AP 5TH CLASS TELUGU 2021 8th Lesson ఇటీజ్ పండుగ
కవి పరిచయం
గిడుగు వేంకట రామమూర్తి (29.8.1863- 22.1.1940)
ఆధునిక తెలుగు భాషా ప్రవక్త. ప్రజల జీవితానికి దూరంగా ఉన్న గ్రాంథిక భాష స్థానంలో
ప్రజల వాడుక భాషకు పట్టం కట్టిన యోధుడు.
తన జీవితకాలం వ్యావహారిక భాషా ఉద్యమానికి, గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేశారు.
సవరల కోసం సవర భాషా మాధ్యమంలో తొలి పాఠశాల నడిపారు. సవర పాటలు, కథలు సేకరించి సవర వాచకాలు రూపొందించారు.
AP 5TH CLASS TELUGU 2021 8th Lesson ఇటీజ్ పండుగ
సవర-ఇంగ్లీషు నిఘంటువును రూపొందించడమే కాక సవర భాషలో మౌలికమైన పరిశోధన
చేశారు. సవరల కోసం సవర వ్యాకరణం రచించారు.
‘బాలకవి శరణ్యం’, ‘ఆంధ్ర పండిత భిషక్కుల భాషాభేషజం’ మొదలైన గ్రంథాలు రచించారు.
పాత్రలు : క్రాంతి,అక్షయ,పెద్దనాన్న
విశాఖ, విజయనగరం జిల్లాలలోని మన్యం వాసులు ఇటీజ్ పండుగ చేసుకుంటారు.
మార్చి లేదా ఏప్రిల్ నెలలో చేస్తారు. ఒడియా సాహచర్యం ఉన్నవారు చైత్ పొరొబ్ (చైత్రపర్వం) అని అంటారు. గిరిజనేతరులు ఇటుకల పండుగ అని అంటారు.
AP 5TH CLASS TELUGU 2021 8th Lesson ఇటీజ్ పండుగ
ఉగాది తరువాత నవమి మధ్యలో ఈ పండుగ చేస్తారు. మనలాగే పన్నెండు నెలలకు పేర్లు పెట్టుకున్నారు. అందులో ‘విటిజి. ఆ నెలలో జరిపే పండుగ ఇటీజ్ పండుగ,
గ్రామస్థులు సమావేశం నిర్వింహించి తదుపరి చాటింపు వేస్తారు. ఆ తరువాతి శుక్రవారం నుండి పండుగ ప్రారంభం అవుతుంది
పండుగ రోజు మన రైతుల మాదిరి గానే నాగలి, మోకు, పలుపు తాళ్ళు, కొంకి మొదలయిన వ్యవసాయ పనిముట్లు కడిగి కుదురు’ (దేవుని మూల) దగ్గర పెట్టి పూజిస్తారు.
మామిడికాయలను ఇంటికి తెచ్చి వాటిని ముక్కలుగా కోస్తారు. బియ్యంతో ఆ ముక్కలను
దానిని ‘బోనం’ అంటారు. ఆ బోనం నైవేద్యంగా దేవునికి సమర్పిస్తారు.
రెండవరోజు ‘రొడ్డ కనుసు’ చేస్తారు. ‘రొడ్డ’ అంటే మామిడి, సీతాఫలం మొదలైన ఆకులు. ‘కనుసు’ అంటే ఊరేగింపు. రెండవరోజు ఆకులు కట్టుకుంటారు. తలకు పక్షి ఈకలు కట్టుకుంటారు. ముఖంపై నలుపు, తెలుపు రంగులు దారలుగా పూసుకుంటారు.
AP 5TH CLASS TELUGU 2021 8th Lesson ఇటీజ్ పండుగ
రంగులు, బూడిద కలిపిన నీరు వెదురుగొట్టాల్లో నింపి ఒకరిపై ఒకరు జల్లుకుంటారు.
పనసకాయను జంతువుల ఆకారంగా చేస్తారు. దాని పైకి బాణాలు వేస్తూ, ఆడుతూ, పాడుతూ సంకుదేవుని దగ్గరకు వెళతారు.
సంకుదేవుని కొరకు ప్రతి ఇంటి నుండి గుప్పెడు చొప్పున విత్తనాలు, బియ్యం సేకరిస్తారు. గుడిదగ్గర
బియ్యం వండి నైవేద్యం పెడతారు. విత్తనాలు కొన్ని గుడి చుట్టూ చల్లుతారు. మిగిలిన విత్తనాలు వారం రోజులు తరువాత ఇటింటికి పంచుతారు. అవి వారి విత్తనాలలో కలుపుకుంటారు.
మూడు, ఆరు రోజుల్లో ఏదో ఒక రోజు గ్రామస్థులంతా వేటకు వెళతారు. వేటకు వెళ్ళని వారిని
వరసైన వారు ఎగతాళి చేస్తారు. వేట సాధించిన వారికి ప్రత్యేక గౌరవం ఉంటుంది.
AP 5TH CLASS TELUGU 2021 8th Lesson ఇటీజ్ పండుగ
చివరి రోజును ‘మారు ఇటీజ్’ లేక ‘నూరు ఇటీజ్’ అంటారు. ఆరోజు దారికి అడ్డంగా వెదురు
బొంగు కడతారు. వెదురు గొట్టాలతో వచ్చేపోయే వారిపై నీళ్ళు చల్లుతారు. వెదురు కర్రకు తాళ్ళను కట్టి ఊయలగా చేసి ఊగుతారు.
అర్థాలు
తుడుం = గిరిజన వాయిద్య పరికరం
కొమ్ముబూర = కొమ్ముతో తయారు చేసే బూర
మొక్కుబడులు = భగవంతునికి చెల్లించే ముడుపులు
కుదురు = కుండలు కదలకుండా నిలిపే గుండ్రని అమరిక
థింసా, కోయ = గిరిజన నృత్యాలు
అటక = చిన్నమిద్దె
గ్రామ ఊరేగింపు
రోడ్డ కనుసు = గ్రామ ఊరేగింపు
AP 5TH CLASS TELUGU 2021 8th Lesson ఇటీజ్ పండుగ
For more
TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి
అలంకారాలు Usefull for TS AND AP Best Notes
TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన