by admin | Jun 22, 2022 | Uncategorised
AP 6th Class Social Notes 8th Unit రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు
→ షోడశ మహాజన పదాలలో మగధ శక్తివంతమైన రాజ్యంగా ఆవిర్భవించింది.
→ ఒకరాజు పరిపాలించబడే భూభాగాన్ని ‘రాజ్యం’ అంటారు.
→ సువిశాలమైన రాజ్యాలను ‘సామ్రాజ్యాలు’ అంటారు.
→ మౌర్య చంద్రగుప్తుడు కౌటిల్యుని సహాయంతో మగధ రాజ్యానికి రాజయి, మౌర్య (వంశ) సామ్రాజ్యాన్ని స్థాపించాడు. వీరి రాజధాని పాటలీపుత్రం.
→ మెగస్తనీస్ ఒక గ్రీకు రాయబారి. ఇతను ‘ఇండికా’ అనే గ్రంథాన్ని రచించాడు.
→ కౌటిల్యుడిని విష్ణుగుప్తుడు మరియు చాణుక్యుడు అని కూడా పిలుస్తారు. ఇతను ‘అర్థశాస్త్రము’ అనే గ్రంథంను రచించినాడు.
→ అశోకుడు భారతదేశానికి తూర్పు తీరంలోని ‘కళింగ’ రాజ్యంపై యుద్ధం చేసాడు.
→ 13వ నంబరు రాతిశాసనంలో అశోకుడు కళింగ యుద్ధం గురించి ప్రస్తావించడం జరిగింది.
→ అశోకుని శాసనాలు ప్రాకృత భాషలో, బ్రహ్మి లిపిలో ఉన్నాయి.
→ ధర్మము అనే పదాన్ని ప్రాకృత భాషలో దమ్మము అని పిలుస్తారు.
→ నాలుగు సింహాల గుర్తు భారతదేశ జాతీయ చిహ్నం. దీనిని సారనాథ్ లోని అశోకుని శిలా స్తంభంలో నుండి స్వీకరించారు.
→ 1950 జనవరి 26 నుండి దీనిని అధికార చిహ్నంగా గుర్తించారు.
→ ‘సత్యమేవ జయతే’ అనే పదాన్ని ‘మండూకోపనిషత్’ నుండి గ్రహించబడింది.
→ గుప్తవంశ రాజులలో మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు ప్రసిద్ధి చెందిన రాజులు.
→ సముద్ర గుప్తుడు దక్షిణాధిన 12మంది రాజులను ఓడించాడు.
→ రెండవ చంద్రగుప్తుని కాలంలో తొమ్మిది మంది గొప్ప పండితులు ఉండేవారు. వీరినే నవరత్నాలు అంటారు.
→ నవరత్నాలలో ‘కాళిదాసు’ ప్రసిద్ధ కవి.
→ గుప్తుల వాస్తు శిల్ప కళా నైపుణ్యానికి అజంతా, ఎల్లోరా గుహలు గొప్ప ఉదాహరణలు.
→ భారతీయ శాస్త్రవేత్తలు ‘సున్నా’ భావనను అభివృద్ధి చేశారు.
→ బ్రహ్మగుప్తుడు గుప్తుల కాలంలో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. ఇతను పౌర సంవత్సరాన్ని దాదాపు ఖచ్చితంగా లెక్కించగల్గినాడు.
→ భారతదేశంలో మొట్టమొదటి ఉపగ్రహం పేరు ‘ఆర్యభట్ట’. దీనిని 1975లో అంతరిక్షంలోకి ప్రయోగించారు.
→ చరకుడు మరియు సుశ్రుతుడు గుప్తుల కాలంలో గొప్ప వైద్య పరిజ్ఞానం గల నిపుణులు.
→ గాయపడిన ముక్కులకు ‘ప్లాస్టిక్ సర్జరీ’ చేసిన మొట్టమొదటి భారతీయ శస్త్రచికిత్స నిపుణుడు సుశ్రుతుడు.
→ గుప్తుల కాలంలో శాస్త్రవేత్తలు లోహశాస్త్ర పరిజ్ఞానంలో నిపుణులు.
→ హుణుల దండయాత్ర వలన భారతదేశంలో గుప్త సామ్రాజ్యం అంతరించింది.
→ గుంటూరు జిల్లాలోని అమరావతి సమీపంలోని ధాన్యకటకం నుండి శాతవాహనులు పరిపాలించేవారు.
→ గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహన రాజులందరిలో గొప్పవాడు.
→ గౌతమీపుత్ర శాతకర్ణికి త్రిసముద్రాధీశ్వర’ అనే బిరుదు కలదు.
→ శాతవాహన కాలంలో ఉన్న ఓడ నాణేలు ప్రసిద్ధి చెందినవి.
→ రోమ్ దేశాలతో శాతవాహనులకు మంచి వ్యాపార సంబంధాలు కలవు.
→ ప్రముఖ బౌద్ధ వేదాంతి ఆచార్య నాగార్జునుడు. శాతవాహనుల కాలంలో నివసించాడు.
→ ఇక్ష్వాకులు ‘విజయపురి’ ప్రధాన కేంద్రంగా పరిపాలించారు.
→ ఇక్ష్వాకులు శ్రీరాముని వారసులుగా చెప్పుకుంటారు.
→ పల్లవులు క్రీ.శ. 300 నుండి 900 సం||రాల మధ్య దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు.
→ తమిళనాడులో కాంచీపురం పల్లవుల రాజధాని.
→ వీరికాలంలో వాస్తుశిల్పకళ రాతిని తొలిచి నిర్మించే ఆలయాల నుంచి రాతితో నిర్మించే ఆలయాల స్థాయికి మారినది.
→ మొదటి నరసింహవర్మ మహాబలిపురంలో అయిదు రథాలు నిర్మించాడు. ఇవి పంచ పాండవ రథాలుగా పేరొందాయి. వీటిని ఏకశిలారథాలు అంటారు.
→ కాంచీపురంలోని ప్రసిద్ధ కైలాసనాథ దేవాలయం రాజసింహుని (రెండవ నరసింహ వర్మ) వాస్తు శిల్పకళారీతికి చక్కటి ఉదాహరణ.
→ కర్ణాటకలోని బాదామిని రాజధానిగా చేసుకుని చాళుక్యులు పరిపాలించారు.
→ తొలి చాళుక్య రాజులలో రెండవ పులకేశి ప్రసిద్ధ రాజు.
→ హర్ష చక్రవర్తి రెండవ పులకేశిని ఓడించాడు. ఈ విషయాన్ని ‘ఐహోలు’ శిలాశాసనంలో పేర్కొనబడినది.
→ రెండవ పులకేశి కొలువులోని రవికీర్తి ఐహోలు శాసనాన్ని తయారు చేశాడు.
→ ‘వేశారా’ అను నూతన వాస్తు శిల్ప కళారీతి (చాళుక్యుల కాలంలో) అభివృద్ధి చెందింది.
→ దక్షిణ భారతదేశములోని ద్రవిడ’ మరియు ఉత్తర భారతదేశంలోని ‘నగారా’ వాస్తు శిల్ప కళాకృతుల మేలి కలయికే ‘వెశారా’.
→ స్వదేశీ తయారీ : స్వదేశీ వస్తువులు
→ తెగ : ఒకే జాతికి చెందిన వ్యక్తులు
→ సామ్రాజ్యం : ఒకే కుటుంబానికి చెందిన రాజుల క్రమం
→ వంశం : పెద్ద రాజ్యము
→ శిలా శాసనాలు : రాళ్ళపై చెక్కబడిన సందేశాలు
→ ఖగోళ శాస్త్రం : అంతరిక్ష అధ్యయన శాస్త్రము
→ రాజ్యం : ఒక రాజుచే పరిపాలించబడే భూభాగాన్ని రాజ్యం అంటారు.
→ సామ్రాజ్యం : సువిశాలమైన రాజ్యాలను సామ్రాజ్యాలు అంటారు.
→ మెగస్తనీసు : గ్రీకు రాయబారి, చంద్రగుప్త మౌర్యుని కొలువులో ఉండేవాడు. ఇండికా అను గ్రంథాన్ని రచించాడు.
→ కౌటిల్యుడు : ఇతనినే విష్ణుగుప్తుడు మరియు చాణుక్యుడు అని కూడా పిలుస్తారు. చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి “అర్థశాస్త్రము” అనే గ్రంథాన్ని రచించాడు.
→ కళింగ : భారతదేశ తూర్పు తీరంలోని ప్రస్తుత ఒడిషాలో ‘కళింగ’ రాజ్యం ఉంది.
→ ప్రాకృతం : అశోకుని కాలంలోని శాసనాలు ఈ భాష (లిపి) లోనే ఉన్నాయి.
→ దమ్మము : ధర్మము అనే పదాన్ని ప్రాకృత భాషలో దమ్మము అని పిలుస్తారు.
→ జాతీయ చిహ్నం : ఒక దేశం యొక్క అధికారిక చిహ్నం. ఇది దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తుంది. నాలుగు సింహాల గుర్తును భారత ప్రభుత్వం అధికార జాతీయ చిహ్నం.
→ నవరత్నాలు : రెండవ చంద్రగుప్తుని కొలువులోని తొమ్మిది మంది గొప్ప పండితులు.
→ ఆర్యభట్ట : గుప్తుల కాలంలో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త, ఇతని పేరు మీదనే 1975లో భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహంకు ఆర్యభట్ట అని పేరు పెట్టారు.
→ “త్రిసముద్రాధీశ్వర” : గౌతమీపుత్ర శాతకర్ణి బిరుదు.
→ ఆచార్య నాగార్జునుడు : ప్రముఖ బౌద్ధ వేదాంతి, శాతవాహనుల కాలం నాటి వాడు.
→ మహేంద్రుని రీతి శిల్పకళ : పల్లవ మొదటి మహేంద్రవర్మ ప్రవేశపెట్టిన నూతన ద్రవిడ వాస్తు శిల్పకళ.
→ మహామల్లుని వాస్తు శిల్పకళా రీతి : పల్లవ మొదటి నరసింహ వర్మ ప్రవేశపెట్టిన నూతన ద్రవిడ వాస్తు శిల్పకళ.
→ రాజసింహుని వాస్తు శిల్పకళారీతి : పల్లవ రెండవ నరసింహ వర్మ ప్రవేశపెట్టిన నూతన ద్రవిడ వాస్తు శిల్పకళ.
→ ద్రవిడ నిర్మా ణ శైలి : దక్షిణ భారతదేశములోని వాస్తు శిల్పకళ.
→ నగారా నిర్మాణ శైలి : ఉత్తర భారతదేశములోని వాస్తు శిల్పకళ.
→ వెశారా : చాళుక్యుల కాలంలోని ద్రవిడ, నగారా శిల్పాకృతల మెలుకలయికే ఈ వెశారా నిర్మాణ (శిల్ప) శైలి.
→ మౌర్యవంశం (322-187 B.C.E.) : చంద్రగుప్త మౌర్యుడు → బిందుసారుడు → అశోకుడు
→ శాసనాలు : రాతిపై, రాగిరేకులపై చెక్కబడిన రాజు ఆజ్ఞలు మరియు సందేశాలు.
→ ఐహోలు శాసనం : రెండవ పులకేశి విజయాలను (హర్పునిపై) తెల్పుతుంది. దీనిని రవికీర్తి వేసాడు. ఇది ప్రస్తుతం కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లాలో ఉంది.
by admin | Jun 22, 2022 | Uncategorised
AP 6th Class Social Notes 7th Unit సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం
→ హిమాలయాలకు మరియు దక్కన్ పీఠభూమి మధ్య గంగ, యమున నదులు ప్రవహిస్తున్నాయి. దీనిని గంగా నదీలోయ అంటారు.
→ తెగలను సంస్కృతంలో ‘జన’ అని, వారు స్థిరపడిన ప్రాంతాన్ని ‘జనపదం’ అని పిలుస్తారు.
→ గంగా, యమున నదుల వెంట ప్రజలు 2700 సం||రాలలో పెద్ద సంఖ్యలో స్థిరపడటం ప్రారంభించారు.
→ గంగా మైదానంలో ఇనుము యొక్క విస్తృతమైన ఉపయోగం పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు ఏర్పడటానికి పరిస్థితులను సృష్టించింది.
→ గ్రామాలు మరియు పట్టణాల యొక్క పెద్ద సమూహాలను ‘మహాజన పదాలు’ లేదా ‘పెద్ద జనపదాలు’ అని పిలిచేవారు.
→ గోదావరి నదీ తీరాన నెలకొన్న జనపదం అస్మిక.
→ గాంధార జనపదం జీలం నదీ తీరాన నెలకొని ఉంది.
→ వేదాలలో ఉపనిషత్తులు ఒక భాగం.
→ మహాజనపదం నాటి వ్యవసాయం చేసే భూ యజమానులను గృహపతి లేదా ‘గహపతి’ అనేవారు.
→ ఇనుప నాగలి వినియోగం, వరి నారు పోసే పద్దతి ఈ కాలంలో వ్యవసాయంలోని రెండు ప్రధాన మార్పులు.
→ బట్టలు మరియు దుప్పట్లు నేసే పనివారిని ‘సాలివారు’ అనేవారు.
→ నాటి మట్టికుండలను ‘పెయింటెడ్ గ్రేవేర్’ అని పిలుస్తారు.
→ చాలా మహాజన పదాలను రాజులు పరిపాలించేవారు.
→ వ్యవసాయం చేసే గృహపతుల నుంచి రాజులు 1/6వ వంతు పంటను పన్నుగా వసూలు చేసేవారు. దీనిని ‘భాగ’ అని పిలిచేవారు.
→ ప్రతీనెల ఒకరోజు ఉచితంగా పనిచేయడం ద్వారా వృత్తిపనివారు, రాజుకు పన్నులు చెల్లించేవారు.
→ ఈ కాలంలోనే నాణేలను ఉపయోగించడం ప్రారంభమైనది.
→ ‘గణ’ అనే పదానికి సమాన హోదా ఉన్నవారు అని అర్థం.
→ ‘సంఘ’ అంటే శాసనసభ.
→ గణ-సంఘాలు ఒక ఉన్నత సమూహం పాలించే ఒక చిన్న భౌగోళిక ప్రాంతమే గణరాజ్యం.
→ రాజ్యం అంటే రాజు లేదా రాణి పాలించే భూభాగం.
→ మహాజన పదాలలో మగధ శక్తివంతమైన రాజ్యం
→ వజ్జి గణ రాజ్యా నికి ఉదాహరణగా చెప్పవచ్చు.
→ గణ రాజ్యంలో ఒకే పరిపాలకుడు కాక, ఒక పరిపాలకుల బృందం ఉండేది.
→ మహిళలకు, బానిసలకు, సేవకులకు గణ సమావేశాలలో పాల్గొనే అవకాశం లేదు.
→ ఈ గణ రాజ్యాలు 1500 సం||రాల పాటు మనగలిగాయి, చివరకు గుప్త రాజులు గణ రాజ్యాలను జయించారు.
→ అలెగ్జాండర్ (గ్రీస్) మాసిడోనియా పాలకుడు.
→ అలెగ్జాండర్ ఈజిప్టు మరియు పశ్చిమ ఆసియా యొక్క భాగాలను జయించి భారత ద్వీపకల్పానికి చేరుకుని బియాస్ నదీతీరం వరకూ వచ్చాడు.
→ గాంధార శిల్పకళ తక్షశిల చుట్టూ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చేయబడింది.
→ గాంధార శిల్పకళ బౌద్ధ (గౌతమ బుద్ధుని చిత్రాలు) మతానికి చెందనది.
→ పురావస్తు శాస్త్రం : పురావస్తు శాస్త్రం అంటే పూర్వీకుల జీవన విధానాలను గురించి శాస్త్రీయంగా విశ్లేషించే ఒక అధ్యయన శాస్త్రం.
→ గణ రాజ్యం : అనేక ప్రాంతాల పాలకులు, సభ్యులు ఉన్న ఒక రాజ్య వ్యవస్థ.
→ సంఘం : ఒక సంస్థ లేదా సంఘం
→ దిగానికాయ : బౌద్ధ వాజ్మయంలోని సుత్త పీఠికలో గల అయిదు నికాయలలో మొదటిది.
→ మధ్యమనికాయ : బౌద్ధ వాజ్మయంలోని సుత్త పీఠికలో గల అయిదు నికాయలలో రెండవది.
→ జనపదం : భారతదేశంలో మొదట్లో గంగా-సింధూ మైదానంలో వ్యవసాయం చేస్తూ అనేక తెగలు స్థిరపడ్డాయి. వీరిని సంస్కృతంలో ‘జన’ అని వారు స్థిరపడిన ప్రాంతాన్ని ‘జనపదం’ అని అంటారు.
→ మహాజనపదం : పెద్ద పెద్ద జనపదాలను మహాజనపదాలు అంటారు.
→ దాసులు : యుద్ధంలో బందీలైనవారు నాడు రైతులకు అమ్మబడేవారు. వారిని బానిసలని, దాసులని అంటారు.
→ భర్తుకా : ఇంటిలోనూ, పొలంలోనూ కూలి తీసుకుని పనిచేసేవారు.
→ గృహపతి : (గహపతి) వ్యవసాయం చేసే భూయజమానిని గృహపతి అంటారు.
→ గణతంత్ర రాజ్యం : ఎన్నుకోబడిన వ్యక్తి పరిపాలించే రాజ్యం.
→ ఉపనిషత్తులు : ‘వచ్చి చేరువగా కూర్చోవడం’ అని అర్థం. ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య సంభాషణలు.
→ సాలివారు : బట్టలు మరియు దుప్పట్లు నేసే పనివారు
→ కమ్మరి : ఇనుప వస్తువులను తయారు చేసేవారు.
→ కుమ్మరి : కుండలు తయారు. చేసేవారు.
→ పెయింటెడ్ గ్రేవేర్ : నాటి కుమ్మరులు మట్టితో తయారు చేసిన ప్రత్యేక కుండలు, పాత్రలు
→ ఆవిర్భావం : గృహపతుల నుండి రాజు పన్ను రూపంలో వసూలు చేసే పంట భాగం (1/6 వంతు)
→ గాంధార శిల్పకళ : గాంధార శిల్పకళ తక్షశిల చుట్టూ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చేయబడింది. ఇది గ్రీకు కళతో ప్రభావితమైనది.
→ మగధ రాజ్యం : గంగానదికి ఇరువైపుల విస్తరించిన రాజ్యం . అన్ని జనపనదాలలో శక్తివంతమైన రాజ్యం.
by admin | Jun 22, 2022 | Uncategorised
AP 6th Class Social Notes తొలి నాగరికతలు
→ 19వ శతాబ్దం వరకు భారతదేశ చరిత్ర వేదకాలంలోనే ప్రారంభమైనదని విశ్వసించేవారు.
→ 1920 హరప్పా, మొహంజోదారో, ప్రాంతంలో జరిపిన తవ్వకాల వలన మనదేశ చరిత్ర రెండువేల సం॥రాల క్రితమే ప్రారంభమైనట్లు తెలిసింది.
→ హరప్పా నాగరికత క్రీ.పూ. 2500-1700 సం||రాల మధ్య వికసించింది.
→ హరప్పా నాగరికత సుమారు 1500 ప్రదేశాలలో బయటపడింది.
→ హరప్పా నాగరికత కాలం నాటికి నగరాలన్నియు ప్రణాళికాబద్ధంగా నిర్మించబడినవి.
→ హరప్పా నగరంలో ఆరు పెద్ద ధాన్యాగారాలు మరియు కార్మికులకు నివాస సముదాయాలు కలవు.
→ లోథాల్ నగరంలో అతి పెద్ద నౌకాశ్రయం కలదు.
→ సింధు నాగరికత కాలంలో మంచి ప్రణాళికాబద్ధమైన భూగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థ కలదు.
→ హరప్పా ప్రజలు ఎండిన మరియు బాగా కాల్చిన ఇటుకలతో ఇళ్ళు కట్టుకునేవారు.
→ పత్తి మరియు నూలు వస్త్రాలను నేయడం ఆ కాలంలలోని ప్రధాన వృత్తులు.
→ పత్తిని మొట్టమొదట పండించింది వీరే.
→ లోథాల్ నౌకాశ్రయం ద్వారా మెసపటోమియా, ఈజిప్టు మరియు ఇరాన్ దేశాలతో సింధూ ప్రజలు బాగా వ్యాపారం చేసేవారు.
→ వ్యవసాయం ప్రధాన వృత్తి. గోధుమ, బార్లీ, ఆముదాలు, బఠానీలు, కాయధాన్యాలు పండించేవారు.
→ నాట్యం, చదరంగం ఆడటం, సంగీతం, గోళీలు, పాచికలు ఆడటం సింధూ ప్రజల వినోదాలు.
→ సింధూ ప్రజలు పశుపతి (శివుడు) మరియు అమ్మతల్లిని పూజించేవారు.
AP 6th Class Social Notes Unit-6 తొలి నాగరికతలు
→ స్వస్తిక్ (ఈ) గుర్తును సాధారణంగా ఉపయోగించేవారు.
→ సింధూ ప్రజల లిపిని ఇంతవరకు అర్థం చేసుకోలేకపోయారు.
→ ప్రామాణికమైన తూనికలను, కొలతలను మొట్టమొదట ఉపయోగించింది హరప్పా ప్రజలే.
→ ఆర్యుల దండయాత్రలు సింధూ నాగరికత పతనానికి కారణమనే సిద్ధాంతం కలదు. అయితే ‘మార్టిమర్ వీలర్’ అనే చరిత్రకారుడు దీనిని అంగీకరించలేదు.
→ ఆర్యుల పుట్టుపూర్వోత్తరాల గురించి అనేక సిద్ధాంతాలు కలవు.
→ వేద సాహిత్యము ఆవిర్భవించిన కాలాన్ని వేదకాలం అందురు.
→ ఆర్యుల నాగరికత సింధూ మరియు సరస్వతి నదీ మైదాన ప్రాంతాలలో వికసించింది.
→ ఆర్యుల గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం వేద సాహిత్యం.
→ సంస్కృత భాషలో వేదమనగా ఉన్నతమైన జ్ఞానం, ఆత్మజ్ఞానమే వేదము.
→ వేదాలను శృతులు అని కూడా అంటారు.
→ వేద సాహిత్యములో నాలుగు ప్రముఖ వేదాలు కలవు, అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము.
AP 6th Class Social Notes Unit-6 తొలి నాగరికతలు
→ ఆధునిక కాలంలో స్వామి దయానంద సరస్వతి “వేదకాలానికే మరలా వెళ్ళాలి” అని పిలుపునిచ్చారు.
→ తొలి వేదకాలము క్రీ.పూ. 1500 – 1000 వరకు.
→ మలి వేదకాలము క్రీ.పూ. 1000 – 600 వరకు.
→ తొలి వేదకాలంలో సమాజానికి ప్రాథమిక అంగం కుటుంబం, తండ్రి కుటుంబానికి పెద్ద. తొలి వేదకాలంలో సమాజంలో స్త్రీలకు గౌరవం ఉండేది. స్త్రీలు వేదాధ్యాయనం చేసేవారు.
→ వాసా (ధోవతి) ఆదివాసా (శరీరము పై భాగానికి కప్పుకొనేది) ప్రస్తుతం మన వేషధారణను పోలి ఉండేవి.
→ మూడు రకాలైన సంగీత వాయిద్యాలు ఉపయోగించేవారు.
→ విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే గురుకులాలు ఉండేవి.
→ ఆర్యులు దేవుడు ఒక్కడే అని నమ్మేవారు.
→ తొలివేదకాలంలో ఎటువంటి వివక్షత లేదు.
→ ఆర్యుల తెగ నాయకుడిని ‘రాజన్’ అంటారు.
→ రాజుకు పరిపాలనా విషయములో సలహాలు ఇచ్చేందుకు ‘సభ’, ‘సమితి’ అను రెండు సభలు ఉండేవి.
→ మలివేదకాలంలో రాజు మరింత శక్తిమంతుడైనాడు, సభ, సమితులు తమ ప్రాధాన్యతను కోల్పోయాయి.
→ మలివేదకాలంలో ఆశ్రమ వ్యవస్థ, వర్ణవ్యవస్థ ప్రారంభమైనవి.
→ రామాయణం, మహాభారతం అనేవి రెండు భారతదేశ గొప్ప ఇతిహాసాలు.
→ రామాయణాన్ని ఆదికావ్యం అంటారు. దానిని సంస్కృతంలో వాల్మీకి రచించారు.
→ మహాభారతాన్ని వేదవ్యాసుడు రచించారు.
→ నాగరికత : మానవుని యొక్క సాంఘిక, సాంస్కృతిక రంగాలలో ఉన్నతమైన స్థితి.
→ ఉపఖండం : ఖండంలో ఉన్న విశాలమైన భాగం
→ వాణిజ్యం : వస్తువులు మరియు సేవల అమ్మకం మరియు కొనుగోలు చేసే ప్రక్రియ.
→ వేదాలు : హిందూ మత పవిత్ర గ్రంథాలు.
→ బ్రాహ్మణాలు : వేదాలపై విపులంగా చేసిన వ్యాఖ్యానాలు.
→ ఉపనిషత్తులు : హిందూ మతం యొక్క పవిత్ర గ్రంథాలు.
→ వస్తు మార్పిడి పద్ధతి : డబ్బుకు బదులు వస్తువులను పరస్పరం మార్చుకొనే విధానం.
→ అమ్మతల్లి : సింధూ ప్రజలు పూజించిన దేవత.
→ గొప్పస్నానవాటిక : ప్రజలు అందరూ స్నానాలు చేయడానికై విశాలమైన కొలను. ఇది మొహంజోదారోలో బయల్పడింది.
→ సరస్వతి నది : థార్ ఎడారిలో ఇంకిపోయిన నదినే సరస్వతి నది అంటారు. ఋగ్వేదంలో సరస్వతి నది గురించి పలుమార్లు ప్రస్తావించడం జరిగింది.
→ అరణ్యకాలు : విద్యావాదము, క్రతువులు, సంస్కారాల గురించి తెలియజేయునవి.
→ తొలి వేదకాలము : క్రీ.పూ. 1500 – 1000 వరకు
→ మలి వేదకాలము : క్రీ.పూ. 1000 – 600 వరకు
→ వాసా : వేదకాలంలోని ధోవతి (దుస్తులు)
→ ఆదివాసా : వేదకాలంలోని శరీరము పై భాగానిని కప్పుకొనేది.
→ రాజన్ : ఆర్యుల తెగ నాయకుడిని రాజన్ అంటారు.
→ సభ, సమితి : రాజుకు పరిపాలనా విషయములో సలహాలు ఇచ్చే రెండు సభలు.
→ సతీసహగమనం : భర్త మరణిస్తే అతనితో పాటు భార్యను కూడా చితిలో కాల్చడం.
→ బహుభార్యత్వము : ఒక మగవాడు ఒకరి కంటే ఎక్కువ భార్యలు కల్గి ఉండటం.
→ వేద కాలం : వేద సాహిత్యము ఆవిర్భవించిన కాలాన్ని వేదకాలం అందురు.
→ ఇతిహాసాలు : రామాయణం, మహాభారతం అనేవి భారతదేశ రెండు గొప్ప ఇతిహాసాలు.
by admin | Jun 22, 2022 | Uncategorised
AP 6th Class Social Notes – సంచార జీవనం నుండి స్థిర జీవనం
→ AP 6th Class Social Notes – సంచార జీవనం నుండి స్థిర జీవనం
- కొన్నివేల సం||రాలకు పూర్వం భారత ఉపఖండంలో నివసించే ప్రజలను ఆహార సేకరణ వేటగాళ్ళు అని పిలిచేవారు.
→ పురావస్తు తవ్వకాలలో లభించిన (దొరికిన) పనిముట్ల ద్వారా మనం ఆది మానవుల గురించి తెలుసుకోవచ్చు.
→ ఆది మానవులు నిప్పు కనుగొనడంతో ఆహారాన్ని వండుకొని తినే విధానానికి నాంది పలికింది.
→ ఆది మానవులు, సంచార జీవనం గడిపేవారు.
→ ఎముకలతో చేసిన పనిముట్ల బెలూమ్ గుహలలో తప్ప భారత ఉపఖండంలో ఎక్కడా దొరకలేదు.
→ గుహల గోడలపై, రాతిస్థావరాలపై ఆది మానవులు, రంగురాళ్ళను పిండి చేసి జంతువుల కొవ్వును కలిపి చిత్రాలు వేయడానికి అవసరమైన రంగులను తయారుచేసి అనేక చిత్రాలను చిత్రించారు.
→ వైయస్ఆర్ కడప జిల్లాలోని చింతకుంట గ్రామంలో 10 రాతి స్థావరాలున్నాయి.
→ ఈ రాతి స్థావరాలలో ఎరుపు, తెలుపు రంగులలో 200 పైగా చిత్రాలున్నాయి.
→ ఎరుపు రంగు చిత్రాలలో ఉన్న మూపురం ఎద్దు ఒకే ఒక గుహలో ఉంది.
→ దాదాపు 12,000 సం||రాల క్రితం ప్రపంచ వాతావరణంలో గొప్ప మార్పులు సంభవించాయి.
→ పాత రాతియుగం (పాలియోలిథిక్ యుగం) – BCE 2.6 మి|| సం||రాల నుండి BCE 10,000 సంవత్సరాల వరకు.
→ మధ్య రాతియుగం (మెసోలిథిక్ యుగం) – BCE 10,000 సం||రాల నుండి BCE 8,000 సంవత్సరాల వరకు.
→ కొత్త రాతియుగం (నియోలిథిక్ యుగం) – BCE 8,000 సం||రాల నుండి BCE 3,000 సంవత్సరాల వరకు.
→ ఆది మానవులు వ్యవసాయం ప్రారంభించటంతో స్థిర జీవనం మొదలయ్యింది.
→ ఆహార నిల్వల కొరకు మట్టి పాత్రలను, గంపలు బుట్టలు లేదా నేల మాళిగలను ఉపయోగించారు.
→ కొత్తరాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని నవీన శిలాయుగం లేదా కొత్త రాతియుగం అంటారు.
→ నవీన రాతియుగ కాలంలో ప్రజలు సాంకేతికంగా ముందంజ వేసారు.
→ ప్రపంచ వ్యాప్తంగా నదీలోయ నాగరికతలు మెసపటోమియా, సింధులోయ (భారత్) మరియు చైనాలలో వర్ధిల్లాయి.
AP 6th Class Social Notes – సంచార జీవనం నుండి స్థిర జీవనం
→ వరి, గోధుమ, బార్లీ, పప్పులు, పెసలు, సెనగ, మునగ పంటలను పండించారు.
→ మట్టితో, గడ్డితో చేసిన గుడిసెలలో, ఇండ్లలో నివసించేవారు.
→ గొర్రెలు, మేకలు, ఎద్దులు మొదలైన పశువులను మచ్చిక చేసుకున్నారు.
→ పురాతన సామాగ్రిని, ఎముకలు, పాత్రలు, భవనాలు, అవశేషాలను అధ్యయనం చేసేవారిని పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు.
→ మన రాష్ట్రంలో (ఆం.ప్ర.)లో యానాదులు, చెంచులు తెగకు చెందిన వారు కొన్ని ప్రాంతాలలో వేటాడటం, ఆహార సేకరణ ద్వారా నేటికి జీవితాన్ని గడుపుతున్నారు.
→ వేట-ఆహార సేకరణ చేసేవారు : అడవుల నుండి ప్రకృతి సిద్ధంగా లభించే వస్తువులు, జంతువులు, పక్షులను వేటాడేవారు.
→ పశుకాపరులు : పశువులను పెంచేవారు. ఈ పురాతత్వ శాస్త్రజ్ఞుడు : తవ్వకాలలో దొరికిన పురాతన సామగ్రి, ఇతరాలను అధ్యయనం చేసేవారు.
→ స్థిర జీవనం : ఒకచోట నివసించడం. ఈ రాతి పరికరాలు : వివిధ అవసరాలకు రాతితో చేసిన పనిముట్లు.
→ రోలు – రోకలి : వ్యవసాయ ఉత్పత్తులను దంచడానికి ఉపయోగించేవి.
→ కంచు లోహం : రాగి, టిన్ లోహాల మిశ్రమం.
→ మచ్చిక చేసుకొనుట : కావలసిన మొక్కలను, జంతువులను పెంచుకోవడం.
→ సంచార జీవులు : ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నిరంతరం సంచరించే వారిని సంచార జీవులు అంటారు.
AP 6th Class Social Notes – సంచార జీవనం నుండి స్థిర జీవనం
→ పురావస్తు శాస్త్రవేత్త : ప్రాచీన కాలంలో ప్రజలు నివసించిన ప్రదేశాలలో నేలను త్రవ్వినపుడు దొరికిన పురాతన సామగ్రిని అధ్యయనం చేసేవారు.
→ పాత రాతియుగం : BCE 2.6 మిలియన్ సం||రాల నుండి BCE 10,000 సం||రాల వరకు
→ మధ్య రాతియుగం : BCE 10,000 మిలియన్ సం||రాల నుండి BCE 8,000 సం||రాల వరకు
→ కొత్త (నవీన) రాతియుగం : BCE 8,000 మిలియన్ సం||రాల నుండి BCE 3,000 సం||రాల వరకు
→ రాతి చిత్ర కళాస్థావరాలు : ప్రాచీన కాలం నాటి చిత్రకళ (ఆది మానవుల గీసిన చిత్రాలు)ను కనుగొన్న కొండ/గుహ ప్రాంతాలు.
by admin | Jun 22, 2022 | Uncategorised
4వ తరగతి – తెలుగు
1. గాంధీ మహాత్ముడు
ఇతివృత్తం – మహనీయుని చరిత్ర
ప్రక్రియ – గేయం
కవి పరిచయం :
కవి – బసవరాజు అప్పారావు (13.12.1894 – 10.06.1933). భావకవి, గీతకర్త. జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలని గాఢంగా ప్రభావితం చేసాయి. “బసవరాజు అప్పారావు గేయాలు” పేరిట ఈయన గీతాలు సంపుటంగా వెలువడ్డాయి.
AP Class 4 Telugu Notes of New Textbook | Best Notes, APTET 2022 Telugu notes, AP DSC Telugu COntent, 2022 August TET Telugu Content, Telugu best notes for APTET 2022
పదాలు – అర్ధాలు :
స్వరాజ్యం – సొంత పాలన
ప్రణవం – ఓంకారం
మోక్షం – విముక్తి
అధర్మం – అన్యాయం
కంపించుట – వణుకుట
స్వస్తి – శుభం
తేనెల తేటల మాటలతో
రచించినది – ఇంద్రగంటి శ్రీకాంతశర్మ (29.05.1944 – 25.07.2019). కవి, కథకులు, విమర్శకులు. తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి. ఈయన కవితా సంపుటి “అనుభూతి గీతాలు“. లలితగీత కర్త, ఆకాశవాణిలో పని చేశారు.
తెలివైన దుప్పి – జాతక కధ
అడవిలో దుప్పిగా జన్మించింది – భోదిసత్వుడు
గోపాల్ తెలివి
ఇతివృత్తం – సమయస్ఫూర్తి
ప్రక్రియ – గేయం
గోపాల్ – జయచంద్రుడు అనే రాజు కొలువులో ఆస్థాన విదూషకుడు
పదాలు – అర్ధాలు :
దర్బార్ – రాజసభ
విదూషకుడు – హాస్యగాడు
సామంతులు – చిన్న రాజులు
చూడగంటి
రాగం – బృందావని
తాళం – ఖండ
AP Class 4 Telugu Notes of New Textbook | Best Notes, APTET 2022 Telugu notes, AP DSC Telugu COntent, 2022 August TET Telugu Content, Telugu best notes for APTET 2022
పదాలు – అర్ధాలు :
కవి పరిచయం :
తాళ్ళపాక అన్నమయ్య (09.05.1408 – 23.02.1503). పదకవితా పితామహులు. 32 వేల సంకీర్తనలు రాశారని ప్రతీతి. వేంకటేశ్వరస్వామి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని నిర్మించారు. తేట తెలుగు పలుకుబడి, దేశీ పదసంపద, వాడుకభాషలో అపురూప మాధురి అన్నమయ్య కవిత్వంలో పొంగిపొర్లుతుంటాయి.
విందు
కవిపరిచయం :
సోదుం రామ్మోహన్ (02.03.1939 – 12.11.2008). పత్రికా రచయిత. పలు రచనలు అనువాదాలు చేశారు. నిఘంటు నిర్మాణం కూడా చేశారు. రెండు దశాబ్దాల పాటు “విశాలాంధ్ర“లో, ఒక దశాబ్దం పాటు “ఉదయం“ లో పని చేశారు.
దేశమును ప్రేమించుమన్నా…
ఇతివృత్తం – దేశభక్తి
ప్రక్రియ – గేయం
కవి పరిచయం :
గురజాడ వెంకట అప్పారావు (21.09.1862 – 30.11.1915). ఆధునిక తెలుగు సాహిత్యానికి, కవిత్వానికి మార్గదర్శకులు. భాషావేత్త, యుగకర్త, కవి, కథకులు, నాటక కర్త, చరిత్రకారులు, శాసన పరిశోధకులు. తెలుగు సాహిత్యంలో వాడుకభాష ప్రవేశపెట్టారు. “కన్యాశుల్కం” నాటకం ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్ట రచన.
AP Class 4 Telugu Notes of New Textbook | Best Notes, APTET 2022 Telugu notes, AP DSC Telugu COntent, 2022 August TET Telugu Content, Telugu best notes for APTET 2022
పదాలు – అర్ధాలు :
పదాలు – అర్ధాలు :
ఒట్టి – ఏమి లేని
కద్దు – కలదు, ఉంది
దేశాభిమానం – దేశం మీద ప్రేమ
చట్టా పట్టాలు – ఒకరి చేతిని మరొకరు పట్టుకోవడం
తోడుపడు – సహాయపడు
తెలుగు తల్లి
కవి పరిచయం :
పిల్లలమఱ్ఱి వెంకట హనుమంతరావు (07.05.1921 – 13.09.1989). విమర్శకుడు, కవి. సాహిత్య వ్యాసాలు, కధలు, ఏకాంకికలు, ఖండకావ్యాలు రచించారు. వీరి రచనల్లో సాహిత్య సంపద, ఆంధ్రాభ్యుదయం, కాపు పాటలు ముఖ్యమైనవి.
కందిరీగ కిటుకు
కవి పరిచయం :
రావూరి భరద్వాజ (05.07.1927 – 18.10.2013). గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. ఈయన రాసిన తొలికధ “విమల“. అపరిచితులు, కథాసాగారం వంటి 37 కథాసంపూటలు. ఉడుతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కధలు. కరి మ్రింగిన వెలగపండు, జలప్రళయం వంటి 17 నవలలు రాశారు. “పాకుడు రాళ్లు“ నవలకు జ్ఞాన్ పీఠ్ అవార్డు వచ్చింది.
పురస్కారాలు – జ్ఞాన్ పీఠ్, కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ, సోవియట్ భూమి నెహ్రు పురస్కారం, రాజాలక్ష్మి పురస్కారం, గోపిచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న (ఆంధ్రప్రదేశ్), లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం.
పరివర్తన
ఇతివృత్తం – పిల్లల స్వభావం
ప్రక్రియ – కధ
కవి పరిచయం :
వెంకట పార్వతీశ కవులు
బాలాంత్రపు వెంకటరావు (1882 – 1955). తల్లిదండ్రులు – సూరమ్మ, వెంకట నరసింహం. జన్మస్థలం – మల్లాము, తూ.గో.జిల్లా.
ఓలేటి పార్వతీశం (1880 – 1970). తల్లిదండ్రులు – వెంకమ్మ, అచ్యుతరామయ్య. జన్మస్థలం – పిఠాపురం, తూ.గో.జిల్లా.
AP Class 4 Telugu Notes of New Textbook | Best Notes, APTET 2022 Telugu notes, AP DSC Telugu COntent, 2022 August TET Telugu Content, Telugu best notes for APTET 2022
పదాలు – అర్ధాలు :
పదాలు – అర్ధాలు :
పరివర్తన – మార్పు
చిందర వందర – క్రమపద్ధతిలో లేకపోవటం
ఆహ్లాదంగా – సంతోషంగా
ఆసక్తిగా – ఇష్టంగా
ఆత్మీయంగా – ప్రేమగా
చిన్నబుచ్చుకొను – నిరాశపడు
పడవ నడపవోయి
కవి పరిచయం :
వింజమూరి శివరామారావు (1908 – 1982). తూ.గో.జిల్లా పిఠాపురం దగ్గర చంద్రపాలెం గ్రామంలో జన్మించారు. ప్రముఖ కవి, రచయిత, ఆకాశవాణి కళాకారులు. ఈయన రచనలు – గోర్కీ కధలు, కల్పవల్లి (ఖండకావ్య సంపుటి). ఈయన బిరుదు – కళాప్రపూర్ణ.
ఉపాయం
ఇతిహాసం – మహాభారతం
సత్యమహిమ
ఇతివృత్తం – నైతికవిలువలు
ప్రక్రియ – గేయకధ
కవి పరిచయం :
అవధాని రమేష్ (20వ శతాబ్దం). జన్మస్థలం – కర్నూల్ జిల్లా అవుకు అగ్రహారం (ఆంధ్రరాష్ట్రం). తల్లిదండ్రులు – సుబ్రహ్మణ్యశాస్త్రి, సావిత్రమ్మ. రచనలు – కాసుల పేరు, ప్రతీకారం, మూడు మంచి కధలు. ఈ పాఠం “గుజ్జెన గూళ్ళు” అనే రచన నుండి తీసుకోబడింది.
AP Class 4 Telugu Notes of New Textbook | Best Notes, APTET 2022 Telugu notes, AP DSC Telugu COntent, 2022 August TET Telugu Content, Telugu best notes for APTET 2022
పదాలు – అర్ధాలు :
పదాలు – అర్ధాలు :
మహిమ – గొప్పతనం
ఆకలంక – మచ్చలేని, చెడు గుణాలు లేని
చరితుండు – చరిత్ర కలవాడు /ప్రవర్తన కలవాడు
సత్యవ్రతంబు – ఎల్లవేళలా నిజం చెప్పే వ్రతం
నిత్యంబు – ఎల్లప్పుడూ
గతి – జీవితం గడిచే విధానం
తెన్నులు చూసి – ఎదురుచూసి
మోము – ముఖము
తత్తరం – గాబర
ఆర్తి – దుఃఖం
కని – చూసి
దీనత – దారిద్య్రం
కరుణ – దయ, జాలి
మిరుమిట్లు – మెరుగులు
తిలకించి – చూసి
మది – మనసు, బుద్ది
మొగంబు – ముఖము
మిసిమి – నూతన కాంతి
బహుమానం – కానుక
వన్నె – అందం, రంగు
చెన్ను – అందం
కన్నడ గేయం
– NCERT పాఠ్య పుస్తకం
ఏ కాలుది నేరం ?
– మర్యాద రామన్న కధలు