.భరణీ
5.మృగశిర
8. పుష్య
11. పుబ్బ
14.చిత్త
17. అనూరాధ
20.పూర్వాషాడ
23.ధనిష్టం
26.ఉత్తరాబాధ్ర
3.కృత్తిక
6.ఆరుద్ర
9.ఆన్లేష
12. ఉత్తర
15.స్వాతి
18.జ్యేష్ట
21.ఉత్తరాషాడ
24. శతభిషం
27.రేవతి
పూర్ణిమనాడు ఏ నక్షత్రం ఉంటే ఆనెలకు ఆపేరు పెట్టారు.
అశ్వని అంటే ఆశ్వయుజ మాసం
కృత్తిక అంటే కార్తీక మాసం
రాశులు, నక్షత్రలన్నీ చంద్రమానం మీద ఆధారపడి ఉంటాయి .
సూర్యుడు ఏ నక్షత్రనికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తే పేరు పెట్టారు.
సంవత్సరానికి 27 కార్తెలు
అశ్విని కురిస్తే అంతానష్టం .
భరణిలో చల్లిన నువ్వు చేను కాయకు బరిగెడు గింజట .
కియా పదాలు వాక్యంలో వాడినపుడు అవి రెండు రకాలుగా పనిచేస్తాయి 1.వాక్యాన్ని పూర్తి చేయడం చేయకపోవడం
వాక్యాన్ని పూర్తి చేయగలిగిన కీయాలను సమాపక కీయలు అంటారు
సమాపక కియా వాక్యాలు :- 1. రవి ఇంటిపని చేశారు.
2. పెల్లలు నడుస్తునారు .
3. లత పరీక్ష రాస్తుంది .
వాక్యాన్ని పూర్తి చేయలేని క్రియాలను అసమాపక కియలు అంటారు
అసమాపక కియా వాక్యాలు 1. రవి ఇంటిపని చేసి…..
2. పిల్లలు నడుస్తూ …
3. లతా పరీక్షలు రాసి…
ఏరువాక పాట అనే ఈ మాసపు పాట ఎవరు రచించారు – బిరుదురాజు రామరాజు
బిరుదు రాజు రామరాజు జననం — 1925 april 16
మరణం — 2010 ఫిభ్రవరి 8
బిరుదు రాజు రామరాజు వరంగల్ జిల్లా దేవనూరు గానంలో జన్మించారు.
తెలుగు జానపద గేయ సాహిత్యం పై మొట్టమొదటగా పరిశోధన చేసింది – బిరుదురాజు రామరాజు
బిరుదు రాజు రచనలు — 1. తెలుగు జానపద రామాయణం
2.తెలుగు సాహితోద్దారకులు
అత్యాశ అనే ఈ మాసపు కథను ఎచట నుండి గ్రహించారు – పంచతంత్ర కథలు
Why TETDSC.com is a Game-Changer for Telugu Aspirants
1. **Free Practice Exams in Telugu** TETDSC.com is renowned for its extensive collection of free practice exams tailored specifically for Telugu-medium students. These mock tests are designed to simulate the actual TET and DSC exams, helping aspirants get a feel for the question patterns, difficulty levels, and time constraints. By offering these resources in Telugu, the platform ensures that language is no longer a barrier to effective preparation.
2. **Comprehensive Coverage of the Syllabus** The platform covers all the essential subjects and topics required for TET and DSC exams, including: - Child Development and Pedagogy (CDP) - Mathematics - Environmental Studies (EVS) - Telugu Language and Literature - English Language Each practice test is meticulously crafted by subject matter experts to align with the latest exam patterns and syllabi.
3. **Designed for Telugu-Medium Students** Understanding the unique needs of Telugu-medium students, TETDSC.com provides all its resources in simple and easy-to-understand Telugu. This ensures that students can grasp complex concepts without struggling with language barriers.
4. **User-Friendly Interface** Navigating TETDSC.com is a breeze, even for those who are not tech-savvy. The platform’s intuitive design allows users to access practice exams, study materials, and results with just a few clicks.
5. **Regular Updates and New Content** The team behind TETDSC.com is committed to keeping the platform updated with the latest exam trends and patterns. New practice tests and study materials are added regularly, ensuring that aspirants always have access to the most relevant resources.
-How TETDSC.com Helps You Succeed**
1. **Builds Exam Confidence** By taking regular practice tests, students can identify their strengths and weaknesses. This helps them focus on areas that need improvement, ultimately boosting their confidence for the actual exam.
2. **Improves Time Management Skills** One of the biggest challenges in competitive exams is managing time effectively. TETDSC.com’s timed practice tests help students develop the ability to answer questions quickly and accurately.
3. **Accessible Anytime, Anywhere** The platform is accessible on both desktop and mobile devices, allowing students to practice on the go. Whether you’re at home, commuting, or taking a break at work, TETDSC.com is always at your fingertips.
4. **Completely Free of Cost** Unlike many other platforms that charge hefty fees for practice exams, TETDSC.com offers all its resources for free. This makes it an invaluable tool for students from all economic backgrounds.
-What Users Are Saying About TETDSC.com
Thousands of aspirants have already benefited from TETDSC.com’s free practice exams. Here’s what some of them have to say:
- *"TETDSC.com has been a lifesaver for me. The Telugu practice tests helped me understand concepts better and improved my speed and accuracy."* – Rajesh, TET Aspirant - *"I couldn’t afford expensive coaching, but TETDSC.com gave me everything I needed to crack the DSC exam. Thank you!"* – Lakshmi, DSC Aspirant - *"The platform is so easy to use, and the practice tests are just like the real exam. Highly recommended!"* – Srinivas, TET Aspirant
---ap dsc sgt online mock test free -
How to Get Started with TETDSC.com
1. Visit the website: [www.tetdsc.com](http://www.tetdsc.com) 2. Create a free account to access all the resources. 3. Choose your desired practice test or study material. 4. Start practicing and track your progress.