by admin | May 28, 2022 | ap dsc 2022, ap new telugu content, AP TET Telugu, apt et telugu content, aptet 2022, Dsc 2022, tet 2022
AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి
AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి
పాత్రలు : వియాన్ , మామయ్య
గాంధీ – ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ యు
భగత్ సింగ్ – లెనిన్ రచించిన రాజ్యం – విప్లవం
సరోజని నాయుడు – సరోవర వాణి
అంబేద్కర్ – 32 పుస్తకాలు రచించాడు, 23 డిగ్రీలు సాధించాడు.
తనువు, రక్తంబు, జీవంబు ధారపోసి
ఋషి వతంసులు పెక్కు వేలేండ్లు తపము
సలిపి ఆర్జించినట్టి విజ్ఞాన ధనము
దాచి యుంచిన పేటి గ్రంథాలయమ్ము. -. నాళం కృష్ణారావు
నవ్వుల తాతయ్య – చిలకమర్తి
చిలకమర్తి లక్ష్మీనరసింహం కవి, నాటకకర్త, నవలాకారుడు.
‘గయోపాఖ్యానము‘, ‘కీచకవధ‘ వంటి నాటకాలు, ‘రామచంద్ర విజయము‘, ‘గణపతి‘ నవలలు, ‘భల్లట‘, ‘కృపాంభోనిధి‘ శతకాలు రాశారు. స్వీయచరిత్ర రాశారు.
కందుకూరి వీరేశలింగం చేపట్టిన సంఘ సంస్కరణ స్ఫూర్తితో దళితుల విద్యాభివృద్ధి కోసం పాఠశాల ప్రారంభించి, నిర్వహించారు.
ఆ కమ్మదనము నారుచి
యా కరకర యా ఘుమఘును యా పాంకము లా
రాకలు పోరలు వడుపులు
వీకే దగు నెందులేవు నిజము పకోడీ. – చిలకమర్తి లక్ష్మీనరసింహం
AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి
For More Click Here
https://polycet.xyz/2022/05/28/ap-5th-class-telugu-2021-10th-lesson/
https://polycet.xyz/2022/05/28/ts-telugu-4th-class-2021-9th-lesson/
https://polycet.xyz/2022/05/28/ap-6th-class-new-science-notes-chapter-2/
https://polycet.xyz/2022/05/28/ap-6th-class-new-science-notes-chapter-1/
https://polycet.xyz/2022/05/27/ts-telugu-6th-class-2021-1st-lesson/
http://www.myclassnotes.in/ap-academic-text-books-all-text-books/
[/et_pb_text][/et_pb_column][/et_pb_row][/et_pb_section]
by admin | May 27, 2022 | ap dsc 2022, ap new telugu content, apt et telugu content, aptet 2022, Dsc 2022, TET Telugu, ts dsc 2022, ts new telugu content, TS Telugu, ts tet 2022, ts tet telugu content
TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం Best Notes

ప్రత్యక్ష కధనం: ఒక వ్యక్తి చెప్పిన మాటలను యధాతధంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం ప్రత్యక్ష కధనం.
ప్రత్యక్ష కధనానికి మరియొక పేరు ప్రత్యక్షానుకృతి.
ఉదా: “నేను చదువుచున్నాను” అని సరళ చెప్పింది. “నేను వస్తాను” అని అతడు అన్నాడు.
TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం Best Notes
ప్రత్యక్ష కధనం: ఒక వ్యక్తి చెప్పిన మాటలను యధాతధంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం ప్రత్యక్ష కధనం.
ప్రత్యక్ష కధనానికి మరియొక పేరు ప్రత్యక్షానుకృతి.
ఉదా: “నేను చదువుచున్నాను” అని సరళ చెప్పింది. “నేను వస్తాను” అని అతడు అన్నాడు.
పరోక్ష కధనం: వేరే వాళ్ళు చెప్పిన దాన్ని మన మాటల్లో చెబితే అది పరోక్ష కధనం. పరోక్ష కథనానికి మరియొక పేరు పరోక్షానుకృతి.
ఉదా: తాను చదువుచున్నానని సరళ చెప్పింది. తాను వస్తానని అతడు అన్నాడు.
: అనుకారకం: ప్రత్యక్ష కధనం, పరోక్ష కధనం ఈ రెండు కూడా అనుకరణాలే. అనుకరణంలో అంతా చెప్పి చివరకు ‘అని’ అనే పదాన్ని వాడతాం. కధనం చివర ఈ ‘అని’ని వాడతాం. దీనికి అనుకారకం అని పేరు. అంటే ‘అని’ అనుకారక పదం.
ప్రత్యక్ష కథనాన్ని పరోక్ష కథనంలోనికి మార్చుట :
1. కాకి ‘కావ్ కావ్’ మని అరుస్తుంది. (ప్రత్యక్షం)
కాకి కావు కావుమని అరుస్తుంది. (పరోక్షం)
TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం Best Notes
2 కోకిల “కుహూ కుహూ” అని కూస్తుంది. (ప్రత్యక్షం)
కోకిల కుహూ కుహూమని కూస్తుంది. (పరోక్షం) |
3. “వ్యక్తికి బహువచనం శక్తి” అని శ్రీశ్రీ రాశాడు. (ప్రత్యక్షం) అని
వ్యక్తికి బహువచనం శక్తి అని శ్రీశ్రీ రాశాడు. (పరోక్షం)
4. “నాకు చాలా సంతోషంగా ఉంది” అని నాన్న చెప్పాడు. (ప్రత్యక్షం)
తనకు చాలా సంతోషంగా ఉందని నాన్న చెప్పాడు. (పరోక్షం)
5. నువ్వు నాతో “నువ్వు బాగా చదువుకో” అని అన్నావు. (ప్రత్యక్షం)
నువ్వు నన్ను బాగా చదువుకోమన్నావు. (పరోక్షం)
6. “నాకు ఈ రోజు ఆరోగ్యం బాగా లేదు” అని రవి చెప్పాడు. (ప్రత్యక్షం)
తనకు ఆ రోజు ఆరోగ్యం బాగా లేదని రవి చెప్పాడు. (పరోక్షం)
TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం Best Notes
8. “ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లే చేస్తాము” అని పిల్లలు అన్నారు. (ప్రత్యక్షం)
ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లే చేస్తామని పిల్లలు అన్నారు.(పరోక్షం)
9. “మనుషులంతా పుట్టుకతో సమానం, ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు” అన్నారు భాగ్యరెడ్డి వర్మ,
మనుషులంతా పుట్టుకతో సమానమేనని, ఎవరూ ఎక్కువ కాదని, ఎవరూ తక్కువ కాదం భాగ్యరెడ్డి వర్మ అన్నాడు.
పరోక్ష కధనాన్ని ప్రత్యక్ష కధనంలోనికి మార్చుట :
1. తన దినం తీరుతాదని నాతో తాత చెప్పాడు. (పరోక్షం)
“నా దినం తీరుతాది” అని తాత నాతో చెప్పాడు. (ప్రత్యక్షం)
2 తమ కృషే తమకు అధికారాన్ని సంపాదించి పెడుతుందని గాంధీజీ వారితో అన్నారు. (పరోక్షం)
తమకు “మీ కృషే మీకు అధికారాన్ని సంపాదించి పెడుతుంది” అని గాంధీజీ వారితో అన్నారు. (ప్రత్యక్షం
3. తాను కనబడకపోతే తన తల్లి దుఃఖిస్తుందని అనుకున్నాడు ప్రవరుడు. (పరోక్షం)
“నేను కనబడకపోతే నా తల్లి దుఃఖిస్తుంది” అని అనుకొన్నాడు ప్రవరుడు. (ప్రత్యక్షం)
4. తన ఇంటి పేరేమిటని తనను నిర్వాహకులు అడిగారని లక్ష్మీబాయి అంది. (పరోక్షం)
“మీ ఇంటి పేరేమిటి? అని నిర్వాహకులు నన్నడిగారు” అని లక్ష్మీబాయి అంది. (ప్రత్యక్షం)
5. తనను క్షమించమని రాజు తన మిత్రునితో అన్నాడు. (పరోక్షం)
“నన్ను క్షమించు” అని రాజు తన మిత్రునితో అన్నాడు.(ప్రత్యక్షం)
TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం Best Notes
6. హర్షవర్ధన్ తాను రానని హర్షిణితో అన్నాడు. (పరోక్షం) హర్షవర్ధన్ “నేను రాను” అని హర్షిణితో అన్నాడు. (ప్రత్యక్షం)
వాక్య రీతులు
వాక్యాలలో వాక్య అంగాలు, బేధాలు, రకాలే కాకుండా వాక్య రీతులలో ప్రశ్నార్ధక వాక్యాలు ఉన్నాయి.
7.ప్రశ్నార్ధక వాక్యాలు .
ప్రశ్న అంటే సమాధానాన్ని ఆశించి అడిగేది. వాక్యం చివర ‘ఆ’ చేర్చి ప్రశ్నార్ధక వాక్యాలుగా మార్చవచ్చు
ఉదా: వాక్యం రాణి పాఠాలు చదువుచున్నది.
రాణి పాఠాలు చదువుతున్నదా?
వాక్యం కృష్ణ డాక్టరు. ప్రశ్న కృష్ణ డాక్టరా?
7. టీచర్ “మీరందరూ ఇంటికి వెళ్ళండి” అని చెప్పింది. (ప్రత్యక్షం)
టీచర్ మమ్మల్నందరినీ ఇంటికి వెళ్ళమని చెప్పింది. (పరోక్షం)
TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం Best Notes
For more
My Class Notes
TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి
అలంకారాలు Usefull for TS AND AP Best Notes
TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన
TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం
My Vijetha
Telugu e Tutor
by admin | May 27, 2022 | ap dsc 2022, ap new telugu content, apt et telugu content, aptet 2022, Dsc 2022, tet 2022, TET Telugu
AP 4th CLASS TELUGU 2021
1.గాంధీ మహాత్ముడు

కవి– బసవరాజు అప్పారావు
అర్థాలు
ప్రణవం = ఓంకారం
మోక్షం = విడుపు , విముక్తి
తేనెల తేటల మాటలతో
కవి –ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి.
అనుభూతి గీతాలు ఇతని కవితా సంకలనం.
AP 4th CLASS TELUGU 2021
2. గోపాల్ తెలివి

పాత్రలు : ఢిల్లీ సుల్తాన్,మళవా రాజు జయ చంద్రుడు,జయ చంద్రుడు మంత్రి గోపాల్
సంభాషణలు :
“ఈ భూమి పొడుగు ఎంత? వెడల్పు ఎంత?”
“ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయి?” ఢిల్లీ సుల్తాన్
“రాజా! ఎటువంటి చిక్కు ప్రశ్నకైనా సమాధానం ఉండకతప్పదు. ఆపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవాలి. ఈ విషయం నాకు వదిలేయండి. మీరు నిశ్చింతగా ఉండండి.”. – గోపాల్
“నీకు సంవత్సరం గడువు ఇస్తున్నాను. మళ్లీ ఈనాటికి నీవు జవాబు లతో రావాలి. లేకపోతే నీకు కఠినమైన శిక్ష విధిస్తాను”. ఢిల్లీ సుల్తాన్
*మహాప్రభూ! ఎనిమిది బండ్లలోని దారంతో భూమి నిలువును కొలిచాను. తక్కిన ఎనిమిది బండ్ల దారం భూమి అడ్డం కొలత. ఈ దారం కొలుచుకుంటే మీకు భూమి పొడుగు, వెడల్పు తెలిసిపోతుంది.”. – గోపాల్
AP 4th CLASS TELUGU 2021
“ఆఁ ఆ లెక్క కూడా తెచ్చాను. ఇవిగో ఈ పాతిక గొర్రెలు. ఆకాశంలో ఒక్కో నక్షత్రానికి ఒక్కో గొర్రె వెంట్రుక. ఈ గొర్రెల వెంట్రుకలన్నీ లెక్కించుకుంటే మీకు నక్షత్రాల సంఖ్య ఇట్టే తెలిసిపోతుంది మహాప్రభూ” -. గోపాల్
అర్థాలు
దర్బార్ – రాజ సభ
విదూషకుడు = హాస్య గాడు
చూడగంటి
కవి : తాళ్ళపాక అన్నమాచార్యులు. వేంకటేశ్వర స్వామి కేంద్రంగా 32వేళ సంకీర్తనలురాసలు
రాగం : బృందావనం , తాళం : ఖండ
AP 4th CLASS TELUGU 2021
విందు
రచయిత : సోధుం రామ్మోహన్
పత్రిక రచయిత,నిఘంటు నిర్మాణంచేశారు.విశాలాంధ్ర,వుదయం పత్రికలో పనిచేశారు.
పాత్రలు : నక్షత్రం,సూర్యుడు,చంద్రుడు,వాయువు
“నాయనా నా కోసం ఏం తెచ్చారు మీరు?” నక్షత్రం
“అయ్యో! నీ కోసం నేనేమీ తేలేదమ్మా. వాళ్లు పెట్టింది స్నేహితులతో హాయిగా ఆస్వాదించానే తప్ప నువ్వు గుర్తుకు రాలేదమ్మా!” సూర్యుడు
“నేను కూడా నీ కోసం ఏమీ తేలేదమ్మా! నేను సుష్టుగా భోంచేయడానికి విందుకు వెళ్ళాను తప్ప నీకోసం ఏదో ఒకటి తేవాలనుకోలేదు.” వాయువు
AP 4th CLASS TELUGU 2021
“అమ్మా! నువ్వొక పళ్ళెం తీసుకురా! నీ కోసం అత్యంత రుచికరమైన పదార్థాలను తెచ్చాను. నేను విందులో ఏ పదార్థం తింటున్నా నువ్వే గుర్తుకు వచ్చావంటే నమ్ము!” చంద్రుడు
3. దేశమును ప్రేమించుమన్నా

కవి : గురజాడ అప్పారావు
తెలుగు సాహిత్యం లో వాడుక భాషనుప్రవేశ పెట్టాడు.కన్యాశుల్కం నాటకం రచన
ఒట్టి = ఎది లేని
కద్దు = కలదు,ఉన్నది
తెలుగు తల్లి
పిల్లల మర్రి వేంకట హనుమంత రావు
రచనలు : అంధ్రాభ్యుదయం,కాపు పాటలు,సాహిత్య సంపద.
AP 4th CLASS TELUGU 2021
కందిరీగ కిటుకు
రావూరి భరద్వాజ (5.7.1927 – 18.10.2013)
గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. ‘విమల’ ఈయన రాసిన తొలి కథ.
‘అపరిచితులు’, ‘కథాసాగరము’ వంటి 37 కథా సంపుటాలు, ‘ఉడుతమ్మ ఉపదేశం’, ‘కీలుగుర్రం’ వంటి 43 పిల్లల కథలు, కరిమింగిన వెలగపండు, జల ప్రళయం’ వంటి 17 నవలలు రాశారు.
వీరి ‘పాకుడు రాళ్లు’ నవలకు జ్ఞానపీఠ పురస్కారం వరించింది.
జ్ఞానపీఠ పురస్కారం, కళా ప్రపూర్ణ , కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియెట్ భూమి
నెహ్రూ పురస్కారం, రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం,
కళారత్న (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం), లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి పొందారు.
AP 4th CLASS TELUGU 2021
4. పరివర్తన

కవి పరిచయం
వెంకట పార్వతీశ కవులు
బాలాంత్రపు వెంకటరావు , జననం 1882 మరణం:1955
జన్మస్థలం : మల్లాము, తూర్పుగోదావరి జిల్లా
ఓలేటి పార్వతీశం : జననం 1880 మరణం:1970
జన్మస్థలం : పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా
AP 4th CLASS TELUGU 2021
పడవ నడపవోయి
కవి:వింజమురి శివ రామారావు.,.
రచనలు : గోర్కీ కథలు,కల్పవల్లి ఖండకావ్యం
బిరుదు : కళా ప్రపూర్ణ
5. సత్య మహిమ

కవి : అవధాని రమేష్ కాలం : 20వ శతాబ్దం
ఈ గేయకథ అవధాని రమేష్ గారి రచన ‘గుజ్జనగూళ్ళు’ నుండి తీసుకోబడింది.
ఈయన ఆంధ్ర రాష్ట్రంలోని కర్నూలు జిల్లా అవుకు అగ్రహారంలో జన్మించారు.
ఈయన తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యశాస్త్రి, సావిత్రమ్మ.
ఈయన రచనలు “ కాసుల పేరు’, ‘ప్రతీకారం’, ‘మూడు మంచి కథలు’.
AP 4th CLASS TELUGU 2021
అర్థాలు
మహిమ = గొప్పతనం
అకలంక = మచ్చలేని, చెడుగుణాలు లేనట్టి
చరితుండు = చరిత్ర కలవాడు; ప్రవర్తన కలవాడు
సత్య వ్రతంబు = ఎల్లవేళలా నిజం చెప్పే వ్రతం
నిత్యంబు = ఎల్లప్పుడు
గతి – జీవితం గడిచే విధానం
తెన్నులు చూచి = ఎదురు చూసి
మోము – ముఖం
తత్తరం = గాబరా
ఆర్తి = దుఃఖం
దీనత = దారిద్ర్యం
కరుణ = దయ, జాలి
మిరుమిట్లు = మెరుగులు
AP 4th CLASS TELUGU 2021
6. ముగ్గులో సంక్రాంతి

పాత్రలు : అనూష,ఆదిత్య,అత్తమ్మ
“భోగిరోజు సాయంత్రం రేగుపళ్ళు, తెనగలు, చెరుకు ముక్కలు, చిల్లర డబ్బులు, బంతిపూల రేకులు కలిపి భోగిపళ్ళు పోస్తారు.
ధనుస్సంక్రమణం అంటే సూర్యుడు ధనుస్సురాశిలో ప్రవేశించడం. దీనినే ‘ధనుర్మాసం’ అని కూడా అంటారు.
మనకు ఆహారాన్ని అందించే పశువులను కనుము పండుగ నాడు ఇలాగే పూజిస్తారు.
దక్షణాయనం నుండి ఉత్తరాయణానికి సూర్యుడు ప్రవేశిస్తాడు
AP 4th CLASS TELUGU 2021
అర్థాలు
పద్మం = తామరపువ్వు
విశిష్టత = గొప్పతనం, ప్రత్యేకత
సంబరం = సంతోషం
రాశి = నక్షత్రాల గుంపు
కలశం = చిన్నకుండ లేదా చెంబు
ఆయనం = గమనం
AP 4th CLASS TELUGU 2021
రంజాన్
ముస్లింలు జరుపుకునే పండుగలలో పవిత్రమైన పండుగ రంజాన్.
దీన్ని “ఈద్” అని, ‘ఈద్-ఉల్-ఫితర్’ అని కూడా అంటారు. ఈ పండుగ
ఇస్లాం కేలండర్ ప్రకారం రంజాన్ నెల మొదటి రోజునప్రారంభమవుతుంది. ఈరోజు రాత్రి చంద్ర దర్శనం కాగానే మసీదుల్లో “తరావీ నమాజ్’ అనే ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.
AP 4th CLASS TELUGU 2021
రంజాన్ నెల అంతా ఉపవాసాలు ఉంటారు. తెల్లవారుఝామున నాలుగు గంటలకే నిద్ర లేస్తారు. సూర్యోదయానికి సుమారు గంటన్నరముందే భోజనం చేస్తారు. దీనిని ‘సహరి’ అంటారు.
పగలు ఉపవాసం ఉంటారు. సూర్యాస్తమయం తరువాత ఉపవాసదీక్ష విరమిస్తారు. దీనిని ‘ఇప్తార్’ అంటారు.
‘జకాత్’ చేస్తారు. జకాత్ అంటే సంవత్సరానికి ఒకసారి ఆదాయం, సంపదపై ఒక లెక్క
ప్రకారం పేదలకు దానధర్మాలు చేయటం. రంజాన్ నెల చివర్ల రోజు చంద్రదర్శనంతో ‘షవ్వాల్’ నెల
మొదలవుతుంది.
ఆ మరునాడు పెద్దయెత్తున ‘ఈద్’ పం జరుపుకుంటారు. అందరూ కొత్తబట్టలు ధరించి ‘ఈద్ గాహ్’ కి వెళ్ళి, సామూహిక ప్రార్థనలు చేస్తారు.
AP 4th CLASS TELUGU 2021
7. పద్య రత్నాలు

అర్థాలు
లెస్స = మిక్కిలి / బాగుగా
తెరువరి = బాటసారి
నిగ్రహించు = ఎదురించి
కురుచ = పొట్టి
తనరు = వర్ధిల్లు
దినపూర్వ = ఉదయకాల
చాయ = నీడ
కుజన = చెడ్డవారి
మానవత్వం = మనిషి కి ఉండే సహజ గుణం
లేమి = పేదరికం
జీవధనం = ప్రాణం
AP 4th CLASS TELUGU 2021
వీరగంథం
త్రిపురనేని రామస్వామి: సూత పురాణం, పల్నాటి పౌరుషం,.
బిరుదు – కవి రాజ
8. బారిష్టర్ పార్వతీశం

మొక్కపాటి నరసింహశాస్త్రి: పశ్చిమ గోదావరిజిల్లా, నరసాపురం లో జన్మించాడు.
రచనలు – బారిష్టర్ పార్వతీశం, మొక్కుబడి,అభ్యుదయం ,పెదమామయ్య
కచ్చికలు = కాల్చిన పిడకలు
అంగవస్త్రం = తువ్వాలు
చాదు = పిండితో తయారుచేసిన బొట్టు
దేశవాళీ దువ్వెన = చెక్కతో చేసిన దువ్వెన
AP 4th CLASS TELUGU 2021
అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ,
(పూర్వఫల్గుణి), ఉత్తర (ఉత్తర ఫల్గుణి), హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, జ్యేష్ఠ, మూల,
పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి.
ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు చొప్పున 27 నక్షత్రాలకు వారి పాదాలని, వాటిని 9 పాదాలకు ఒక రాశి చొప్పున 12 రాశులుగా మన పెద్దలు విభజించారు.
అవి మేషం, వృషభం, మిధునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, కుంభం, మీనం.
పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ నెలకు, ఆ పేరు పెట్టారు. అశ్వినీ ఆశ్వీయుజమాసం, కృత్తిక ఉంటే కార్తీక మాసం… ఇలా.
ఇవన్నీ చంద్రమానం మీద ఆధార ఉన్నాయి. మన ప్రాచీన రైతులు వ్యవసాయ విజ్ఞానాన్ని
సూర్యమాన, చంద్రమాన ఆధా పొందుపరిచారు. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ
కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు.
సంవత్సరానికి 27 కార్తెలు. కార్తెలు, నెలలు, రాశుల వారీగా పైరులకు వాతావరణం ఎలా ఉంటుందో సామెతల రూపంలో అందరికి అర్ధమయ్యేలా చెప్పుకున్నారు.”
AP 4th CLASS TELUGU 2021
“అశ్విని కురిస్తే అంతా నష్టం”
“భరణిలో చల్లిన నువ్వు చేను కాయకు బరిగెడు గింజట”
ఏరువాక పాట
బిరుదు రాజు రామరాజు – వరంగల్ జిల్లాదేవునూర్ ,
తెలుగు జానపద రామాయణం,తెలుగు సాహిత్యోధ్దారకులు రచనలు.
AP 4th CLASS TELUGU 2021
9. రాజు–కవి

గుర్రం జాషువా (28.9.1895- 24.7.1971)
ప్రశస్తమైన పద్యశిల్పం, సులలితమైన ధార, దళితులు, అట్టడుగు వర్గాల పట్ల
అపారమైన ప్రేమ, సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం జాషువా కవిత్వ లడ్డూలు.
గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. నవయుగ కవి చక్రవర్తి, కళాప్రపూర్ణ
బిరుదులున్నాయి.
‘పిరదౌసి’, ‘గబ్బిలము’, క్రీస్తు చరిత్ర’ మొదలైనవి ఈయన రచనలు.
AP 4th CLASS TELUGU 2021
అర్థాలు
సౌధం = భవనం
ప్రబలటం = ఎక్కువ కావటం
రాజదండం = రాజు శాసనం
ధనమయం = ధనంతో నిండినది
గండవితతిమయం = రాళ్ళతో కూడినది
ఆత్మగౌరకాములు = తమ గౌరవాన్ని కోరుకొనేవారు
ప్రస్తుతింతురు=పొగుడుతారు
సుధ = అమృతం
AP 4th CLASS TELUGU 2021
వెయ్యేళ్ళ కవినోయ్
కవి : అడవి బాపిరాజు ,
రచనలు – నారాయణరావు,హిమబిందు,శశికళ,గోనగన్నారెడ్డి,గంగిరెద్దు
AP 4th CLASS TELUGU 2021
For more
My Class Notes
TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి
అలంకారాలు Usefull for TS AND AP Best Notes
TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన
TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం
My Vijetha
Telugu e Tutor
by admin | May 27, 2022 | ap dsc 2022, ap new telugu content, apt et telugu content, aptet 2022, Dsc 2022, tet 2022, TET Telugu
AP TET DSC 7TH CLASS TELUGU PART-1 Best Notes
1)శ్రీలుపొంగినజీవగడ్డ
రచన: శ్రీలు పొంగిన జీవగడ్డ పాఠం పక్రియ గేయం , ఇతివృత్తం దేశభక్తి. కవిరాయప్రోలు సుబ్బారావు.
కవి పరిచయం :
రాయప్రోలు సుబ్బారావు గార్లపాడు బాపట్ల తాలూకా గుంటూరు జిల్లా లో జన్మించాడు.
కాలం: 1892 మార్చి 13– 1894 జూన్ 30
AP TET DSC 7TH CLASS TELUGU PART-1
రచనలు :
తృణకంకణం, కష్టకమల, స్నేహలత, స్వప్నకుమారమొదలయినవిభావకవిత్వం లోని ప్రసిద్ధి పొందిన కావ్యాలు .
ఆంధ్రావని , జడ కుచ్చులు, వనమాలమొదలైనవి ప్రసిద్ధ ఖండ కావ్యాలు.
రమ్యాలోకం, మాధురిదర్శనంపద్య రూపం లోని లక్షణ గ్రంథాలు.
అర్థాలు :
శ్రీలు = సిరి , సంపద
AP TET DSC 7TH CLASS TELUGU PART-1
బాధరాయణ = వ్యాసుడు
విపినం = అడవి
విపుల = విస్తరించిన
విమల = పవిత్రమైన, నిర్మలమైన
భంగం =
త్రుళ్ళి =
మహిత =
చేవ = సత్తువ
మధువు = తేనె
పర్యాయ పదాలు
అడవి – విపినం , అరణ్యం
కలకాలం – ఎల్లప్పుడూ
ధరణి – భూమి
విశాలమైన – విస్తారమైన
AP TET DSC 7TH CLASS TELUGU PART-1
సంధులు
సోమన + అధ్రి = సోమనాద్రి
రవీంద్రుడు = రవి + ఇంద్రుడు : సవర్ణదీర్ఘ సంధి
భానూదయం = భాను + ఉదయం :
మాతృ + ఋణం = మాతౄణం
సు + ఆగతం = స్వాగతం
అతి + ఆశ = అత్యాశ
అణు + అస్త్రం = అణ్వాస్రం
పితృ + ఆర్జితం = పిత్రార్జితం
మహీంద్రుడు = మహి + ఇంద్రుడు
అత్యంత = అతి + అంత
మాత్రంశ = మాతృ + అంశ
అణ్వాయుధం = అణు + ఆయుధం
AP TET DSC 7TH CLASS TELUGU PART-1
2)అతిధి మర్యాద
రచన : ప్రక్రియ – పురాణ కథ,. ఇతివృత్తం – సంస్కృతి సంప్రదాయాలు, కవి – ఉష శ్రీ , మూలం – ఆంధ్ర మహా భారతం
పాత్రలు : ముంగిస,పాండవులు,కృష్ణుడు,సాత్యకి,కృతవర్మ,అశ్వత్థామ,కృపాచార్యుడు, భీష్ముడు,సక్తు ప్రస్థుడు,
Content :
కురుక్షేత్ర యుద్ధం చివరగా మిగిలింది –అశ్వత్థామ,కృతవర్మ,కృపాచార్యుడు,పాండవులు,కృష్ణుడు,సాత్యకి,
అంపశయ్య మీద సర్వ ధర్మ విషయాలు బోధించింది – భీష్ముడు
అశ్వమేధ యాగం నిర్వహించింది – ధర్మ రాజు
సభలోకి వచ్చిన జంతువు – ముంగిస
సక్తుప్రస్తుదు ఉండేది – కురుక్షేత్రం
అధరువు = ఆధారం
సంభాషణల
“ దేవతలు కూడా అభినందించే యాగామా ఇది?” – ముంగిస
సక్తుప్రస్థుడిధర్మ బుద్ధితో పోలిస్తే ఆ యాగ జాలలో జరిగినదానం ఏదానం”. – ముంగిస
“ ప్రపంచం లో ఆకలితో ఉన్న మనిషి ఎటువంటి పాపానికి అయినా ఓడగొడతాడు ” – సక్తుప్రస్తూడుఆతిథ్యం స్వీకరించిన వృద్దుడు
“ రాజుల సొమ్ము భీదసాదలకి , బడువుజీవులకి , అన్నార్తులకిఅక్కరకు రావాలి,అదే ముక్తికి మార్గం -;వశిష్టుడు , శ్వేత రాజు తో ప్
AP TET DSC 7TH CLASS TELUGU PART-1
సంధులు
వేయ్యమ్మా = వెయ్యి + అమ్మ
చిర్రేత్తు = చిర్రు + ఎత్తు
అప్పటికే = అప్పటికి + ఏ
రాకుంటే = రాక + ఉంటే
ఏమిటాకత = ఎమిటి + ఆ కథ
జీవగడ్డయి. = జీవాగడ్డ + అయి
భాగ్యసీమయి = బాగ్యసీమ + అయి
చేసుకోవాలని = చేసుకోవాలి + అని
సెలవిచ్చి = సెలవు + ఇచ్చి
రానిదని = రానిది + అని
ఎవరికెంత = ఎవరికి + ఎంత
వచ్చిందిప్పుడు = వచ్చింది + ఇప్పుడు
కవితలల్లిన = కవితలు + అల్లిన
AP TET DSC 7TH CLASS TELUGU PART-1
విభక్తులు
| 1. డుమువులు |
ప్రథమా విభక్తి |
| 2. ని(న్)ను(న్)ల(న్)కూర్చిగురించి |
ద్వితీయా విభక్తి |
| 3. చేత(న్)చే(న్)
తోడ(న్)తో(న్) |
తృతీయా విభక్తి |
| 4. కొఱకు(న్)కై |
చతుర్థివిభక్తి |
| 5. వలన(న్)కంటె(న్)పట్టి |
పంచము విభక్తి |
| 6. కి(న్)కు(న్)యొక్కలో(న్)లోపల(న్) |
షష్ఠీ విభక్తి |
| 7. అందు(న్)న(న్) |
సప్తమీ విభక్తి |
| 8. ఓఓరిఓయిఓసి |
సంబోధనా ప్రథమా విభక్తి |
నామవాచకాలువాక్యాలలోఉపయోగిస్తున్నప్పుడుకొన్నిసందర్భాల్లోవాటిస్వరూపంమారుతున్నది. (కన్ను – కంటిగా, ఇల్లు – ఇంటిగా, ఏరు – ఏటిగా, ఊరు – ఊరిగా; కాలు – కాలిగా, రాయి – రాతిగామారాయి.)
అలామారేటప్పుడునామవాచకంచివరిఅక్షరంమీదఇగాని, ‘టీ’ గాని, ‘తి’ గానిచేరుతున్నాయి. వీటినిఉపవిభక్తులు’ అంటారు.
ఇవిచేరిననామవాచకాలనుఔపావిభక్తికాలుఅంటారు.
AP TET DSC 7TH CLASS TELUGU PART-1
3)ఆనందం
రచన : ప్రక్రియ – కథ,ఇతివృత్తం – వృద్ధుల పట్ల వైఖరి,
పాత్రలు : సుశీల్,సునీత,సాగర్,సావిత్రి,తోటమాలి,నితిన్,
పిల్లలు వేసిన నాటకం – గుశ్వం
AP TET DSC 7TH CLASS TELUGU PART-1
సంభాషణలు :
“ చక్కటి పూలు కోసి,మంచి గుత్తి మి అమ్మగారికి ఇవ్వండి,ఆమె తప్పక సంతోషిస్తారు” – తోటమాలి
“ ముసలి వాళ్ళంతా ఉండే వృద్ధాశ్రమం గుర్తుందా నీకు?వాళ్ళు దీన్ని తప్పకుండా ఇష్టపడతారు” – సాగర్
“ మనం వాళ్ళ కోసం ఉచితంగా ఓ ప్రదర్శన ఇస్తే కనీసం వాళ్ళని ఆనంద పరిచినట్లు అవుతుంది” – సుశీల్
“ తోటమాలి , సావిత్రి పిన్ని స్టేజ్ వెనుక నుండి మనకు సహాయం చేస్తారు ” –సాగర్
“ టికెట్ల ఎక్కడ ప్రింట్ చేద్దాం ” – సునీతా
AP TET DSC 7TH CLASS TELUGU PART-1
4)మేలిమి ముత్యాలు
కవిపరిచయం:
గువ్వల చెన్న–గువ్వల చెన్న శతకం – 16వ శతాబ్ధం
పక్కి అప్పల నర్సయ్య – కుమార శతకం – 16వ శతాబ్ధం
నార్ల చిరంజీవి – తెలుగుపూలు శతకం – 20వ శతాబ్ధం
వేమన – వేమన శతకం – 17వ శతాబ్ధం
నార్ల వెంకటేశ్వరరావు – నార్ల వారి మాట- 20వ శతాబ్ధం
ఏనుగు లక్ష్మణ కవి – సుభాషిత రత్నావళి- 17వ శతాబ్ధం
శేషప్ప్ కవి – నరసింహ శతకం – 18వ శతాబ్ధం
అర్థాలు
కలిమి – సంపద
వితరణి – దానం గుణం కలివాడు
యంభోధి = సముద్రం
బుధులు = పండితులు
సంస్తవనీయ = గొప్పవాళ్ళు
నెరవు =
వేగ = వేగంగా
మంచిత =
తాల్మీ = ఓర్పు
అజి = యుద్ధం
జుంటీగ = తేనెటీగ
లోభి = పిసినారి
పుత్తడి – బంగారం
పద్యం ( పద్య పాదం క్రమం,ఛందస్సు,మకుటం , రచయిత)
1.కలిమిగలలోభికన్నను
విలసితముగఁబేదమేలువితరణియైనన్
చలిచెలమమేలుకాదా
కులనిధియంభోధికన్నగువ్వలచెన్నా!
గువ్వలచెన్నశతకం – కందం
అర్థాంతరన్యాసాలంకారం
2.అవయవహీనుని, సౌంద
ర్యవిహీను, దరిద్రు, విద్యరానియతని, సం
ఆస్తవనీయు, దేవు, శ్రుతులన్
భువినిందింపదగదండ్రుబుధులుకుమారా
కుమారశతకం – కందం
వీటిని నిందించ కూడదు – వికలాంగులను,నిరక్షరాస్యులు , నిరుపేదలు, అందంగా లేని వాళ్ళను,గొప్ప వాళ్ళని,దైవాన్ని,వేదాలను
3.పుస్తకములనీవుపూవువలెనుజూడు
చింపఁబోకుమురికిచేయఁబోకు
పరులపుస్తకములనెరవుతెచ్చితివేని
తిరిగియిమ్మువేగు, తెలుఁగుబిడ్డ
తెలుగుపూలుశతకం – ఆటవెలది
4.సానఁబెట్టినవజ్రంబులీనుకాంతి
పొలముజక్కగదున్నినఫలమునిచ్చు
నటులెయజ్ఞానియైననునవనిపైని
విద్యనేర్చినయనివివేకియగును.
తేటగీతి
5.ఆపుత్తడిగలవానిపుండుబాడైనను
వసుధలోనచాలవారకెక్కు
పేదవానియింటపెండైనయెరుగరు
విశ్వదాభిరామవినురవేమ.
వేమనశతకం – ఆటవెలది
AP TET DSC 7TH CLASS TELUGU PART-1
6.ఆపదలందుధైర్యగుణ, మంచితసంపదలందుఁదాల్మియున్,
భూపసభాంతరాళమునఁబుష్కలవాక్చతురత్వమారట
హాపటుశక్తియున్, యశమునంధనురక్తియు, విద్యయందువాం
ఛాపరివృద్ధియున్, బ్రకృతిసిద్ధగుణంబులుసజ్జనాళికిన్
సుభాషితరత్నావళి – ఉత్పలమాల
7.పత్రికొకటియున్నపదివేలసైన్యము
పత్రికొక్కటున్నమిత్రకోటి
ప్రజకురక్షలేదుపత్రికలేకున్న
వాస్తవమ్మునార్లవారిమాట.
నార్లవారిమాట – ఆటవెలది
AP TET DSC 7TH CLASS TELUGU PART-1
8.మొదలఁజూచినఁగడుగొప్పపిదపఁగుఱుచ
యాదిగొంచెముతర్వాతనధికమగుచుఁ
దనరు, దినపూర్వ, పరభాగజనితమైన
ఛాయపోలికఁగుజనసజ్జనులమైత్రి.
సుభాషితరత్నావళి – తేటగీతి
9.సత్యసూక్తిఘటించుధీజడిమమాన్చు
గౌరవమొసంగుజనులకుగలుషమడంచు
గీర్తిఁబ్రకటించుచిత్తవిస్ఫూర్తిఁజేయు
సాధుసంగంబుసకలార్థసాధకంబు.
సుభాషితరత్నావళి
AP TET DSC 7TH CLASS TELUGU PART-1
10.తల్లిగర్భమునుండిధనముతేడెవ్వఁడు,
వెళ్ళిపోయెడినాడువెంటరాదు
లక్షాధికారైనలవణమన్నమెకాని
మెఱుగుబంగారంబుమ్రింగఁబోడు
విత్తమార్జనచేసివిఱ్ఱవీగుటెకాని,
కూడఁబెట్టినసొమ్ముఁగుడువఁబోడు
పొందుగామణుగైనభూమిలోపలపెట్టి
దానధర్మములేకదాచిదాచి
తుదకుదొంగలకితురో? దొరలకవునా?
తేనెజుంటీగలియ్యవాతెరువరులకు?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
-నరసింహశతకం – సీసం, తేటగీతి
ధనుకుడైనపిసినారి – సముద్రం
AP TET DSC 7TH CLASS TELUGU PART-1
పేదవాడు – మంచి నీటి చేలిమే
చెడ్డవాళ్ళతో స్నేహం –ఉదయం పూట నీడ
మంచివాళ్ళు తో స్నేహం –సాయంకాలం నీడ
డబ్బు సంపాదించికూడబెట్టడం – తేనెటీగ తేనె కూడబెట్టాడం
కోటిమంది మిత్రులు –పత్రిక
పర్యాయ పదాలు
సముద్రం – సంద్రం,అంభుది,
సంపద – కలిమి
వ్యతిరేఖ పదాలు
కలిమి × లేమి
సజ్జనులు × దుర్ణనులు
సత్యం × అసత్యం
కీర్తి × అపకీర్తి
దరిద్రుడు × ధనవంతుడు
ప్రకృతి – వికృతి
పుస్తకం –పుత్తకం
భూమి –
శ్రీ – సిరి
భృంగారం -బంగారం
సుఖం –
ధర్మం – ధమ్మం
గౌరవం –
ప్రాణం –పానం
సమాసాలు
ఎండవానలు – ఎండ,వాన : ద్వంద్వ సమాసం
తల్లిదండ్రులు – తల్లి,తండ్రి : ద్వంద్వ సమాసం
రేయింబవళ్ళు – రేయి ,పగలు : ద్వంద్వ సమాసం
గంగాయమునలు – గంగా,యమునా : ద్వంద్వ సమాసం
రామలక్ష్మణులు – రాముడు,లక్ష్మణుడు : ద్వంద్వ సమాసం
కూరగాయలు – కూర,కాయ : ద్వంద్వ సమాసం
కష్టసుఖాలు – కష్టం ,సుఖం : ద్వంద్వ సమాసం
మంచిచెడులు – మంచి చెడూ : ద్వంద్వ సమాసం
ద్వంద్వ సమాసంలో రెండు నామవాచకాలేఉంటాయి,రెండు కలిసినప్పుడు బహువచనం ఏర్పడుతుంది
నవరసాలు – నవ సంఖ్య గల రసాలు
నాలుగు వేదాలు – నాలుగు సంఖ్య గల వేదాలు
దశావతారాలు – దశ సంఖ్య గల అవతారాలు
AP TET DSC 7TH CLASS TELUGU PART-1
మొదటి పదం సంఖ్యా వాచకం,రెండవ పదంనామవాచకం గా ఉంటే దానిని ద్విగు సమాసం అంటారు.
సాన – కొడవళ్ళు,గొడ్డళ్లుపదునుపెట్టే రాయి.గంధం కోసం రాతి మీధ అరగదిస్తరు , దానినికూడా సాన అంటారు.
5)తెలుగు వెలుగు
రచన : ప్రక్రియ – సంభాషణ,ఇతివృత్తం – నైతిక విలువలు,
పాత్రలు : తాతయ్య,సురభి,శ్రీనిధి,
Content :
జాతీయం : ఒక భాషలో కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇచ్చే పదబంధం అయితే దానిని జాతీయం అంటారు.పలుకుబడి అనే పేరుతో కూడా పిలుస్తారు.
పండినదెండినదొక్కటి
ఖండించినపచ్చిదొకటికాలినదొకటై
తిండికిరుచియైయుండును
ఖండితముగదీనిదెల్పుకవియుంగలడే?
వక్కఆకు, సున్నం
“తోకలేనిపిట్టతొంభైఆమడలుపోయింది” – ఉత్తరం
శబ్దపల్లవం : నామవాచకానికిక్రియాచేరినపదాలనుశబ్దపల్లవంఅంటారు
మేలు,కొనుఅనేరెండుచిన్నమాటలుఉన్నాయి.. ‘మేలు’ అంటేమంచి; ఇదినామవాచకం. ‘కను’ అంటేచూడటం; ఇదిక్రియ. ‘కను’ ‘కొను’గామారింది. మేలుకొనుఅంటేనిద్రలేవడం, జాగృతమవడంఅనిఅర్ధం.
జానపద గేయాలు – మౌలికంగా,ఆశువుగా చెప్పేవి.కర్తృత్వం ఉండదు.
పలుకే బంగారమాయెనా – సంకీర్తన
కప్పను గనిఫణివరుండుగడగడవణికెన్ – సమస్యా పూరణం
ఉప్పు కర్పూరంబు – పద్యం
అదిగో అల్లదిగో – సంకీర్తన
నేను అన్నం తిని బడికి వెళ్తాను – వచనం
బొబ్బిలి పులినీ నేనురా – సై
దేశ రక్షణ చేసేదర –సై – బుర్ర కథ
శ్రీమద్రామాయణ గోవిందో హరి. – హరికథ
కవి ఏకాగ్రతను,దారణను ప్రతిభ ను తెలుసుకోదగినప్రక్రియ – అవధానం ( అష్టావధానం,శతావధానం,సహస్రవదనం)
మా నిజాం రాజు తరతరాల బూజు – దశరధికృష్ణమాచార్య
వట్టిమాటలు కట్టిపెట్టోయ్ , గట్టి మేలు తలపెట్టవోయ్ – మహాకవి గురజాడ
తూర్పు దేశాల ఇటాలియన్ – తెలుగు , ( ఇటలీ భాష కూడా అజంతంకావున)
జాతీయాలు
భగీరథ ప్రయత్నం – గొప్ప కృషి
గుండె కరిగింది – జాలి పడు
కొట్టిన పిండి. – నేర్పు,నైపుణ్యం
తలలో నాలుక – అనుకూలంగా
కలగాపులగం – గందరోళం
కళ్ళు కాయలు కాయటం – చాలా రోజుల నుండి ఎదురు చూడటం
పుక్కుటిపురాణం – అసత్యం
వీనులవిందు – అందమైన
కాలికి బుద్ది చెప్పు – పారిపోవడం
తుమ్మితే ఊడిపోయే ముక్కు. –
AP TET DSC 7TH CLASS TELUGU PART-1
చెవిలో పోరు
చెప్పులరగటం
శబ్ద పల్లవం
బయటపడు
చెప్పుకొను
ఏరుకొను
కూరుచు ఉండు
బుద్ధిగా ఉండు
సమాసాలు
తెలుగుభాష – తెలుగు అనే పేరు గల భాష
కోపాగ్ని. – కోపం వలన అగ్ని
హరికథ. – హరి యొక్క కథ
దేశభాష – దేశము నందలి భాషలు
సంధులు
అయ్యయ్యో = అయ్యో + అయ్యో
కుట్టుసూరు = కుఱు + ఉసూరు
కొట్టకొన = కొన + కొన
పట్టపగలు = పగలు + పగలు
అన్నన్న = అన్న + అన్న
చిట్టెలుక = చిఱు + ఎలుక
ఎట్లెట్లు = ఎట్ల + ఎట్ల
అహహా = ఆహా + ఆహా
ఆమ్రేడితసంధి
సూత్రం 1: అచ్చునకుఆమ్రేడితంపరమైనప్పుడుసంధిజరుగుతుంది.
సూత్రం 2 : ఆమ్రేడితంబుపరంబగునపుడుకదాదులతొలిఅచ్చుమీదివర్ణంబులకెల్లఅదంతంబగుద్విరుక్తటకారంబగు. తొలిఅచ్చుమీదివర్ణములకులోపంజరిగిఅకారాంతద్విరుక్తటకారంఆదేశముగావచ్చిచేరుతుంది.
సూత్రం 3: అందదుకుప్రభృతులుయధాప్రయోగంబుగగ్రాహ్యంబు
ద్విరుక్తటకారసంధి:
కుఱు, చిఱు, నడు, నిడుశబ్దాలలోఱ, డలకుఅచ్చుపరమైనపుడుఱ, డలస్థానంలోద్విరుక్తటకారం (ట్) వచ్చిచేరుతుంది.
సూత్రం : కుఱు, చిఱు, నడు, నిడు, శబ్దంబులకుఅచ్చుపరంబైనద్విరుక్తటకారంబగు.
AP TET DSC 7TH CLASS TELUGU PART-1
6)ఎందుకు పారెస్తాను నాన్న
రచన: ప్రక్రియ – కథ,ఇతివృత్తం – మానవ సంబంధాలు , రచయిత – చాగంటిసోమయాజులుమూలం : కథాస్రవంతి
పాత్రలు: కృష్ణుడు , నరసింహం,నాన్న,శకుంతల,
సంభాషణ
“కొత్త పుస్తకం వాసన భలే ఉంటుంది కదరా?”. నరసింహం కృష్ణుడు తో
“ తస్సా చెక్కా!ఆడపిల్లలు చేదివెస్తునారు కదా! ” నరసింహం కృష్ణుడు తో
“ ఎక్కడైనా చదువు మన్పించుతారా? ఋణమోపణమో చేసి ముక్క చెల్లించకపోతే కుర్రడెందుకుపనికొస్తడా? – కృష్ణుడు తల్లి,కృష్ణుడు తండ్రితో
“ ఇందాక చుట్టలకని డబ్బులు ఇచ్చాను ,డబ్బులున్నయా?పారేశావా? – కృష్ణుడు తండ్రి కృష్ణుడు తో
AP TET DSC 7TH CLASS TELUGU PART-1
7)శిల్పి
రచన : ప్రక్రియ – ఆధునిక పద్యం,ఇతివృత్తం – కళలు శిల్పం,కవి – గుర్రం జాషువా ,
మూలం – ఖండ కావ్యం మొదటి భాగం లోనిది
కవిపరిచయం
కవిపేరు : గుఱ్ఱంజాషువ.
కాలము : 1895 – 1971.
జన్మస్థలం: వినుకొండ, గుంటూరుజిల్లా.
రచనలు : గబ్బిలము,పిరదౌసి, ముంతాజ్మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తుకథ, నాకథ, స్వప్నకథ, కొత్తలోకము,ఖండకావ్యములు. (7 భాగములు)
బిరుదులు: కవికోకిల, పద్మభూషణ్, కళాప్రపూర్ణ, నవయుగకవిచక్రవర్తి.
అర్థాలు
దేవస్థలములు = దేవాలయాలు
గహ్వర శ్రేణి = గుహల శ్రేణి
= ఎప్పుడు ఉండేవాడు
= ఏడవడం
ప్రకృతి – వికృతి
సింహం – సింగం
స్తంభం – కంబం
నిద్ర – నిద్దుర
పుణ్యం – పున్నెం
సంధులు
రాజేంద్ర = రాజ + ఇంద్ర
గజేంద్ర =గజ + ఇంద్ర
మహేంద్ర =మహా + ఇంద్ర
పరోపకారం =పర + ఉపకారం
మహోన్నత =మహా + ఉన్నత
దేశోన్నత=దేశ + ఉన్నత
మాహర్షి =మహా + ఋషి
రాజర్షి =రాజ +ఋషి
సురేంద్ర =సుర + ఇంద్ర
దేవర్షి =దేవ + ఋషి
స్వాతంత్రోధ్యమం =స్వాతంత్ర్య + ఉద్యమం
పూర్వస్వరం ‘అ’; పరస్వరంస్థానంలోఇ, ఉ, ఋలుఇకలిసినపుడు ‘ఏ’, ‘ఉ’ కలిసినపుడు “ఓ’, ‘ఋ’ కలిసినపుడు ‘అర్’ ఆదేశంగావచ్చాయి. ఇలాఏర్పడేసంధినిగుణసంధిఅంటారు.
Content
జనపదంఅంటేగ్రామం. జనపదంలోనివసించేవాళ్ళుజానపదులు. వీళ్ళుప్రదర్శించే
కళలనుజానపదకళలుఅంటారు.
యక్షగానం, వీధినాటకం, వీరభద్రవిన్యాసాలు, హరికథ, ఒగ్గుకథ, బుర్రకథవంటివికొన్నిజానపదకళారూపాలు.
చిత్రలేఖనం, సంగీతం, శిల్పం, నృత్యం, కవిత్వంవంటివిలలితకళలు. భావంమనస్సుకు
హత్తుకొనేరకంగాబొమ్మనుగీయడంచిత్రలేఖనం.
వీనుల విందుగా ఉండేగానకళ సంగీతం. మనలనుకదలకుండా అనేకభావాలను మనసుకు అందించేకళ శిల్పకళ, రాగ, తాళ, లయ లకు తగినవిధంగా అభినయం చేయడం నృత్యకళ. ఒకభావాన్నిసూటిగాచెప్పకుండా మాటల వెనుక మరుగుపరచి మనసుకు ఉల్లాసం
కలిగించేవిధంగా పదాలనుకూర్చిచెప్పేదేకవిత్వం.
by admin | May 26, 2022 | ap new telugu content, AP TET Telugu, apt et telugu content, Dsc 2022, TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము, TS Telugu
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC

సంధులు ( 6 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు )
“పూర్వ పర స్వరంబులకు బర స్వరంబేకాదేశంబగుట సంధియనంబడు” అనగా మొదటి అచ్చునకు తరువాతి అచ్చు పరముకాగా ఆ రెండు అచ్చులకు మారుగ రెండవ అచ్చే ఆదేశమగుటను “సంధి” అని అంటారు.
రెండు సమర్ధవంతమైన పదాలు ఒక అర్ధవంతమైన పదంగా కలిసి పోవడాన్నే “సంధి” అంటారు.
సంధిలోని రెండు పదములను విడదీయునపుడు ” గుర్తునకు ఎడమవైపు ఉన్న పదాన్ని పూర్వ పదమనియు, కుడివైపున గల పదాన్ని పరపదమనియు అంటారు..
* ఉచ్ఛారణ సౌలభ్యం కోసం రెండు పదాలను వెంటవెంటనే కలిపి మాట్లాడవలసి, రాయవలసివచ్చినపుడు “సంధి పదం” ఏర్పడుతుంది.
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
* వ్యాకరణ పరిభాషలో రెండు స్వరాల కలయికను “సంధి” అని ఆ రెండు స్వరాల మధ్య జరిగే మార్పును “సంధికార్యం” అని అంటారు.
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
సంధులు రెండు రకాలు.
అవి.
1. సంస్కృత సంధులు
2. తెలుగు సంధులు
సంస్కృత సంధులు
1. సవర్ణదీర్ఘ సంధి
సూత్రం :’అ’ కార, ‘ఇ’ కార, ‘ఋ’ కారములకు సవర్ణములైన అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘములుఏకాదేశమగును.
ఉదా: ప్రళయ + అగ్ని = ప్రళయాగ్ని
స్నాన + అర్ధం – స్నానార్ధం
గౌరీ + ఈశ = గౌరీశ
భాను + ఉదయం = భానూదయం
శీత + ఆది = శీతాద్రి
పితృ + ఋణం = పితణం
అస్తోక + అంభోది = అస్తోకాంబోధి
జలజ + అంతస్థిత = జాలజాంతస్థిత
పరమ + అవధి = పరమావధి.
గోప + అరకుల్ = గోపారకుల్
దివిజ + అగ్రణి = దివిజాగ్రణి
దశ + అజ్ఞాలు = దశాబ్దాలు
మధురస + అశ్రుపూరము = మధురసాశ్రుపూరము
పీఠ + అధిపతి = పీఠాధిపతి
మహా + ఆత్మ = మహాత్మ
పండిత + ఆరాధ్యుడు పండితారాధ్యుడు
లతా + అంతము అతాంతము
గోవర్ధన + అది =, గోవర్ధనాద్రి
కవి + ఇంద్ర = కవీంద్ర
భూరూహ + ఆవళి = భూరూహావళి
శక్ర + ఆజ్ఞ = శక్రాష్ట్ర
గోత్ర + అచలము = గోత్రాచలము
నవ + ఆషాఢం = నవాషాఢం
స్ఫుట + ఆర్తి స్ఫుర్తి
విద్యా + అర్ధి = విద్యార్థి
ఉర్వి + ఈశ = ఉర్వీశ నల
(మధ్య + అహ్నం = మధ్యాహ్నం
లోల + అర్కుడు లోలార్కుడు
ఉత్సవ + అర్ధమై = ఉత్సవార్ధమై
ఇంద్ర + అగ్నులు = ఇంద్రాగ్నులు
శౌర్య + ఆది = శౌర్యాది
పుడమి + ఈశ = పుడమీశ
క్షీర + అభి = క్షీరాబ్ధి
హిమ + ఆలయం – హిమాలయం
ముని + ఇంద్రుడు = మునీంద్రుడు
మాతృ + ఋణం = మాత్రూణ౦
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
2.గుణ సంధి : –
సూత్రం:- అకారానికి ఇ, ఉ, ఋ లు పరమైనపుడు క్రమంగా ఏ, ఓ, అర్ ఏకాదేశం అవుతాయి.
ఏ, ఓ, అర్ లను గుణాలు అంటారు.
ఉదా:
అ + ఇ = ఏ నాగ +ఇంద్రము = నాగేంద్రము
అ + ఉ = ఓ మానవ + ఉత్తమ = మానవోత్తమ
అ + ఋ = ఆర్
* మహా + ఋషి = మహర్షి
నర + ఉత్తముడు = నరోత్తముడు
గణ + ఈశుడు = గణేశుడు
మహా + ఇంద్రుడు మహేంద్రుడు
మరికొన్ని ఉదాహరణలు:
గృహ + ఉపకరణం = గృహోపకరణం
మహా + ఉగ్ర =మహోగ్ర
దేవ + ఇంద్రుడు = దేవేంద్రుడు
కమఠ + ఇంద్ర కమరేంద్ర
దశ + ఇంద్రియ
దశేంద్రియ
ధీర + ఉత్తములు = ధీరోత్తములు
పర + ఉపకారము = పరోపకారము
ప్రయాణ + ఉచితమైన = ప్రయాణోచితమైన
సౌరభ + ఉత్కరము = సౌరభోత్కరము
ఛల + ఉక్తి = ఛలోక్తి
కౌతుక + ఉద్ధతి = కౌతుకోద్ధతి
శుభ + ఉదయ = శుభోదయ
పూర్ణ + ఉదయం = పూర్ణోదయం
హరణ + ఉద్యోగము = హరణోద్యోగము =
బక + ఉత్తమ = బకోత్తమ
జీవన + ఉపాధి = జీవనోపాధి
* ఇతర + ఇతర = , ఇతరేతర
గంగ + ఉత్తరీయం గంగోత్తరీయం
సూర్య + ఉదయం = సూర్యోదయం
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
ఉర్వి + ఈశ = ఉర్వీశ
లోల + అర్కుడు లోలార్కుడు
ఇంద్ర + అగ్నులు ఇంద్రాగ్నులు
పుడమి + ఈశ = పుడమీశ
ముని + ఇంద్రుడు = మునీంద్రుడు
హిమ + ఆలయం = హిమాలయం
3.యణాదేశ సంధి :
సూత్రం:- ఇ, ఉ, ఋ లకు అసవర్ణమైన (సమానంకాని) అచ్చులు పరమగునప్పుడు క్రమంగా య వ, ర లు ఆదేశమగును.
ఉదా:- ప్రతి + అక్షం = ప్రత్ + య్ + అక్షం = ప్రత్యక్షం
అణు + అస్త్రం = అణ్ + చ్ + అస్త్రం = అణ్వస్త్రం
పిత్రంశ మరికొన్ని
ఉదాహరణలు: ప్రతి + ఏకం ప్రత్యేకం
అణు +ఇంధనం = అణ్వింధనం
పితృ + అంశ = పిత్ + ర్ + అంశ
గురు + ఆజ్ఞ = గుర్వాజ్ఞ
పితృ + ఆర్జితము =పిత్రార్జితము
* అతి + అవసరం = అత్యవసరం
ప్రతి + ఉత్తరం = ప్రత్యుత్తరం
గురు + ఔన్నత్యం = గుర్వౌన్నత్యం
మాతృ + ఉపదేశం = మాత్రుపదేశం
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
4. వృద్ధి సంధి : సూత్రం: ‘అ’ కారానికి ఏ, ఐ లు పరమైతే ‘ఐ’ కారము ఓ, ఔ లు పరమైతే ‘ఔ’ కారము, ఋ ఋ లు పరమైతే ‘ఆర్’ వస్తుంది. (ఐ, ఔ అను వృద్ధులంటారు)
ఉదా: భువన + ఏక = భువనైక (అ ఏ ఐ)
రస + ఏక = రసైక
అఖండ + ఐశ్వర్యం = అఖండైశ్వర్య (అ ఐ ఐ)
దివ్య + ఐరావతం = దివ్మైరావతం
పాప + ఓఘం = పాపౌఘం (అ ఓ ఔ) *
పరమ + ఔషధం = పరమౌషధం (అఔఔ)
ఘన + ఓషధి = ఘనౌషధి =
ఋణ + ఋణం = ఋణార్ణం (అఋ ఆర్)
మరికొన్ని ఉదాహరణలు:
రస + ఔచిత్యం = రసౌచిత్యం
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
సుర + ఏక = సురైక
ఏక + ఏక = ఏకైక *
వన + ఓషది = వనౌషది
స్వరూప + ఔచిత్యం = స్వరూపౌచిత్యం
దేశ + ఔన్నత్యం = దేశాన్నత్యం
5. అనునాసిక సంధి;
సూత్రం:- క, చ, ట, త, ప లకు న, మ లు పరమైతే వాటి అనునాసికాక్షరములు)ఆదేశమగును.
ఉదా: వాక్ + మయము వాజ్మయము
జగత్ + నాటకము = జగన్నాటకము
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
16. విసర్గ సంధి :
జగత్ + నిలయము జగన్నిలయము
మరుత్ + నగము = మరున్నగము
1వ సూత్రం: హ్రస్వ అకారం మీది విసర్గకు ‘అవర్గం’ గాని, వర్గ తృతీయ, చతుర్ధ, పంచమాక్షరాలు గాని, హ, య, వ, ర, ల అనే అక్షరాలు గాని పరం అయితే విసర్గకు లోపం వచ్చి దానికి ముందున్న హ్రస్వ అకారానికి ఓకారం ఆదేశంగా వస్తుంది.
ఉదా: అయ:+ మయం= అయోమయం (అయస్ + మయం అసకు బదులుగా ఓ వస్తుంది)
ఇత: + అధికం = ఇతోధికం
పయః + ది = పయోధి
పయః + ధరం = పయోధరం
* పవనాంధః + లోకముల్ = పవనాంధోలోకముల్
యశః + వా = యశోవా
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
నమః + నమః = నమోనమః
మనః + హరం = మనోహరం
2 వ సూత్రం: విసర్గకు ముందు అకారేతర అచ్చు పరమగునపుడు విసర్గకు రేఫం అంటే ‘ర’ కారం
వస్తుంది.
ముహు: + ముహుః = ముహుర్ + ముహుః = ముహుర్ముహు:
అదే విధంగా : చతుః + ముఖుడు = చతుర్ముఖుడు
ధనుః + బాణములు = ధరురాణములు
ఉదా:
మృత్యుః + వా = మృత్యుర్వా
ఆశీ: + వాదం = ఆశీర్వాదం =
దుః + అభిమానం = దురభిమానం
అంతః + మధనం = అంతర్మధనం
3వ సూత్రం: అహస్, స్వస్, ప్రాతస్, పునస్ శబ్దాల ‘స’ కారానికి ‘ర’ కారం వస్తుంది.
ఉదా:
అహః + నిశలు = అహర్ + నిశలు, = అహర్నిశలు
అదే విధంగా : పునః + ముద్రించు = పునర్ముద్రించు
అంతః + జాతీయ = అంతర్జాతీయ =
పునః + ఉద్ధరణ = పునరుద్ధరణ
4 వ సూత్రం: విసర్గకు శ, ష, స లు పరమైతే శ, ష, స లే వస్తాయి.
ఉదా: సభ: + సుమం = సభస్సుమం, మనః + శాంతి = మనశ్శాంతి, చతు: + షష్టి = చతుషష్టి 6 వ సూత్రం: ఇస్, ఉస్ అంతంలో ఉన్న పదాలలో ‘స’ కారం ‘ష’ కారమవుతుంది. ఉదా: బహిస్ + కారం = బహిష్కారం
దుస్ + కరం = దుష్కరం నిస్ + కారణం = నిష్కారణం ధనుస్ + ఖండం = ధనుష్కండం
ధనుః + కోటి = ధనుష్కోటి –
6వ సూత్రం: విసర్గకు ‘శ, ష, స’ పరమైతే శ, ష, స లు ద్విత్వాలుగా మారతాయి. ఉదా: మనః + శాంతి = మనశ్శాంతి. చతుః + షష్టి = చతుషష్టి సభ: + సుమం = సభస్సుమం 7వ సూత్రం: విసర్గకు ‘చ, ఛ’ లు పరమైతే ‘శ’ కారం, ‘ట, ఈ లుపరమైతే ‘ష’ కారం, త, థ లు పరమైతే ‘స’ కారం వస్తుంది.
ఉదా: ని: + తేజము = నిస్తేజము
దుః + చేష్టితము = దుశ్చేష్టితము
ధనుః + టంకారము = ధనుష్టంకారము
మనః + తాపము = మనస్తాపము
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
8వ సూత్రం: విసర్గకు క, ఖ, ప, ఫ లు పరమైతే విసర్గకు ఎలాంటి మార్పురాదు. ఉదా: అంతః + పురము = అంతఃపురము ప్రాంతః + కాలము = ప్రాతః కాలము 7. శ్చుత్వ సంధి: సూత్రం: ‘స’ కార, త వర్గములకు, ‘శ’ కార, ‘చ’ వర్గము పరమగునపుడు ‘శ’ కార, ‘చ’ వర్గము లే వచ్చును.
ఉదా. సత్ + జనులు = సజ్జనులు
సత్ + చరిత్ర = సచ్చరిత్ర
యశస్ + చంద్రికలు = యశశ్చంద్రికలు
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
8. జశ్వసంథి :
సూత్రం : క, చ, ట, త, ప లకు వర్గ ప్రధమ ద్వితీయాక్షరాలు, శ, ష, స లు కాక మిగిలిన హల్లు గానీ, అచ్చులు గానీ పరమైతే గ, జ, డ, ద, బలు ఆదేశంగా వస్తాయి.
ఉదా, దిక్ + భ్రాంతి = దిగ్భ్రాంతి
వాక్ + దానం = వాగ్దానం
సత్ + ఆనంద = సదానంద
సత్ + భక్తులు సద్భక్తులు
దిక్ + అంతం = దిగంతం
వాక్ + యుద్ధం = వాగ్యుద్ధం
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
తెలుగు సంధులు
1. అత్వ సంధి (అకార సంధి) :
సూత్రం: అత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి బహుళము.
ఉదా:
ఎంత + అడలు’ = ఎంతడలు
రాక + ఉండినన్ = రాకుండినన్
ఎంత + ఒఱలు = ఎంతొఱలు
పుట్టిన + ఇల్లు = పుట్టినిల్లు
ఎచట + ఎచట = ఎచటెచట
పెసర + అప్పడం = పెసరప్పడం
లేక + ఏమి = లేకేమి
నాయన + అమ్మ = నాయనమ్మ
ఇంక + ఎవరు = ఇంకెవరు
చింత+ ఆకు = చింతాకు
ఒక + ఇంత = ఒకింత
2. ఇత్వ సంధి (ఇకార సంధి) :
సూత్రం: ఇత్తునకు అచ్చు పరమైనపుడు సంధి వైకలికంగా జరుగుతుంది.
ఉదా: ఏమి + అయ్యె = ఏమయ్యే
చొచ్చితిమి + ఏని = చొచ్చితిమేని
అది + ఎట్లు = అదెట్లు
లాలి + అనుచు = లాలనుచు
పైని + ఇడి = పైనిడి
ఒకటి + ఏ = ఒక్కటే
వచ్చిరి + అప్పుడు = వచ్చిరప్పుడు
రానిది + అని = రానిదని
అతనికి + ఇచ్చెను = అతనికిచ్చెను
కావాలి + అంటే = కావాలంటే
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
3. ఉత్వపంథి (ఉకార సంథి) : –
సూత్రం: ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యం.
ఉదా, అతడు + అట్లు = అతడట్లు
ఊరు + ఎల్ల =ఊరెల్ల
దిక్కు + ఇది = దిక్కిది
బిట్టు + ఉలికి = బిట్టుల్కి
దవ్వు + ఏగు = దవ్వేగు
రెండు + ఇక = లెండిక
నోరు + ఆచి = నోరాచి
నాకు + ఒక= నాకొక
ప్రాంతము + అంతా
ప్రాంతమంతా
దుర్బరము + ఐనా = దుర్ధరమైనా
నీవు + ఎక్కడ = నీవెక్కడ
4.యడాగమ సంధి :-
కాదు + ఏని = కాదేని
సూత్రం: సంధిలేని చోట స్వరంబు కంటె బరంబయిన స్వరంబునకు యడాగమంబగు.
ఉదా, నిగిడి + అడుగిడె = నిగిడి యడుగిడె
పెకల్చి + ఎత్త = పెకల్పియెత్త
నీ + అలఘు = నీయలఘు
నా+ ఎదుట = నాయెదుట
సెల + ఏఱు = సెలయేబు మేన + అత్త = మేనయత్త
ఎన్ని + ఏని = ఎన్నియేని
చెప్పినది + ఏమి =
చెప్పినదియేమి
6. ద్విరుక్తటకార సంధి :-
సూత్రం కుజు, చిబు, కడు, నడు, నిడు శబ్దముల “అడ” అకచ్చు పరంబగునప్పుడు ద్విరుక్తటకారంబగు.
ఉదా:
నిడు + ఊర్పు = నిట్టూర్పు
నడు + ఇల్లు = నట్టిల్లు
కడు + ఎదురు = కట్టెదురు
చిలు + ఎలుక = చిట్టెలుక
చిలు + అడవి = చిట్టడవి
6,సరళాదేశ సంథి (ద్రుతప్రకృతిక సంధి) : సమాసంలోనూ, సంయుక్త క్రియలలోనూ, ద్రుతం తర్వాత పరుషాలు సరళాలవుతాయి. (కావ్య భాషను నేర్చుకొనడానికి ఉపయోగపడే సంధి)
పురుషాలు అనగా – క, చ, ట, త, పలు
సరళాలు అనగా -గ, జ, డ, ద, బ,లు
1వ సూత్రం: ద్రుత ప్రకృతికం మీది పరుషాలకు సరళాలు వస్తాయి.
2వ సూత్రం: ఆదేశ సరళాలకు ముందున్న ద్రుతానికి బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి.
ఉదా: వేదిక( జాచు= వేదికన్ + చూచు
వేదికన్ + జూచు (1వ సూత్రం చే)
వేదికఁజూచు (2వ సూత్రం చే)
మరికొన్ని ఉదాహరణలు:
రాన్ + కలదు = రాఁగలదు
చచ్చియున్ + చావనివారు =
చచ్చియుఁజావనివారు
ప్రాణమున్ + తీయుట = ప్రాణముఁదీయుట
జున్ను విధానన్ + పట్టి = జున్ను విధానఁబట్టి
కానన్ + కాల్చు = కానఁగాల్చు
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
7.గపడదవా దేశ సంధి: –
1వ సూత్రం: ప్రధమ మీది పరుషములకు గసడదవలు బహుళము గానగు.
2వ సూత్రం: ద్వంద్వ సమాసంలో పదం తర్వాత గల పరుషాలకు గసడదవ లు ఆదేశంగా వస్తాయి.
ఉదా: కాయ + కూరలు = కాయగూరలు
ముద్దు + చేయు = మద్దుసేయు
అన్న + తమ్ములు = అన్నదమ్ములు
ఎక్కు + పెట్టి = ఎక్కబెట్టి
నీవు + టక్కరి = నీవుడక్కరి
ఊరు + పల్లెలు = ఊరువల్లెలు
రారు + కదా = రారుగదా
వాడు + కొట్టే = వాడుగొట్టె పా
లు + త్రావి = పాలుద్రావి
ప్రాణాలు + కోలోవు = ప్రాణాలు గోల్పోవు
ఆసు + పోయుట = ఆసుఖోయుట
టక్కు + టెక్కు = టక్కుడెక్కులు
కాలు + చేతులు = కాలుసేతులు
ఆ దేశ శత్రస్యా ఆగము మిత్రస్యా (కోడ్)
8.టుగాగమ సంధి : –
సూత్రం: కర్మధారయ సమాసంలో ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు ‘ట్’
ఇలా ‘ట్ ఆగమంగా రావడాన్ని టుగాగమ సంధి అంటారు.
ఉదా: తూగుటుయ్యేల, పులుంగుటెకిమీడు – ఇవి కర్మధారయ సమాసాలు
ఈ పదాలను విడదీస్తే క్రింది విధంగా ఉంటాయి.
తూగు + ఉయ్యేల
పులుంగు +ఎకిమీడు
వీటిలో మొదటి పదం చివర హ్రస్వ ఉకారముంది.
రెండవ పదం మొదట అచ్చు ఉంది. వీటికి ‘ట్ ఆగమంగా వస్తుంది.
తూగు +ట్ + ఉయ్యేల = తూగుటుయ్యేల
పులుంగు + ట్ + ఎకిమీడు
పులుంగుటెకిమీడు
మరికొన్ని ఉదాహరణలు:
కఱకు + అమ్ము = కఱకు +ట్ + అమ్ము = కఱకుటమ్ము
నిగ్గు + అద్దము = నిగ్గు +ట్ + అద్దము = నిగుటద్దము
తేనె + ఈగ = తేనెటీగ
పల్లె + ఊరు = పల్లెటూరు
చిగురు + ఆకు = చిగురుటాకు
పొదరు + ఇల్లు = పొదరుటిల్లు
ముద్దు + ఉంగరం = ముద్దుటుంగరం
9. రుగాగమ సంధి: పేద, బీద, ముద్ద, బాలెంత, కొమ, జవ, అయిదవ మొదలైన
శబ్దాలను పేదాది శబ్దాలు అంటారు.
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
1వ సూత్రం: కర్మధారయ సమాసంలో పేదాది శబ్దాలకు ‘ఆలు’ శబ్దం పరమైతే ‘రు’ గాగమం వస్తుంది.
ఉదా: పేదరాలు = పేద + ఆలు
బీదరాలు = బీద + ఆలు
పేద మొదలైన పదాలకు ‘ఆలు’ పదం పరమైతే ‘రు’ ఆగమంగా వస్తుంది.
దీన్నే రుగాగమం అంట.
అపుడు…….
పేద + ర్ + ఆలు = పేదరాలు
బీద + ర్ + ఆలు = బీదరాలు
మరికొన్ని ఉదాహరణలు:
ముద్ద + ఆలు =ముద్దరాలు నందు
బాలెంత + ఆలు = బాలెంతరాలు
అయిదవ + ఆలు = అయిదవరాలు
2వ సూత్రం: కర్మధారయంబు సందత్సమంబులకాలు శబ్దము పరంబగునపుడు డత్వంబునకుత్వంబు రుగాగమంబును అగు. ధీర, గుణవంత, ధనవంత, సంపన్న గంభీర, ధైర్యవంత – ఇలాంటి పదాలు “తత్సమ పదాలు” అంటారు. తత్సమ పదాలకు ‘ఆలు’ పదం పరమైతే ఆ తత్సమ పదాలకు చివరన్న అకారం అవుతుంది. ఆర్” ఆగమంగా వస్తుంది.
ఉదా.
ధీర + ఆలు = ధీరు + ర్ + ఆలు = ధీరురాలు
గుణవంతు + ర్ + ఆలు = గుణవంతురాలు
నాయక + ఆలు = నాయకురాలు
10. నుగాగమ సంధి:-
1వ సూత్రం: ఉదంతమగు తద్ధర్మార్ధక విశేషణానికి అచ్చు పరమైతే నుగాగమం వస్తుంది.
(ఎగురు, పల్కు, ఉండు, చేయు, వచ్చు)
ఉదా. చేయి + అతడు = చేయునతడు
భక్త + ఆలు = భక్తురాలు
వచ్చు + ఒక = వచ్చునొక
2వ సూత్రం: షష్ఠీ తత్పురుష సమాసంలో ఉకార, ఋకారాలకు అచ్చుపరమైతే నుగాగమం!
వస్తుంది.
ఉదా. రాజు + ఆజ్ఞ = రాజునాష్ట్ర
3వ సూత్రం:
ఉదా: తళుకు + గజ్జెలు- తళుకుఁగజ్జెలు
విధాతృ + ఆనతి = విధాతృనానతి
తళుకునజ్జెలు = తళుకుంగజ్జెలు
1. ఉత్తు చివరగల స్త్రీ సమాలు అయినందు వలన నుగాగమం వచ్చింది.
ఆ) ఉన్నతంపు + గొడుగు- ఉన్నతంపు గొడుగు
ఉన్నంతపునొడుగు
ఉన్నంతపుంగొడుగు
2. పుంపులకు సరళాలు, పరుషాలు పరమైతే ‘ను’
ఇ) సరసము + తనము = సరసపున్దనము =
తెల్ల + తనము = : తెల్లన్దనము
కు లోపం కాని, సంశ్లేషగాని జరుగుతుంది.
3. ఉదంత స్త్రీసమాలకు, పుంపులకు అచ్చు అంతంగా ఉండే గుణవాచక (తెల్ల, పచ్చ మొదలగు) శబ్దాలకు ‘తనము’ పరమైతే నుగాగమం వస్తుంది.
11. దుగాగమ సంధి: –
సూత్రం: నీ, నా, తన శబ్దాలకు ఉత్తరపదం పరమైనప్పుడు దుగాగమం విభాషగా వస్తుంది.
ఉదా: నా + విభుడు = నాదు విభుడు
నీ + భవనం = నీదుభవనం
తన + ప్రాణేశుడు = తనదు ప్రాణేశుడు
గమనిక: పై ఉదాహరణల్లో ‘దు’ ఆగమంగా వచ్చింది కనుక దీనిని దుగాగమ సంధి అంటారు.
ఇలాంటి రూపాలు ఇప్పుడు మనం రాస్తున్న భాషలో లేవు. ఇవి కావ్యాలలో కన్పించే రూపాలు.
12.పడ్వాది సంధి:
సూత్రం: పడ్వాదులు(పడు, వడి, పట్టె, పెట్టు) పరమగునప్పుడు ము వర్గానికి లోప పూర్ణ బిందువులు
విభాషగా వస్తాయి.
ఉదా: ఆశ్చర్యము + పడి = ఆశ్చర్యపడి
భయము + పడి = భయపడి /భయంపడి.
ఆధారము + పడి = ఆధారపడి
కష్టము + పడి కష్టపడి –
ఆరాటము + పడు = ఆరాటపడు
13. పుంప్వాదేశ సంధి:
సూత్రం: కర్మధారయంబు నందు ము వర్ణకమునకు పుంపులగు.
ఉదా: పూర్వము + రోజులు పూర్వపు రోజులు మానవత్వము + విలువలు = మానవత్వపు విలువలు
రక్తము + పోటు = : రక్తపుపోటు
రాగితము + గుండెలు = : కాగితపు గుండేలు
యుద్ధము + దొరకంచులు = యుద్ధపు దొరకంచులు
గంధము + చెక్క గంధపు చెక్క
సరసము + మాట – సరసపుమాట (సరసంపుమాట)
సింగము + ఆదము – సింగపు కొదము
కొంచెము + నరుడు = కొంచెపు నరుడు
ముత్యము + సరులు = ముత్యపుసరులు ,
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
14. ప్రాతాది సంధి : ప్రాతాదులనగా ప్రాత, లేత, క్రొత్త, చెన్ను, క్రింద, రెంపు మొ|| బహుళవు జరుగుతుంది.
1వ సూత్రం: ప్రాతాది శబ్దాల తొలి అచ్చు మీది వర్గాలకు
ఉదా: లేత + మొగ్గ = లేమొగ్గ
లేత + నగవు = లేనగవు
రెండో పదం మొదటి హల్లు పరుషమైతే సరళంగా మారుతుంది.
ఉదా: ప్రాత + పలుకు = ప్రాబలుకు
లేత + కొమ్మ = లేగొమ్మ
పూవు + తేనె = పూదేనె
మీదు + కడ = మీగడ
పూవు + తోట = పూదోట
చెన్ను + తొవ = చెందొవ
పది + తొమ్మిది = పందొమ్మిది
| 2వ సూత్రం: కెంపు, చెన్ను, ముందు, మొదలైన శబ్దాలలో చివరి అక్షరానికి లోపం వస్తుంది.
ఉదా:
కెంపు + తమ్మి = కెందమ్మి
చెన్ను + కావి = చెంగావి
ముందు + చేయి = ముంజేయి
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
| 3వ సూత్రం: క్రిందు శబ్దంలో తొలి అచ్చుమీది వర్ణాలకు లోపమూ, తొలి అచ్చుకు దీర్ఘముగా వస్తుంది
క్రిందు + కన్ను = క్రీగన్ను క్రిందు + నీడ = క్రీనీడ
4వ సూత్రం: క్రిత్తాది శబ్దాల తొలి అచ్చుమీది వర్ణాలకు లోపమూ మీది హల్లుకు ద్విరుక్తా వస్తుంది.
ఉదా:
క్రొత్త + కారు = తొక్కారు
నిండు + వెఱ = నివ్వెలు
అన్ని నాళ్ళు = అన్నాళ్ళు
నెఱు + మది = నెమ్మది
క్రొత్త ,చేద శబ్దాలకు తొలి అచ్చుమీది వర్ణాలకు కొన్ని చోట్ల అనునాసికంఆదేశమవుతు .
ఉదా:
క్రొత్త + చాయ = క్రొంజాయ
చేద + తాడు = చేంతాడు
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
5వ సూత్రం: మూడు శబ్దం మీద హల్లు పరమైతే తొలి అచ్చుమీది వర్ణాలకు లోపమూ, తొలి అచ్చు
హ్రస్వం కావడమూ, తరువాత హల్లు ద్విరుక్తం కావడమూ జరుగుతుంది.
ఉదా: మూడు + మారు =ముమ్మారు
మూడు + పాతిక = ముప్పాతిక
మూడు + లోకాలు = ముల్లోకాలు
గమనిక: నాళ్ళు (నాడులు) పరమైనప్పుడు మూడు శబ్దంలో దీర్ఘం హ్రస్వం కాదు.
ఉదా: మూడు + నాళ్ళు మూన్నాళ్ళు,
మూణాళ్ళు.
15. ఆమ్రేడిత సంధి:
1వ సూత్రం: అచ్చున కామ్రేడితం పరంబగునప్పుడు సంధియగు.
ఉదా: పగలు + పగలు = పట్టపగలు
కడ + కడ = కట్టకడ
ఎదురు + ఎదురు = ఎట్టయెదురు
బయలు + బయలు = బట్టబయలు
కొన + కొన = కొట్టకొన
చివర + చివర = చిట్టచివర
తుద + తుద = తుట్టతుద.
పిడుగు + పిడుగు = పిట్టపిడుగు
మంట ఒక్క + ఒక్క = ఒక్కొక్క
ఏమి + ఏమి = ఏమేమి +
ఓరి + ఓరి = ఓరోరి
ఎన్ని + ఎన్ని = ఎన్నెన్ని
2వ సూత్రం : ఆమ్రేడితం పరమగునప్పుడు కడాదుల తొలి అచ్చుమీది వర్ణాలకెల్లా అందంతమగు
ద్విరుక్తమగు ద్విరుక్తటకారం వస్తుంది.
లు, ల, నలసంథి : లు, ల, న లు పరమైనపుడు ఒక్కొక్కపుడు ‘ము’ వర్గానికి లోపమూ,
దాని పూర్వ స్వరానికి దీర్ఘమూ వస్తాయి.
ఉదా: పుస్తకము + లు = పుస్తకాలు
జీవితము + న = జీవితాన
దేశము + ల = దేశాల
వృక్షము + న = వృక్షాన
17.త్రిక సంథి : ఆ, ఈ, ఏ లను త్రికం అంటారు. అవి దీర్ఘాచ్చులు. ఆ, ఈ, ఏ లలో పూర్వ పదంగా ఉంటుంది. దాని మీద చేరే పదం హల్లుతో మొదలవుతుంది. సంధి జరిగినప్పుడు ఆ, ఈ, ఏ లు హ్రస్వాలు అవుతాయి. వాటి తరువాత వచ్చిన హల్లు ద్విరుక్తమవుతుంది.
1వ సూత్రం: ఆ, ఈ, ఏ అను సర్వనామాలు త్రికంబునాబడు
ఉదా: అమ్మేఘచయంబులు
ఇమ్మహోగ్ర సలిలంబు = ఈ + మహోగ్ర సలిలంబు = ఇ + మ్మహోగ్ర సలి లంబు = ఇమ్మహోగ్ర సలిలంబు ఆ + వారల అవ్వారల.
ఆ + కొమరుండు అక్కొమరుండు
మరికొన్ని ఉదాహరణలు.
ఏ + విధము = ఎ + వ్విధము = ఎవ్విధము.
ఆ + కన్య = అ + క్కన్య = అక్కన్య
ఆ + నలువురు = అ + న్నలువురు = అన్నలువురు ఆ + తరి
అ + తరి = అత్తరి
ఆ + ధరణీసురుడు = అ + ద్ధరణీసురుడు = అద్ధరణీసురుడు
ఆ + చోట = అ + చ్చోట = అచ్చోట
ఆ + తన్వి = అ +త్తన్వి = అత్తన్వి
ఏ + అది = ఎయ్యది (యడాగమ త్రిక సంధి)
ఆ + అనిమిషనది = అయ్యనిమిషనది (యడాగమ త్రిక సంధి)
ఆ + అనలుడు = అయ్యనలుడు (యడాగమ త్రిక సంధి)
For more
My Class Notes
TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి
అలంకారాలు Usefull for TS AND AP Best Notes
TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన
TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం
My Vijetha
Telugu e Tutor
aptet2022, apdsc 2022, ap tet 2021 syllabus, ap dsc 2021 notification, apdsc 2021, ap dsc 2021, ap dsc official website, ap dsc 2021 syllabus, ap dsc 2020 notification, ap tet 2022 syllabus, ap dsc website, ap dsc full form, ap dsc 2020 age limit, ap dsc books, ap tet notification 2021 date, ap dsc books online, aptet 2022 notification, ap dsc qualification, ap dsc jobs, ap dsc age limit 2021, ap tet age limit 2021, ap tet 2022 notification, ap tet 2022, ap dsc 2022, ap dsc vacancies 2021, aptet2022.in, ap tet 2021 exam date, ap dsc 2022 notification, aptet telugu, apdsc telugu, ap tet maths, apdsc maths , apdsc new content , aptet new content, tet dsc best grammer, అలంకారాలు ts and ap tet and dsc best notes, సంధులు ts and ap tet and dsc best notes
by admin | May 26, 2022 | ap new telugu content, AP TET Telugu, TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము
TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము

* కర్త ప్రధానంగా కలిగే వాక్యాలు కర్తరీ వాక్యాలు.
కర్తరీ వాక్యం : కర్త ప్రధానంగా ఉంటుంది.
1. రాముడు విభీషణుని రక్షించాడు.
2. రాముడు రాక్షసులను సంహరించాడు.
* అంటే కర్తరీ వాక్యంలో కర్తకు ప్రధమా విభక్తి వస్తుంది. కర్మకు ద్వితీయా విభక్తి వస్తుంది. కర్మణి వాక్యం : దీనిలో కర్మ ప్రధానంగా ఉంటుంది.
* కర్మణీ వాక్యంలో కర్తకు తృతీయా విభక్తి, కర్మకు ప్రధమా విభక్తి వస్తుంది. ఆ
* కర్మ ప్రధానంగా కలిగే వాక్యాలు కర్మణీ వాక్యాలు.
* కర్మణీ వాక్యంలో కర్మ ప్రధానంగా ఉంటుంది. చేసే పనిని తెలియజేసే పదం కర్మ అయితే, పనిని చేసేవాడు కర్త, కర్మణీ వాక్యంలో ‘బడు, బడి’ అనేవి క్రియను అనుసరించి ఉంటాయి. ప్రయోగం తెలుగులో లేదు. అది ఇతర భాషల నుండి వచ్చింది. ‘బడు, బడి’కి అసలు రూపం పడు, పడి అనునవి.
1. రామునిచే విభీషణుడు రక్షింపబడెను.
2. రామునిచే రాక్షులు సంహరింపబడిరి.
* మొదటి వాక్యంలో ఏకవచనం,
రెండవ వాక్యంలో బహువచనం ఉన్నందున
క్రియ మొదటి దాంట్లో ఏక వచనంగానూ, రెండవ వాక్యంలో బహువచనంగానూ ఉంది.
* పై రెండు వాక్యాలను కర్తరీ వాక్యంలోకి మార్చగా,
కొన్ని ఉదాహరణలు
1. రామకృష్ణారామ్లు ఆమోదముద్ర వేశారు. (కర్తరీ)
రామకృష్ణారావు గారిచే ఆమోదముద్ర వేయబడింది. (కర్మణీ వాక్యం)
2 దున్నేవానికి భూమినిచ్చే హక్కు తయారయ్యింది. (కర్తరీ)
దున్నేవానికి భూమినిచ్చే హక్కు తయారు చేయబడింది. (కర్మణీ)
3. బూర్గులవారు మంచి నిర్ణయాలు తీసుకున్నారు. (కర్తరీ)
బూర్గుల వారి చేత మంచి నిర్ణయాలు తీసుకోబడ్డాయి. (కర్మణీ)
4. రేఖా మాత్రంగా నా భావాలు ఇక్కడ పొందుపరిచారు. (కర్తరీ)
రేఖా మాత్రంగా నా భావాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి. (కర్మణీ)
5, ఆయన కన్నుమూసిన విషయం పత్రికలో రాశారు. (కర్తరీ)
ఆయన కన్నుమూసిన విషయం పత్రికలో రాయబడింది. (కర్మణీ)
6. పర్షియన్ ట్యూటర్‌గా ఆయన కొంతకాలం పనిచేశారు. (కర్తరీ)
పర్షియన్ ట్యూటర్ గా ఆయన కొంతకాలం పనిచేయబడ్డారు. (కర్మణీ)
7. వాల్మీకి రామాయణాన్ని రాశారు. (కర్తరీ)
రామాయణము వాల్మీకి చేత రాయబడింది(కర్మణీ)
8. వాల్మీకి రామాయణం రచించెను. ( కర్తరీ)
రామాయణం వాల్మీకిచే రచింపబడింది. (కర్మణీ)
9. శివాజీ రోషనారను తిరస్కరించెను.(కర్తరీ)
రోషనార శివాజీ చేత తిరస్కరించబడింది. (కర్మణీ)
TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము
10.డీప్ ఫ్రిజ్ నుండి అప్పుడే బయటకు తెచ్చిన ఆహారం సేవిస్తాడు.(కర్తరీ)
డీప్ ఫ్రిజ్ నుండి అప్పుడే బయటకు తేబడిన ఆహారాన్ని సేవిస్తాడు. (కర్మణీ)
1 1.ఇవి రచించి ఇంచుమించు పదునైదు వర్షములు గడిచినవి.(కర్తరీ)
ఇవి రచింపబడి ఇంచుమించు పదునైదు వర్షములు గడచినవి. (కర్మణీ)
12 చాసో బొండు మల్లెలు రచించినాడు. (కర్తరీ
బొండు మల్లెలు చాసో చేత రచింపబడింది. (కర్మణీ)
TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము
13.విప్లవ భావాలు నాలో వర్ధిల్లాయి. (కర్తరీ)
నాలో విప్లవ భావాలు వర్ధిల్లబడ్డాయి. (కర్మణీ)
14.ఆ పద్యం పూర్తి కాకముందే పై కప్పీలో ఇరుక్కున్న తీగను సవరించారు. (కర్తరీ)
ఆ పద్యం పూర్తి కాకముందే పై కప్పీలో ఇరుక్కున్న తీగ సవరించబడింది. (కర్మణీ)
15.చంద్రమతి పాత్రను స్థానం నరసింహారావు ధరించారు. (కర్తరీ)
చంద్రమతి పాత్రను స్థానం నరసింహారావు చే ధరించబడింది. (కర్మణీ)
16, రాముడు సీతను పెండ్లాడాడు. (కర్తరీ)
సీత రామునిచే పెండ్లాడబడింది. (కర్మణీ)
TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము
17.అని నవీన పద్ధతుల పై నిర్మించిన అత్యంత నవీన పరికరాలతో అమర్చిన ఆదర్శ గృహమది. (కర్తరీ)
అతి నవీన పద్ధతులపై నిర్మించి, అత్యంత పరికరాలతో అమర్చబడిన ఆదర్శ గృహమది. (కర్మణీ)
18.బాలు ఇసుకతో ఇల్లు కట్టాడు (కర్తరీ),
బాలుచే ఇసుకతో ఇల్లు కట్టబడింది. (కర్మణీ)
19.ఆళ్వారు స్వామి “చిన్నప్పుడే” అనే కథను రాశాడు. (కర్తరీ)
చిన్నప్పుడే అనే కథ ఆళ్వారు స్వామిచే వ్రాయబడింది. (కర్మణీ)
For more
My Class Notes
TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి
అలంకారాలు Usefull for TS AND AP Best Notes
TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన
TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం
My Vijetha
Telugu e Tutor