
AP DSC 2024 Telugu Content | Class 10 | Best notes
10th తెలుగు
Title
AP DSC 2024 Telugu Content | Class 10 | Best Notes – AP & TS TET & DSC
1. మాతృభావన
పాఠ్యభాగ నేపధ్యం :
కళ్యాణి దుర్గం జయించిన తర్వాత అబ్బాజి సోన్ దేవుడు విజయోత్సాహంతో శివాజీ వద్దకి వస్తాడు. సోన్ దేవుడు శివాజీతో దేవా మీ ఆజ్ఞ ప్రకారం కళ్యాణిని జయించి దాని సర్దారులని పట్టి తెచ్చి సర్వస్వాన్ని రాణివాస స్త్రీలను బందీలుగా తెచ్చాను అని మనవి చేశాడు. ఇది విన్న శివాజీ పరస్త్రీలు తల్లులతో సమానం అని చెప్పి ఆమెకి అగౌరవం కలిగించినందుకు చింతిస్తూ ఇలా చేయడం తగదని హితవు పలికిన సందర్భం లోది
పాఠ్యభాగ వివరాలు :
ఈ పాఠం చారిత్రక కావ్య ప్రక్రియకి చెందినది. చరిత్ర ఆధారంగా రచించిన కావ్యం. డా. గడియారం వెంకటశేష శాస్త్రి రచించిన శివభారతం తృతీయాశ్వాసం లోనిది
పర్యాయ పదాలు :
ఆజ్ఞ – ఆదేశము, ఆన, ఉత్తరువు, నిర్దేశము
కన్ను – అక్షి, చక్షువు, నేత్రము, నయనము
అనలము – అగ్ని, వహ్ని, జ్వలనము
సతి – మగువ, కొమ్మ, ఇంతి, పడతి
ప్రకృతి – వికృతి :
రాజ్ఞి – రాణి
ఆజ్ఞ – ఆన
ఛాయ – చాయ
రత్నము – రతనము
భక్తి – బత్తి
గౌరవము – గారవము
పుణ్యము – పున్నెం
రాశి – రాసి
అంబ – అమ్మ
దోషము – దోసము
బ్రహ్మ – బమ్మ
జ్యోతి – జోతి
గృహము – గీము
భాగ్యము – బగ్గేము
వ్యుత్పత్తి అర్ధాలు :
శివుడు – సాధువుల హృదయాన సయనించి ఉండువాడు, మంగళకరుడు – ఈశ్వరుడు
పతివ్రత – పతిని సేవించుటయే వ్రతముగా కలది – సాధ్వి
పురంధ్రి – గృహమును ధరించునది – గృహిణి
అంగన – చక్కని అవయవముల అమరిక కలది – అందగత్తె
నానార్ధాలు :
వాసము – ఇల్లు, వస్త్రము
సూత్రము – నూలిపోగు, తీగె
చరణము – పాదము, కిరణము, పద్య పాదము
హరి – యముడు, సింహము, ఇంద్రుడు
రత్నము – మణి, స్త్రీ, ముంత
AP DSC 2024 Telugu Content | Class 10 | Best Notes – AP & TS TET & DSC
2. జానపదుని జాబు
ఉద్దేశ్యం :
భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. అందువల్ల భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది అంటారు. గ్రామంలో ప్రతి ఇల్లు విద్యాగంధంతో గుబాళించి అభివృద్ధి చెందితే మనదేశం సుసంపన్నంగా సస్యశ్యామలంగా ఉంటుంది అని మహాత్మా గాంధీ అన్నారు. గ్రామాలు ఎలా ఉన్నాయి? వారి జీవితాలు ఎలా ఉన్నాయి? అనే విషయాలు వివరిస్తూ గ్రామాల్లో పేదలు, దళితుల జీవితాలు చిత్రిస్తూ పల్లెటూరి లేఖలు పేరుతో 1932 లో జనవాణి పత్రికలో, 1933 లో జానపదుని జాబు పేరుతో ప్రజామిత్ర పత్రికలో బోయి భీమన్న ప్రచురించారు. చదువుకుని బీదతనం వల్ల చదువు కొనసాగించలేక స్వగ్రామం పోయి పల్లెటూరి పనుల్లో మునిగిపోయిన జనపదుడు పట్నంలో శ్రీమంతుడు అయిన తన మిత్రునికి తన అవస్థలను గ్రామాల్లో పరిస్థితులను లేఖల రూపంలో రాస్తాడు. గ్రామ పరిస్థితులు తెలపడమే ఈ పాఠం ఉద్దేశ్యం.
పాఠ్యభాగ వివరాలు :
ప్రస్తుత పాఠం లేఖల రూపంలో ఉంది. జానపదుని జాబులు పేరుతో బోయి భీమన్న రాసిన లేఖల సంపుటి నుండి పాఠం ఎంపిక చేశారు. తూర్పు గోదావరి జిల్లా యాసలో లేఖ రచన సాగింది
పదాలు వివరణ :
పురిటి లోనే సంధి కొట్టడం – ప్రారంభంలో పాడైపోయిన పని గురించి వివరించడం
కలుపుదీయడం – సమాజంలో ఉంటూ సమాజాన్ని పాడు చేసే వారిని నివారించడం
గ్రామోద్దరణం – గ్రామ సమస్యలు పరిష్కరించడం (గ్రామోద్దరణమే దేశోద్ధారణం – గాంధీ)
ఉన్నదంతా ఊడ్చుకుపోవడం – పూర్తిగా నాశనం కావడం
3. వెన్నెల
నేపధ్యం :
హిరణ్యకశిపుడు వనవిహారం చేసిన సందర్భంలో వసంత ఋతువును సాయం సమయాన్ని చంద్రోదయాన్ని కవి వర్ణించాడు. రోజంతా తీవ్ర ఎండ ప్రసరింపజేసిన సూర్యుడు ఇంకా ఉష్ణ తాపం పెంచితే అసుర నాయకుడైన హిరణ్యకశిపుడు సహింపడేమో అన్నట్లు నెమ్మదిగా పక్కకి తొలగిపోయాడు. తదనంతరం ప్రకృతిలో వచ్చే మార్పులు రమణీయంగా వర్ణించారు
పాఠ్యభాగ వివరాలు :
ఈ పాఠం కావ్య ప్రక్రియకి చెందినది. కావ్యం వర్ణన ప్రధానంగా సాగుతుంది. ప్రస్తుత పాఠం ఎర్రన నృసింహ పురాణం తృతీయాశ్వాసం లోనిది
అర్ధాలు :
స్మితకాంతి – నవ్వుల వెలుగు
దివి – ఆకాశం
మిక్కుటం – ఎక్కువ
రజనీకరబింబం – చంద్రబింబం
నానార్ధాలు :
వెల్లి – ప్రవాహము, పరంపర
కుండలి – పాము, నెమలి, వరుణుడు
నిట్టవోడుచు – ఉప్పొంగు, రోమాంచితమగు, విజృంబించు
పర్యాయ పదాలు :
చాడ్పు – పగది, విధము, వలె
వెల్లి – ప్రోతస్సు, వెల్లువ, ప్రవాహం
కైరవము – తెల్లకలువ, కుముదము, గార్ధబము, చంద్రకాంతము, శృకము, సోమబంధువు
కౌముది – వెన్నెల, జ్యోత్స్న, చంద్రిక
చంద్రుడు – శశి, నెలవంక, అబరి
తమస్సు – చీకటి, ధ్వంతము, తిమిరము
ప్రకృతి – వికృతి :
సంధ్య – సంజ
దిశ – దెస
ధర్మము – దమ్మము
రాత్రి – రేయి, రాతిరి
నిశ – నిసి
గర్వము – గరువము
యత్నము – జతనము
దిశ – దెస
చంద్రుడు – చందురుడు
4. ధన్యుడు
ఉద్దేశ్యం :
మంచి మిత్రుల కలయిక మన జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుంది. అందుకే ఎప్పుడు సన్మిత్రులను పొందాలని పెద్దవాళ్ళు చెప్తారు. సజ్జన సాంగత్యం ఎప్పటికీ మంచిది అని చెప్పడం పాఠం ఉద్దేశ్యం
పాఠ్యభాగ వివరాలు :
ఈ పాఠం కధా ప్రక్రియకి చెందినది. సంస్కృతంలో విష్ణు శర్మ పంచతంత్రం విశ్వవిఖ్యాతి గాంచింది. దానిని అనుసరించి అనేక గ్రంధాలు వచ్చాయి. వాటిలో లక్ష్మీనారాయణ పండితుడు యొక్క హితోపదేశం ఒకటి. ఆది ఆధారంగా చిన్నయసూరి నీతిచంద్రిక తెలుగులో రచించాడు. ఇది గ్రాంధిక వచనంలో సాగుతుంది. పశుపక్ష్యాదులే పాత్రలుగా లోకరీతిని, నీతిని ప్రభోదిస్తూ కధనాలు సాగుతాయి. ప్రస్తుత పాఠ్యాంశం నీతిచంద్రికలో మిత్రలాభం నుండి గ్రహించినది.
పదాలు – అర్ధాలు :
బుద్ధిహీనత వల్ల సమస్త కార్యాలు నిదాఘ నదీపురములట్లు వినాశము నొందును
నిదాఘము అనగా వేసవి కాలం. నదీ పురములు అంటే నది నీటి ప్రవహాలు. నిదాఘ నదీపురములు అంటే మండు వేసవిలో నదులలో నీటి ప్రవహాలు
ధనమున బాసిన క్షణముననే లాతివాడగును
ధనం పోతే ఎవరూ పలకరించరు. పరిచయం లేనట్లు ఉంటారు. అందరికీ పరాయివాడు(లాతివాడు) అవుతాడు
పరాధనాపహరణము కంటే దిరియుట మంచిది
పరధనం దొంగలించడం మంచిది కాదు. అంతకంటే యాచించడం మంచిది
ఉదరమనుకయి పరుల గోజక ప్రాప్తలాభమునకు సంతోషించు వాడొక్కడు లోకమందు ధన్యుడు
మనం జీవించడం కోసం ఇతరులను పీడించకూడదు. దొరికిన దానితో సంతృప్తి పడుతూ ఆనందంగా జీవించేవాడు ధన్యుడు
ప్రకృతి – వికృతి :
బోజనము – బోనము
శబ్దము – సద్దు
కార్యము – కర్షము
గృహము – గీము
గౌరవము – గారవము
శాస్త్రము – చట్టము
ధర్మము – దమ్మము
సంతోషం – సంతసం
వ్యుత్పత్తి అర్ధాలు :
పుత్రుడు – పున్నామ నరకం నుండి రక్షించువాడు
దేహి – దేహాన్ని ధరించువాడు
ఈశ్వరుడు – ఐశ్వర్యం ఉన్నవాడు
మూషికము – అన్నాదులను దొంగలించేది
నానార్ధాలు :
వివరము – వివరణము, దూషణము
వనము – అడవి, నీరు, గుంపు
ఫలము – పండు, ప్రయోజనం, సంతానం
అమృతము – సోమరసము, వసనాభి, పరబ్రహ్మము
పర్యాయ పదాలు :
జంతువు – పశువు, జింక, అన్వేషణము
మూర్ధము – పుస్తకం, శీర్షము, ఉత్తమంగం
బలము – అంబ, బిరుదు, సత్తువ
వివరము – రంధ్రము, బిలము, కలుగు
5. శతక మధురిమ
ఉద్దేశ్యం :
శతకాలు నైతిక విలువలను పెంపొందిస్తాయి. భావి జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. శతక పద్యాలలో నైతిక విలువలు తెలపడమే పాఠం ఉద్దేశ్యం
పాఠ్యభాగ వివరాలు :
శతక పద్యాలలో మకుటం ప్రధానమైనది. ఈ పద్యాలలో ప్రతి పద్యం చివర మకుటం ఉంటుంది. ఇవి ముక్తకాలు. అంటే ఏ పద్యానికదే స్వతంత్ర భావంతో ఉంటుంది.
పద్యాలు :
నీరము తప్తలోహమున ——————- సుత్తము గోల్చువారికిన్ – ఉత్పలమాల – ఏనుగు లక్ష్మణ కవి
కరిరాజున్ బిసతంతు ——————– సుధా ధారా నుకరోక్తులన్ – మత్తెబం – ఏనుగు లక్ష్మణ కవి
పట్టుగ నీశ్వరు౦డు ———————–దరిగొండ నృసింహ దాయాపయోనిధి – ఉత్పలమాల – వెంగమాంబ
తన దేశంబు —————————– భక్త చింతామణీ – మత్తెబం – వడ్డాది సుబ్బరాయ కవి
ఉరుగుణవంతు ————————– వెన్న భాస్కరా – చంపకమాల – మారద వెంకయ్య
స్థిరతర ధర్మవర్తన ————————- కొరంత భాస్కరా – చంపకమాల – మారద వెంకయ్య
చిక్కని పాలపై ————————— కరుణాపయోనిధీ – ఉత్పలమాల – కంచర్ల గోపన్న
జాతుల్సెప్పుట ————————– శ్రీకాళహస్తీశ్వర – శార్దూలం – ధూర్జటి
వరదైన చేను ————————– బెట్టకు సుమతి – కందం – బద్దెన
పదజాలం :
ఉత్తములు – గొప్పవారు
ముష్కరుడు – దుష్టుడు
లాలన – బుజ్జగించడం
ఘనత – గొప్పతనం
మర్మము – రహస్యం
వ్యుత్పత్యర్ధాలు :
భాస్కరుడు – కాంతిని కలుగజేయువాడు – సూర్యుడు
పయోనిధి – దీనియందు నీరు నిలిచి ఉంటుంది – సముద్రం
దాశరధి – దశరధుని యొక్క కుమారుడు – రాముడు
పర్యాయ పదాలు :
ఈశ్వరుడు – శివుడు, శంకరుడు
లక్ష్మీ – కమల, హరిప్రియ, పద్మ, ఇందిర
దేహం – శరీరం, కాయము, గాత్రము
నీరము – జలము, ఉదకము, పానీయము
పయోనిధి – సముద్రం, కడలి, సాగరము
ప్రకృతి – వికృతి :
మూర్ఖులు – మొరకులు
శ్రీ – సిరి
న్యాయము – నాయము
6. మా ప్రయత్నం
ఉద్దేశ్యం :
ఒక పుస్తకం తాత్వికతను, అంతస్సారాన్ని, ఆశయాల్ని, శ్రమను తెలిపేది ముందుమాట. ముందుమాట వల్ల పుస్తకం చదవాలనే ఆసక్తి పెరుగుతుంది. మంచి పుస్తకం ఎలా ఎంపిక చేసుకోవాలో తెలుస్తుంది. అలాంటి ముందుమాట పరిచయం చేయడమే ఈ పాఠం ఉద్దేశ్యం
పాఠ్యభాగ వివరాలు :
ఒక గ్రంధాన్ని, ఆ గ్రంధ నేపద్యాన్ని, లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంధ రచయిత గాని వేరే రచయిత, విమర్శకుడుగానీ రాసే పరిశీలనాత్మక పరిచయ వాక్యాలను పీఠిక అంటారు. దీనికి ముందుమాట, ప్రస్తావన, తొలిపలుకు, మున్నుడి, ఆముఖం మొదలైన పేర్లు కలవు. మహిళావరణం అనే పుస్తకంలో ముందుమాట ప్రస్తుత పాఠ్యాంశం
పర్యాయ పదాలు :
స్త్రీ – పడతి, వనిత, ముదిత
పద్ధతి – విధానం, కరణి, చందము
స్మరణ – జ్ఞప్తి, గుర్తు, తలపు
జాతీయాలు :
గుండెలు బరువెక్కడం – విపరీతమైన మానసిక భాద కలగడం
నీరు కారిపోవడం – పాడైపోవడం, నిరుత్సాహపడడం, ఆశలు అడుగంటిపోవడం
కనువిప్పు – జ్ఞానం కలగడం
కాలధర్మం చెందడం – మరణించడం
తునాతునకలు – ముక్కలు ముక్కలవడం, పూర్తిగా దెబ్బ తినడం
పదాలు – వివరణ :
సామాజిక మార్పు – సమాజంలో కలిగే మార్పు
విజయోత్సవం – విజయం లభించినందుకు చేసుకునే పండగ
సామాజికాభివృద్ది – సమాజపరమైన అభివృద్ధి
సాంస్కృతిక వారసత్వం – సంస్కృతికి సంబందించిన వాటి కొనసాగింపు
అగ్రతాంబూలం – ఒక రంగానికి, గ్రామానికి లేదా సమాజంలో ఉన్నతునిగా గుర్తించడం
7. సముద్ర లంఘనం
పాఠ్యాంశ నేపధ్యం :
సీతాన్వేషణలో రామలక్ష్మణులు కిష్కింద చేరుకుంటారు. సుగ్రీవునితో స్నేహం చేస్తారు. సుగ్రీవుడు సీతని వెతకడానికి వానర సైన్యాన్ని నఊగు దిక్కులు పంపుతాడు. అంజనేయుని బృందం దక్షిణ దిక్కుకి వెళుతుంది. జాంబవంతుని ప్రోత్సాహంతో ఆంజనేయుడు మహేంద్రగిరి నుండి సముద్ర లంఘనానికి సిద్ధం అవుతాడు. ప్రస్తుత పాఠ్యభాగం అయ్యలరాజు రామభద్రుడు రచించిన రామాబ్యూదయం అనే ప్రబంధం ఆరవ ఆశ్వాసం లోనిది
పాఠ్యభాగ వివరాలు :
వర్ణనా ప్రధానమైన కావ్యాలు ప్రబంధాలు. శ్రీకృష్ణ దేవరాయలు (16 వ శతాబ్దం) కాలాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో ప్రబంధ యుగం అంటారు. పురాణ ఇతిహాసల నుండి చిన్న కధ తీసుకుని వర్ణనలు కలిపి పెంచి స్వతంత్ర కావ్యంగా రచిస్తే దాన్ని ప్రబంధం అంటారు. వీటిలో అష్టాదశ వర్ణనలు ఉంటాయి
సమానార్ధ పదాలు :
కొండ కొమ్మున – కూటాగ్రము
వివరము – రంధ్రము
నభము – ఉప్పరము, ఆకాశం
ప్రకృతి – వికృతి :
సముద్రం – సంద్రం
దిశ – దెస
గొనములు – గుణములు
నిముసము – నిమిషం
అగ్గి – అగ్ని
వ్యుత్పత్తి అర్ధాలు :
కార్ముకం – కర్మకారునిచే చేయబడినది
అమరులు – మరణం లేనివారు
ఉదది – ఉదకము దీనియందు ధరించబడును
ప్రభంజనం – వృక్ష శాఖాదులను విరగగొట్టేది
దానవులు – దనువు అనే స్త్రీ యందు పుట్టినవారు
కేసరి – జూలు కలిగినది
ధరాధరం – ధరను ధరించునది
పారావారాం – అపారమైన తీరం కలది
8. మాణిక్య వీణ
పాఠ్యాంశ ఉద్దేశ్యం :
ఆంధ్ర ప్రభ వార్తాపత్రికలో విద్వాన్ విశ్వం మాణిక్య వీణ శీర్షికన వ్యాసాలు కవితలు రచించారు. మాణిక్య వీణలో వీరు స్వీకరించని అంశం లేదని చెప్పవచ్చు. మానవ జీవన ప్రస్థానంతో కళ, కవిత్వం పెనవేసుకున్నాయి అని మనిషి నిరంతర జ్ఞాన అన్వేషి అని ఈ కవిత తెలుపుతుంది. మాణిక్య వీణను మీటి మానవీయ రాగాన్ని పలికించిన ఈ కవిత చారిత్రక ఘట్టాలని తరచి చూపి మనిషి శాశ్వతత్వాన్ని చూపుతుంది
సాంకేతిక రంగంలో అభివృద్ధి మాత్రమే అభివృద్ధి అనుకుంటూ కళలను సాహిత్యాన్ని ఉపేక్షిస్తుంది నేటితరం. మానవజీవితంతో ముడి వేసుకున్న కళలు సాహిత్యం అనాదిగా సంక్రమించిన ఆస్తి అని తెలుపుతూ విజ్ఞాన మార్గంలో ప్రయాణించి సంస్కృతిని గౌరవిస్తేనే మనిషి శాశ్వతుడు అవుతాడాని తెలపడం ఈ పాఠం ఉద్దేశ్యం
పాఠ్యభాగ వివరాలు :
వచన కవిత అనే సాహిత్య ప్రక్రియ ఈ పాఠం. పద్య, గేయాల్లో ఉండే చందస్సుతో సంబంధం లేకుండా వ్యవహారిక భాషలో రాసే కవిత వచన కవిత. చిన్న చిన్న పదాలు వాక్యాలతో ధ్వని గర్భితముగా ఉండే కవిత వచన కవిత. ఈ పాఠం విద్వాన్ విశ్వం రచనా సంపుటి లోది
అర్ధాలు :
రోదసీ – అంతరిక్షం
ఆయత్తమవుతున్నారు – సిద్ధపడుతున్నారు
రుగ్మత – రోగం
కళవలపడడం – కలవర పడడం
ఒకరిని చూసి మరొకరు చేయడం – అనుకరించడం
పని చేయడానికి సిద్ధం అవ్వడం – ఆయత్తమవడం
అద్భుతంగా నాట్యమాడడం – తాండవమాడడం
పనిని మొదలుపెట్టడం – తిన్నగా ఎదగడం
జాతీయాలు :
మంత్రాలకి చింతకాయలు రాలడం – పని చేయకుండా కబుర్లు చెప్తే ప్రయోజనం లేదని చెప్పడం
మిన్నందుకోవడం – చాలా అభివృద్ధి చెందడం
గజ్జె కట్టడం – పనిలో చురుకుగా పాల్గొని అన్నీ తానై చేసేవారిని గూర్చి చెప్పడం
పర్యాయ పదాలు :
మిన్ను – ఆకాశం, నింగి
తాండవం – నాట్యం, నృత్యం
రుగ్మత – రోగం, జబ్బు
జ్ఞానం – తెలివి, మేధ
ప్రకృతి – వికృతి :
భాష – బాస
కవితలు – కైతలు
విజ్ఞానము – విన్నాణము
గుహ – గొబ
9. గోరంత దీపాలు
నేపధ్యం :
సమాజంలో ఎంతో మంది అనాధ బాలలను మనం చూస్తూ ఉంటాము. ఇలాంటి పిల్లల కనీస అవసరాలు అయిన తిండి, బట్ట, చదువు మొదలైనవాటికి నోచుకోకుండా ఉంటారు. అనాధ బాలలను చేరదీసి వారి ఆకలి తీర్చి విద్యా బుద్ధులు చెప్పిస్తే వీరు కూడా మట్టిలో మాణిక్యాలలా వెలుగొందుతారు. సమాజానికి సేవ చేసే గొప్ప మనసున్న వ్యక్తులు తమ ఆస్తిపాస్తులలో సంబంధం లేకుండా అనాధాలను చేరదీసి చదివించేవారు ఎంతో మంది ఉన్నారు. అటువంటి ఒక వ్యక్తి చేసిన పనే ఈ కధ.
ఉద్దేశ్యం :
రైలు ప్రయాణంలో తటస్థ పడిన ఓ బాలుడిని చేరదీసి విద్యా బుద్ధులు చెప్పిస్తే ఎదిగిన ఆ వ్యక్తి చూపే కృతజ్ఞతా భావం వాళ్ళ మధ్య ఉండే మానవ సంబంధాలను తెలపడమే ఈ పాఠం ఉద్దేశ్యం.
పాఠ్యభాగ వివరాలు :
ఈ పాఠ్యభాగం కధానిక ప్రక్రియకు చెందినది. ఇది మానవ సంబంధాలు, సామాజిక సేవ ఇతివృత్తంతో కళ్ళకు కట్టినట్లు మనోభావాలను పలికించేలా ఉంటుంది. ఈ పాఠం పులికంటి వారి కధా వాహిని లోనిది
అర్ధాలు :
సంజవెలుగు – సంధ్యా సమయంలో వెలువడే కాంతి
ఆశీర్వాదం – దీవెన
తదేకంగా – ఒకటే పనిగా అన్నట్లు
కాలక్షేపం – సమయం గడపడం
పులుము – పూసు
ఆకళింపు – అవగాహన
నానార్ధాలు :
రాజు – ప్రభువు, క్షత్రియుడు, ఇంద్రుడు
సమయం – బుద్ధి, సంకేతం, ప్రతిజ్ఞ
కృషి – స్త్రీ, సేద్యం, కరిసనము
కన్ను – ఏరు, వలిపము, తీరు
కొమ్మ – శాఖ, ఆడది, కోటకొమ్మ
ఆశ – దిక్కు, కోరిక
పర్యాయ పదాలు :
పక్షి – నీడజము, ద్విజము, పతగము
నేత్రం – అక్షి, చక్షువు, నయనం
శిరస్సు – తలకాయ, నెత్తి, మస్తకం
సూర్యుడు – అహిమకరుడు, భానుడు, భాస్కరుడు
చెట్టు – తరువు, భూరుట్టు, వృక్షం
కొండ – ఆచలము, శైల్యము, ఆహార్యము
వ్యుత్పత్తి అర్ధాలు :
అతిధి – తిధి, వార, నక్షత్ర నియమం లేకుండా ఇంటికి బోజనముకి వచ్చేవాడు
అక్షరము – నాశనము పొందనిది (వర్ణము)
పక్షి – పక్షములు కలది (విహంగం)
మౌని – మౌనము దాల్చి ఉండువాడు (ఋషి)
10. బిక్ష
నేపధ్యం :
వేద విభజన చేసి పంచమ వేదంగా పేరున్న మహాభారతం రచించి అష్టాదశ పురాణాలు రచించిన బ్రహ్మ జ్ఞాని వేద వ్యాసుడు. కాశీలో వ్యాసుడు తన పదివేల మంది శిష్యులుతో కొంతకాలం నివశించాడు. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి ప్రాతర్మధ్యాహస్నిక విధులు పూర్తి గావించి శిష్యులతో కూడా కాశీ నగర వీధుల్లో బిక్షాటన చేసేవాడు. శిష్యులు తాము తెచ్చిన బిక్షలో సగం అతిధి అభాగ్యులకు సమర్పించి మిగిలినది భుజించేవారు. ఒకరోజు కాశీ విశ్వనాధునికి వ్యాసున్ని పరీక్షించాలనే సంకల్పం కలిగింది. ఆ సందర్భంగా జరిగిన ఘటన ఈ పాఠం
పాఠ్యభాగ వివరాలు :
ఈ పాఠ్యాంశం కావ్య ప్రక్రియకి చెందినది. ఇది కాశీ ఖండం సప్తమశ్వాసం లోనిది
పర్యాయ పదాలు :
ద్వాఃకవాటంబు – ద్వారబంధం, ద్వారం తలుపు
వనిత – స్త్రీ, పురంధి, అంగన, పడతి, నారీ
పసిడి – బంగారం, సువర్ణం, కనకం, హిరణ్యం
పారాశర్యుoడు – వ్యాసుడు, బాదరాయణుడు, సాత్యవతేయుడు
ఆగ్రహము – కోపం, క్రోధం, రోషం, కినుక
అహిమకరుడు – సూర్యుడు, రవి, ఆదిత్యుడు, భాస్కరుడు
అర్ధాలు :
ద్వాఃకవాటము – ద్వారం తలుపు
వీక్షించు – చూచు
అంగన – స్త్రీ
మచ్చెకంటి – చక్కని ఆడది
కుందాడుట – నిందించుట
భుక్తిశాల – బోజనశాల
నానార్ధాలు :
వీడు – ఈ మనుష్యుడు, పట్టణం, వదులుట
లెస్స – మేలు, చక్కన, మంచిది
గురుడు – ఉపాధ్యాయుడు, తండ్రి, బలీయం
ప్రకృతి – వికృతి :
విద్య – విద్దె
బిక్షము – బిచ్చము
యాత్ర – జాతర
మత్స్యం – మచ్చెము
11. చిత్రగ్రీవం
ఉద్దేశ్యం / నేపధ్యం :
కలకత్తాలో ఓ పెంపుడు పావురం దానిని పెంచే ఓ బాలుడు వాళ్ళ కధను మనసుకి హత్తుకుపోయేలా చెప్పిన పుస్తకం చిత్రగ్రీవం. పావురాల జీవనానికి సంబంధించిన అతిసూక్ష్మ వివరాలు తెలపడం ఈ పాఠం ఉద్దేశ్యం
పాఠ్యభాగ వివరాలు :
ఈ పాఠ్యభాగం కధా ప్రక్రియకి చెందినది. ఇది అనువాద కధ. ప్రస్తుత పాఠ్యభాగం ధనగోపాల్ ముఖర్జీ రాసిన చిత్రగ్రీవం ఓ పావురం కధ అనే పుస్తకంలో స్వీకరించారు. దీనిని తెలుగులో అనువాదించినది దాసరి అమరేంద్ర. దీన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా సంస్థ ప్రచురించింది. చిత్రగ్రీవం ఓ పెంపుడు పావురం పేరు. ఈ పాఠం పక్షులకి సంబంధించి శాస్త్రీయ విజ్ఞానం అందిస్తుంది
పదాలు – వివరణ :
గద్దింపులు – కువకువ కూయడం
పావురాలు – రకరకాల రంగురంగుల పావురాలు
గువ్వలు – నీలికళ్ళతో కువకువలాడడం
పావురాల గుంపు – పెనుమేఘాలు
పావురం మెడ – హరివిల్లు
పుట్టిన పిల్ల పక్షి – బలహీనమైన, నిస్సహయమైన, అర్భకమైన
చిత్రగ్రీవం – ముక్కు – పొడవాటి, సూది లాంటి, బలమైన
చిత్రగ్రీవం ఒళ్ళు – సముద్ర నీలిరంగు
చిత్రగ్రీవం మెడ ప్రాంతం – ఇంద్రధనస్సు వర్ణాల పూసల గొలుసు